Search
  • Follow NativePlanet
Share
» »భారతదేశంలోని ఏకైక పురుష న‌ది ఇదే..!

భారతదేశంలోని ఏకైక పురుష న‌ది ఇదే..!

భారతదేశంలోని ఏకైక పురుష న‌ది ఇదే..!

హిందూ మతం ప్రపంచంలోనే అతి పురాతన మతంగా విరసిల్లుతుంది. హిందూ మతంలో, నదుల నుండి చెట్ల వరకు ఆవులు మొదలైన జంతువులు చాలా గౌరవనీయమైనవి గా పరిగణించబడ‌తాయి. దీనిని బ‌ట్టి హిందూ మతంలో ప్రకృతికి ఎంత ప్రాధాన్యత ఇవ్వబడిందో మీరు ఊహించవచ్చు. ప్రకృతిలో ముఖ్యమైన భాగంగా పరిగణించబడే నదులు కూడా ఇందులోకే వస్తాయి. భారతీయ సంస్కృతిలో, నదులను దేవతలుగా పూజిస్తారు.

గంగా నుండి సరస్వతి న‌దుల వరకు దేవతల రూపంలో పూజించినట్లే. కానీ, దేశంలో ఎక్కువ శాతం న‌దుల పేర్ల‌ని మహిళ‌ల పేర్లే ఉంటాయి. ఒక్క న‌ది మాత్ర‌మే పురుష న‌దిగా పిల‌వ‌బ‌డుతుంది. అదే బ్రహ్మపుత్ర నది. బ్రహ్మ బిడ్డగా ప్రసిద్ధి చెందిన ఈ న‌దిని దేశంలోని ఏకైక పురుష నదిగా పిలుస్తారు. దీనిని ఇతర మతాల ప్రజలు అంటే జైన, బౌద్ధమత ప్ర‌జ‌లు కూడా పూజిస్తారు. ఈ నది ప్ర‌త్యేక‌త‌లేంటో తెలుసుకుందాం రండి.

1

టిబెట్‌లో పుట్టింది..

భారతదేశంలోని ఏకైక మగపేరుగ‌ల నదిని బ్రహ్మపుత్ర నది అని పిలుస్తారు. ఎందుకంటే బ్రహ్మపుత్రను బ్రహ్మ దేవుడు అని పిలుస్తారు. ఈ నది హిందువులకు పూజనీయమైనది. ఇది చైనాలోని టిబెట్ లో పుట్టింది. అక్కడ దీన్ని యార్లంగ్ త్సాంగ్పో అని పిలుస్తారు. బ్రహ్మపుత్రను హిందువులు, జైనులు, బౌద్ధులు అత్యంత భక్తిశ్ర‌ద్ధ‌ల‌తో దేవత నదిగా కొలుస్తారు. బ్రహ్మపుత్ర నది ఒక పెద్ద సరస్సు. చాంగ్ థాంగ్ పీఠభూమి నుండి ఈ న‌ది ఉద్భవించిందని బౌద్ధమతం ప్రజలు నమ్ముతారు. మరోవైపు, సనాతన ధర్మ ప్రజలు బ్రహ్మపుత్ర నది బ్రహ్మ, అమోఘ ఋషి పుత్రుడు అని నమ్ముతారు.

నది ఎక్కడ ప్రవహిస్తుంది

బ్రహ్మపుత్ర నది హిమాలయాలకు ఉత్తరాన టిబెట్‌లోని పురంగ్ జిల్లాలో మానసరోవర్ సరస్సు సమీపంలో పుడుతుంది. ఈ నది భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాకుండా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించి, తిరిగి ఈ నది అస్సాం లోయలోకి ప్రవహిస్తుంది. ఆపై అక్కడ నుంచి బంగ్లాదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. బ్రహ్మపుత్ర నది భారతదేశంలో రెండవ అతిపెద్ద నది. భారతదేశంలో ఈ నది పొడవు 2900 కిలోమీటర్లు.

2

అందుకే బ్రహ్మపుత్ర నదికి ఆ పేరు వచ్చింది

బౌద్ధమతం ప్రకారం, ఈ నది ఇంతకు ముందు పెద్ద సరస్సుగా ఉండేది. అయితే ఈ సరస్సులోని నీరు హిమాలయాల దిగువ ప్రాంతాలకు కూడా చేరాలని, దాంతో ప్రజల నీటి అవసరాలు కూడా తీరుతాయని కరుణామయుడైన బోధిసత్వుడు భావించాడు. కాబట్టి ఈ సరస్సు నుండి నీటిని తీసివేసేందుకు ఒక ఛానల్‌ను కూడా నిర్మించ‌డం జ‌రిగింది. ఇది ఈ నదికి దారితీసింది. అప్ప‌టి నుండి దీనిని బ్రహ్మపుత్ర నది అని పిలవడం ప్రారంభించారు.

3

కొన్ని పౌరాణిక నమ్మకాలు

బ్ర‌హ్మపుత్ర నదిని దైవంగా, అద్భుతంగా పరిగణిస్తారు. ఇక్క‌డి పౌరాణిక నమ్మకాల‌ ప్రకారం, పుష్కర్‌లోని బ్రహ్మ ఆలయాన్ని సందర్శించిన తర్వాత, భక్తులు బ్రహ్మపుత్ర నదిలో స్నానం చేయాలి. ఆ స్నానం ఆచ‌రించిన వ్యక్తి దీని నుండి ప్రత్యేక ప్రయోజనాలను కూడా పొందుతాడని ఇక్క‌డి వారి న‌మ్మ‌కం. ఇలా చేయడం వల్ల బ్రహ్మదోషం కూడా ఉండదని అంటున్నారు. శారీరక బాధ‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుందని ఇక్క‌డికొచ్చే భ‌క్తుల విశ్వాసం.

ఈ నది మరో ప్రత్యేకత ఏమిటంటే ప్రతి సంవత్సరం జూన్‌లో నది నీరు మూడు రోజుల పాటు రక్తంలా ఎర్రగా మారుతుంది. బ్ర‌హ్మపుత్ర నది, కామాఖ్య ఆలయానికి ఆనుకొని ఉంది. ఈ మూడు రోజులు కామాఖ్య దేవి తన మాస చక్రంలో ఉంటుందని నమ్ముతారు. ఈ కారణంగా బ్రహ్మపుత్ర నది మూడు రోజుల పాటు రక్తం రంగులోకి మారుతుందని పురాణాలలో చెప్పబడింది.

More News

    Read more about: brahmaputra river himalayas
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+