Search
  • Follow NativePlanet
Share
» »యుపీలోని ఈ ఆల‌యాన్ని అక్ష‌య తృతీయ నాడు త‌ప్ప‌క సంద‌ర్శించాల్సిందే..!

యుపీలోని ఈ ఆల‌యాన్ని అక్ష‌య తృతీయ నాడు త‌ప్ప‌క సంద‌ర్శించాల్సిందే..!

నేడు (మే 10) అక్ష‌య‌తృతీయ శుభ సంద‌ర్భంగా. చాలామంది ఈరోజు బంగారు అభ‌ర‌ణాల‌ను కొన‌డం. ల‌క్ష్మీదేవికి పూజ‌లు చేయ‌డం వంటివి చేస్తుంటారు. ఈ రోజున చాలామంది పుణ్య‌క్షేత్రాల‌ను కూడా ద‌ర్శించుకుంటుంటారు. అయితే, కేవ‌లం అక్ష‌య‌తృతీయ నాడు మాత్ర‌మే సంద‌ర్శించే ఆల‌యం ఒక‌టి భార‌త్‌లోని యుపీలో ఉంది. ఆ అల‌యంలో కేవ‌లం ఈ రోజు (అక్ష‌య తృతీయ‌) మాత్ర‌మే స్వామి వారి పాదాల‌ను ద‌ర్శించుకునే భాగ్యం ల‌భిస్తుంది. రండి ఆ ఆల‌య విశేష‌త‌లేంటో తెలుసుకుందాం పదండి.

ఈ ఆల‌యం ఉత్తర ప్రదేశ్‌లోని మధుర జిల్లా బృందావనంలో వెల‌సింది.ఈ ఆలయం పేరు బాంకే బిహారీ దేవాలయం. ఈ ఆలయంలో రాధా, కృష్ణుల మిశ్రమ రూపం కొలువై ఉంది. వీరిని దర్శించుకునేందుకు భ‌క్తులు నిత్యం ఇక్క‌డికి భారీ సంఖ్య‌లో భ‌క్తులు త‌ర‌లి వ‌స్తుంటారు. కానీ, ఇక్క‌డ కొలువై ఉన్న శ్రీ‌కృష్ణుని పాద సేవ మాత్రం చేసుకోలేరు. ఎందుకంటే, ఈ ఆల‌యంలోని బాంకే బిహారీ పాదాలు ఏడాది పొడవునా కన్నయ్యకు ధరింపజేసి దుస్తులతో కప్పబడి ఉంటాయి. అయితే బాంకే బిహారీ పాదాలను దర్శించుకునే అవకాశం కోసం భక్తులు ఎంత‌గానో ఎదురుచూస్తూ ఉంటారు. సంవ‌త్స‌రం పొడ‌వునా కేవ‌లం ఒకే ఒక్క‌సారి మాత్ర‌మే శ్రీ‌కృష్ణుని పాదాల ద‌ర్శ‌నం ల‌భిస్తుంది. అది కూడా కేవ‌లం అక్ష‌య తృతీయ నాడు మాత్ర‌మే.

bankebiharitemple1 mathura

శ్రీ‌కృష్ణుని పాదాల దర్శనం ..

బృందావ‌నంలో వెల‌సిన ఈ బాంకే బిహారి పాదాల‌ను ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల తృతీయ తిథి నాడు అంటే అక్షయ తృతీయ నాడు మాత్ర‌మే ద‌ర్శించే అవ‌కాశం ల‌భిస్తుంది. ఈ ఆల‌యంలోని భగవంతుని పాదాలను సంవ‌త్స‌రం పొడవునా వస్త్రాలతో కప్పి ఉంచుతారు.. ఏడాదికి ఒకసారి అంటే అక్షయ తృతీయ రోజున మాత్రమే పాద దర్శనం చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈరోజున శ్రీ‌కృష్ణుని పాదాల దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు ఆలయం వద్దకు చేరుకుంటారు.

బాంకే బిహారీ పాదాలను దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి మాత్రమే కాదు విదేశాల నుంచి కూడా భ‌క్తులు ఈ ఆల‌యానికి వ‌స్తుంటారు. అక్షయ తృతీయ సందర్భంగా బాంకే బిహారీ పాదాలను దర్శించుకోవడం వల్ల ప్రజలకు ఆనందం, అదృష్టం కలుగుతుందని ఇక్క‌డికి వ‌చ్చే వారి ప్రగాఢ విశ్వాసం. ఈ రోజున భగవంతుని పాదాలను దర్శించుకుంటే భక్తుల కోరికలను నెర‌వేరుతాయ‌ని, వారీ కష్టాలన్నీ తొలగిపోతాయని న‌మ్మ‌కం.

lordkrishnasfeetdarshan1

ఆల‌య చ‌రిత్ర‌..

ఈ ఆల‌య చరిత్ర కథనం ప్రకారం.. చాలా ఏళ్ల క్రితం ఇక్క‌డ ఉండే స్వామి హరిదాస్ భక్తి, ఆరాధనకు సంతోషించిన బాంకే బిహారీ నిధివన్‌లో కనిపించారు. స్వామి హరిదాస్ బాంకే బిహారీని ఎంతో భ‌క్తితో పూజించేవారు. అయితే, ఒక‌సారి హ‌రిదాస్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. అప్పుడు హ‌రిదాస్‌ స్వామి బాంకే బిహారీ పాదాల వద్ద బంగారు నాణెం కనిపించి స్వామి ఆర్ధిక కష్టాన్ని తీర్చింది. అలా ఆ స్వామిజీకి డబ్బు కొరత ఏర్పడినప్పుడల్లా ఠాకూర్ జీ పాదాల నుంచి బంగారు నాణేలు పొందేవాడని చరిత్ర చెబుతోంది. అందుకే అప్ప‌టినుంచి బాంకే బిహారీ జీ పాదాల దర్శనం నిత్యం భ‌క్తుల‌కు అందుబాటులో ఉండ‌దు. స్వామివారి పాదాలు ఏడాది పొడవునా దుస్తులతో కప్పబడి ఉంటాయి.

అక్షయ తృతీయ రోజున మాత్రమే ఆయన పాదాలు భ‌క్తుల‌కు దర్శనమిస్తాయి. ఎందుకంటే స్వామివారు తొలిసారిగా స్వామివారి పాద దర్శనం చేసుకున్న రోజు అక్షయ తృతీయ. అందుకే, అప్పటి నుంచి అక్షయ తృతీయ రోజున స్వామి పాదాల దర్శనం జ‌రుగుతుంది. మీరు కూడా ఈ అదృష్టాన్ని పొందాల‌నుకుంటే అక్క‌డికి వెళ్లాల్సిందే..!

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+