కలియుగ దైవం వేంకటేశ్వరుడి గురించి ఇప్పటికే మీరు ఎన్నో కథనాలు విని ఉంటారు. ముఖ్యంగా అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడైన ఆయన కొలువై ఉన్న తిరుమల దేవస్థానం ప్రపంచంలోని అతి సంపన్న దేవాలయాల్లో మొదటి వరుసలో ఉంటుందనడంలో అతి శయోక్తిలేదు. తిరుపతి బ్రహోత్సవాలు జరుగుతున్న ఈ సమయంలో ఆ వేంకటేశ్వరుడి వద్ద ఉన్న అత్యంత విలువైన ఓ వజ్రానికి సంబంధించిన వివరాలతో పాటు ఆ తిరుమలకు సంబంధిచిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ ఈ కథనంలో తెలుసుకొందాం.

వేంకటేశ్వరుడి బంగారు ఆభరణాలు
P.C: You Tube
వేంకటేశ్వరుడు కొలువై ఉన్న ఈ దేవాలయాన్ని ఆనంద నిలయం అని పిలుస్తారు. దేవాలయం గర్భగుడిలో స్వామివారి 8 అడుగుల ఎత్తైన విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహానికి ప్రతి రోజూ వివిధ రకాల వస్త్రాలు, ఆభరణాలతో అలంకరణ చేస్తూ ఉంటారు.

వేంకటేశ్వరుడి బంగారు ఆభరణాలు
P.C: You Tube
ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగినవి కొన్ని ఆభరణాలు ఉన్నాయి. అందులో 12 కిలోల బరువైన స్వర్ణమాల. ఈ స్వర్ణమాలను స్వామివారికి అలంకరణ చేయడానికి ముగ్గురు పండితులు అవసరమవుతారు.

వేంకటేశ్వరుడి బంగారు ఆభరణాలు
P.C: You Tube
అదే విధంగా స్వామివారి కిరీటంలో ఉన్న నీల వజ్రం గురించి ఇక్కడ చెప్పుకోవాలి. ప్రపంచంలో ఇటువంటి వజ్రం మరెక్కడా లేదని చెబుతారు. దీని విలుల కొన్ని లక్షల కోట్ల రుపాయలు ఉంటుందని పురోహితులు, నిపుణులు అంచనా వేస్తున్నారు.

వేంకటేశ్వరుడి బంగారు ఆభరణాలు
P.C: You Tube
కలియుగ దైవమైన ఈ వేంకటేశ్వరుడికి విలువైన కానుకలు ఇచ్చినవారిలో రాజేంద్ర చోళులుడు, శ్రీ క`ష్ణ దేవరాయులు మొదటి వరుసలో ఉంటారు. ఈ అభరణాల్లో కొన్ని ప్రతి రోజూ అలంకరణ చేస్తుండగా మరికొన్నింటిని ప్రత్యేక పర్వదినాల్లో మాత్రమే స్వామివారికి అలంకరణ చేస్తారు.

వేంకటేశ్వరుడి బంగారు ఆభరణాలు
P.C: You Tube
ఇందులో ప్రతి రోజూ మనం చూసే బంగారు ఆభరణాలకు సంబంధించి వేంకటాచల మహాత్మ్యం, ఆదిత్య, స్కంద, వరాహ పురాణాల్లో వివరించారు. ముందుగా ఆ స్వామి వారి పాదాలకు బంగారు తొడుగులు కనిపిస్తాయి.

వేంకటేశ్వరుడి బంగారు ఆభరణాలు
P.C: You Tube
అదే విధంగా పాదాల పైభాగాన పాదాభరణాలుగా చిరుగజ్జెలతో కళకళలాడుతూ ఉండే బంగారు నూపురాలు, వాటి పైన పాగడల్ అనే పాదాభరణాలు ఉంటాయి. అటు పై కాంచీగుణం అనే అలంకారం మొలనూలుగా, మధ్యాభరణంగా ఉంటుంది.

