Search
  • Follow NativePlanet
Share
» »ప్ర‌కృతి అందాల‌కు నిల‌యం ఈ మినీ కాశ్మీర్‌..

ప్ర‌కృతి అందాల‌కు నిల‌యం ఈ మినీ కాశ్మీర్‌..

ప్ర‌కృతి అందాల‌కు నిల‌యం ఈ మినీ కాశ్మీర్‌..

కొన్ని చోట్ల చిన్న‌పాటి చినుకులు కురుస్తున్నా, మ‌రికొన్ని ప్రాంతాల్లో మాత్రం వేడిసెగ‌లు త‌గ్గ‌డం లేదు. ఇక‌, కొన్ని న‌గ‌రాల్లో అయితే మాత్రం అస‌లు చినుకు జాడే లేదు. దాంతో న‌గ‌రాల్లోని ప్ర‌జ‌లు ఈ వేస‌వి వేడి నుండి ఉప‌శ‌మ‌నం పొందేందుకు చ‌ల్లని వాతావ‌ర‌ణం కోసం వెదుకులాట ప్రారంభించారు. ఏదైనా చ‌ల్ల‌ని ప్రాంతాల‌కు వెళితే బాగుండు అని అనుకుంటున్నారు. ప్ర‌శాంత‌మైన, చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణం కావాల‌నుకునే వారు మాత్రం ఉత్త‌రాఖండ్ కాశ్మీర్ అని పిలువ‌బ‌డే ఈ ప్రాంతాన్ని సంద‌ర్శించ‌డం మాత్రం మ‌ర‌వొద్దు.. రండి భార‌త‌దేశంలోని మినీ కాశ్మీర్‌లోని పితోర్‌ఘ‌ర్ గురించి ఇప్ప‌డు తెలుసుకుందాం.

1

ఉత్తరాఖండ్ మున్సియరి

ఉత్త‌రాఖండ్‌లోని మున్సియరీని తరచుగా "లిటిల్ కాశ్మీర్" అని పిలుస్తారు. ఇది ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్ జిల్లాలో ఉన్న ఒక అందమైన గ్రామం. 2298 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ అందమైన చిన్న కొండ పట్టణం మంచుతో కప్పబడి ఉంటుంది. అంతేకాకుండా, ఈ హిమాలయ శ్రేణి వీక్ష‌ణ‌లు ఇక్క‌డికి వ‌చ్చేప‌ర్యాట‌కుల‌ను క‌నువిందుచేస్తున్నాయి. ఈ అందమైన గ్రామం ఏడాది పొడవునా అద్భుతమైన వాతావరణాన్ని అందించ‌డంతో పాటు ఇక్క‌డికి స‌మీపంలోని పంచచూలి (ఐదు శిఖరాలు), నందా దేవి, నందా కోట్ యొక్క అద్భుతమైన వీక్షణలను ప‌ర్యాట‌కుల‌కు అందిస్తుంది.

2

చందక్ లోయ

చందక్ అనేది సోర్ లోయకు ఉత్తరం వైపున ఉన్న ఒక చిన్న ట్రెక్కింగ్ కొండ. పితోరఘర్ నుండి 8 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఈ అందమైన ప్రదేశంలో హ్యాంగ్ గ్లైడింగ్ వంటి సాహసాలను చేయొచ్చు. అంతే కాకుండా ఇక్కడి నుండి దాదాపు 2 కిలోమీట‌ర్ల‌ దూరంలో మోస్తమాను దేవాలయం కూడా ఉంది. ఆగస్టు మరియు సెప్టెంబరులో ఇక్క‌డి ఆలయంలో ఓ జాతరను నిర్వ‌హిస్తారు. ఆ జాత‌ర‌కు ఎక్క‌డెక్క‌డి నుండో చాలామంది ప‌ర్యాట‌కులు త‌ర‌లి వ‌స్తారు.

3

అస్కోట్ అభయారణ్యం

వన్యప్రాణుల ప్రేమికులకు మరియు వృక్షశాస్త్ర ప్రియులకు స్వర్గధామం ఈ అభ‌యార‌ణ్యం. అస్కోట్ అభయారణ్యం వృక్షజాలం మరియు జంతుజాలంతో అలంకరించబడి ఉంటుంది. 5412 మీటర్ల ఎత్తులో మరియు పితోర్‌గఢ్ నుండి 54 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉన్న ఈ ప్రదేశం చుట్టూ సుసంపన్నమైన మరియు సంపన్నమైన పరిసరాలు ఉన్నాయి. ఈ అభ‌యార‌ణ్యంలో పార్ట్రిడ్జ్, కోక్లా, భరల్, మంచు చిరుత, కస్తూరి జింక మొదలైన అనేక రకాల జంతువులను చూడొచ్చు. అస్కోట్‌లో వన్యప్రాణుల నివాసం కాకుండా అనేక దేవాల‌యాలు కూడా ఎంత‌గానో ప్ర‌సిద్ధి చెందాయి.

4

దిదిహత్ కూడా మంచి ప్రదేశం

ఉత్తరాఖండ్ తూర్పు మూలలో నెలకొని ఉన్న దిదిహత్ ప్రకృతి అందాలతో నిండిన అద్భుతమైన మరియు పురాతనమైన కొండ. ఈ ప్రదేశం చుట్టూ కైలాస మానస సరోవరంతో పాటు పాత కోటలు మరియు దేవాలయాల శిథిలాలు ఉన్నాయి. తూర్పు ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్ జిల్లాలో 1800 మీటర్ల ఎత్తులో ఉన్న దిదీహత్ అపారమైన ప్రకృతి సౌందర్యం మరియు శక్తివంతమైన హిమాలయాల‌తో ప‌ర్యాట‌కుల‌ను ఆహ్వానిస్తుంది. దీదీహత్ కైలాష్ మానసరోవర్‌కు ప్రసిద్ధ తీర్థయాత్ర మార్గంలో ఉంది.

పితోర్‌ఘర్ ఎలా చేరుకోవాలి

విమానమార్గం ద్వారా అయితే న్యూఢిల్లీ నుండి పంత్‌నగర్ విమానాశ్రయానికి నేరుగా విమానాలు ఉన్నాయి. నైని సైనీ విమానాశ్రయం - పితోర్‌ఘర్ ఎయిర్‌స్ట్రిప్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రధాన నగరంలో ఉంది.
రోడ్డు మార్గం ద్వారా అయితే ఢిల్లీ నుండి బ‌య‌లుదేరి ఆనంద్ విహార్ నుండి బస్సులో ప్రయాణించొచ్చు. బస్సు మార్గం ద్వారా అయితే పితోర్‌ఘర్ ఢిల్లీ నుండి సుమారు 460 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉంటుంది.
రైలు మార్గం ద్వారా అయితే పితోరఘర్ చేరుకోవాలంటే సమీప రైల్వే స్టేషన్ల‌యినా తనక్‌పూర్, బన్‌బాసా, చక్రపూర్ ద్వారా పితోర్‌ఘ‌ర్ చేరుకోవ‌చ్చు.

More News

Read more about: uttarakhand
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+