వేంకటేశ్వరుడి బంగారు ఆభరణాలు
P.C: You Tube
దాని పై భాగంలో ఉదరబంధం అనే స్వర్వాభరణం ఉంటుంది. ఆ టు పై దశావతరాలు, పంవ్యూహాలు, శ్రీ దేవి, భూదేవి స్వామివారి దశావతరాలతో కూడిన చిరు గంటల మొలతాడును చూడవచ్చు.

వేంకటేశ్వరుడి బంగారు ఆభరణాలు
P.C: You Tube
మరికొంత పైకి చూస్తే కంఠభూషణంగా చిన్న కంఠాభరణం, వక్షస్థలం వరకూ ఉండే పెద్ద కంఠాభరణం, హ`దయం వరకూ ఉండే బంగారు పులిగోరు హారం, నాభిస్థానం వరకూ అయిదు పేటలతో ఉండే గోపుహారం ఉంటాయి. దీనికి తోడు స్వామివారి యజ్జోపవీతం కూడా మనం చూడవచ్చు.

వేంకటేశ్వరుడి బంగారు ఆభరణాలు
P.C: You Tube
అటు పై ఆ స్వామివారి కటిహస్తం వరకూ నూట ఎనిమిది పత్రాలతో కూడిన తులసీ పత్రహారం విరాజిల్లుతూ ఉంటుంది. మోకాళ్ల వరకూ ఉండే 108 లక్ష్మీప్రతిమలతో కూడిన చతుర్భుజ లక్ష్మీహారం, నడుము కిందిదాకా ఉండే 108 నామాలు చెక్కిన బంగారు బిళ్లలతో కూడిన అష్టోతర, శతనామహారం కాంతులీనుతూ ఉంటుంది.

వేంకటేశ్వరుడి బంగారు ఆభరణాలు
P.C: You Tube
అటు పై స్వామివారి పాదాల వరకూ ఉండే బంగారు హారం ఒకటి ఉంటుంది. ఈ హారంలోని వెయ్యి బంగారు బిళ్లల మీద వెయ్యి నామాలు ఉంటాయి కనుక దీనిని సహస్రనామహారం అంటారు. ఆ తర్వాత నడుము నుంచి స్వామివారి పాదాల వరకూ ఉండే కఠారి వస్త్రానికి సంబంధించిన సూర్యకఠారి ఉంటుంది.

వేంకటేశ్వరుడి బంగారు ఆభరణాలు
P.C: You Tube
అత్యంత విలువైన రత్నాలు పొదిగిన వరద హస్తం అనే స్వామివారి కుడిచేయి, కటిహస్తం అనే స్వామివారి ఎడమ చేయి తొడుగులను చూడవచ్చు. భుకీర్తులు, చెవులకు ఉండే కర్ణ పత్రాలు, శంకచక్రాలు, స్వామివారి కిరీటం శివన్నీ సువర్ణ వజ్ర రత్నాల మేలు కలయికతో రూపొందించినవే.

వేంకటేశ్వరుడి బంగారు ఆభరణాలు
P.C: You Tube
అలంకార ప్రియుడైన శ్రీ వేంకటేశ్వరుడికి ఆభరణాల రూపంలో విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం శ్రీ వారి ఆభరణాలు, బంగారు వస్తువుల బరువు 12 టన్నులని చెబుతారు. వీటి విలుల కొన్ని లక్షల కోట్లు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు.

వేంకటేశ్వరుడి బంగారు ఆభరణాలు
P.C: You Tube
ఇవికాక టన్నుల కొద్ది బ్యాంకుల్లో స్వామివారి బంగారాన్ని డిపాజిట్ చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. సాధారణంగా స్వామివారికి కానుకుల రూపంలో అందే అన్ని బంగారు ఆభరణాలను స్వామివారికి అలంకరించలేరు. అందుకే ఆ భారణాలను ముంబై మింట్ కు తరలించి స్వచ్ఛమైన బంగారు కడ్డీలను తయారు చేసి వాటిని బంగారు కడ్డీలుగా నిల్వ చేస్తున్నారు.



Click it and Unblock the Notifications













