Search
  • Follow NativePlanet
Share
» »శివైఖ్యం చెందాలంటే ఈ మార్గాల్లో ప్రయాణిస్తే చాలు...

శివైఖ్యం చెందాలంటే ఈ మార్గాల్లో ప్రయాణిస్తే చాలు...

భారత దేశంలో అత్యంత ప్రమాదకరమైన రహదారులకు సంబంధించిన కథనం.

ఈ విశాల భారత దేశంలో భౌగోళికంగా విభిన్న పరిస్థితులు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో ఉంటే మరికొన్ని సమతల ప్రాంతంలో ఉన్నా అక్కడి వాతావరణం చాలా ఇబ్బంది పెట్టేదిగా ఉంటుంది.

దీంతో రవాణా మార్గాలు అత్యంత క్లిష్టంగా మారిపోయాయి. అయినా ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు అవసరమైన వస్తువులను తీసుకొని వెళ్లడానికి వీలుగా కొన్ని మార్గాలు నిర్మించారు. వీటిలో కొన్ని అత్యంత ప్రమాదకరమైనవి కూడా ఉన్నాయి. ఇలా భారత దేశంలో అత్యంత ప్రమాదకరమైన రోడ్డు మార్గాలకు సంబంధించిన కథనం మీ కోసం...

జోజీ లా పాస్

జోజీ లా పాస్

P.C: You Tube

భారత దేశంలోని అత్యంత ప్రమాదకరమైన రోడ్డు మార్గాల్లో జోజిలా పాస్ ఒకటి. ఈ మార్గంలో వెళ్లే సమయంలో కనురెప్ప మూసివేస్తే చాలు ఏకంగా 3,538 మీటర్ల ఎత్తు నుంచి లోయలోకి పడిపోతాం. అత్యంత ఇరుకైన మార్గమే కాకుండా ఇక్కడ ఎప్పుడు మంచు ఉంటుందో? ఎప్పుడు కరిగి పోతుందో తెలియని పరిస్థిది. శ్రీనగర్ నుంచి లేహ్ వచ్చే మార్గంలో మనకు ఈ రోడ్ కనిపిస్తుంది.

నెరాల్ మెథరాన్ రోడ్

నెరాల్ మెథరాన్ రోడ్

P.C: You Tube

మహారాష్ట్రలోని మెథరాన్ ప్రముఖ హిల్ స్టేషన్. ఈ మార్గంలోని రోడ్డు బాగుంటుంది. అయితే పాములా మెలికలు తిరిగి ఉంటుంది. ఈ మార్గంలో ప్రయాణించే సమయంలో ఖచ్చితంగా మీ గుండే నోటిలోకి వస్తుందని చెప్పడం అతిశయోక్తి కాదు. ఒక వేళ మీరు ఈ మార్గంలో ప్రయాణించలేమని భావిస్తే మిమ్ములను గమ్యస్థానం చేర్చడానికి ట్యాక్సీవాలాలు సదాసిద్ధంగా ఉంటారు.

నేషనల్ హైవే 22

నేషనల్ హైవే 22

P.C: You Tube

భారత దేశంలోని అత్యంత భయంకరమైన నేషనల్ హైవేల్లో 22 మొదటి స్థానంలో ఉంటుందని చెప్పడం అతిశయోక్తి కాదు. నరక దారి అని కూడా దీనికి పేరు. ప్రముఖ టీవీ ఛానల్ హిస్ట్రీ ఛానల్ తాను చేసిన ఒక ప్రోగ్రాంలో ఇట్స్ డెడ్లి ఎస్ట్ హైవే పేరుతో ఈ మార్గం దుస్థితిని చూపించింది.

ఛాంగ్ లా

ఛాంగ్ లా

P.C: You Tube

చైనా సరిహద్దులో ఉన్న ఈ మార్గం ఎప్పుడూ ముంచుతో కప్పబడి ఉంటుంది. అంతేకాకుండా చాలా చాలా ఇరుకైన మార్గం కూడా . అందువల్ల డ్రైవర్లు చాలా అప్రమత్తంగా ఉంటారు.

లేహ్ మనాలి హైవే

లేహ్ మనాలి హైవే

P.C: You Tube

ఈ ప్రాంతం ఎప్పుడూ ట్రాఫిక్ తో ఇబ్బంది పెడుతుంది. నత్తకంటే నిదానంగా ఇక్కడ వాహనాలు సాగుతాయి. మంచు తుఫాను ఈ మార్గంలో చాలా సర్వసాధారణం.

మున్నార్ రోడ్

మున్నార్ రోడ్

P.C: You Tube

ఇక్కడ రోడ్డు పామువలే మెలికలు తిరిగి ఉంటుంది. అందువల్లే ఈ ప్రాంతంలో ప్రయాణించడానికి చాలా మంది భయపడుతూ ఉంటారు. చుట్టూ పచ్చని టీ తోటలు ఉన్నా వాటి పై మాత్రం మీ కంటి చూపు పడనీకండి

 జిగ్ జాగ్ మార్గాలు

జిగ్ జాగ్ మార్గాలు

P.C: You Tube

సముద్రమట్టానికి 11,200 అడుగుల ఎత్తులో ఉండే ఈ మార్గం సిక్కిం సొంతం. పాము వలే మెలికలు తిరిగి ఉండే ఈ ప్రాంతంలో వాహనాలు నడపడానికి ఓపిక ఎక్కువగా ఉండాలి.

కర్థూంగ్ లా పాస్

కర్థూంగ్ లా పాస్

P.C: You Tube

అత్యధిక మలుపులతో కూడిన ఈ మార్గంలో తరుచుగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అందువల్లే చాలా ధైర్యం కలిగిన వారే ఈ మార్గంలో ప్రయాణిస్తుంటారు.

రాజ్ మాచీ రోడ్

రాజ్ మాచీ రోడ్

P.C: You Tube

గులకరాళ్లు, బురదతో కూడిన ఈ మార్గం జారుడు స్వభావం కలిగి ఉంటుంది. ద్విచక్రవాహనాలే కాకుండా కనీసం పాదచారులకు కూడా ఈ మార్గం సురక్షితం కాదు

 ఘటాలూప్స్

ఘటాలూప్స్

P.C: You Tube

లేహ్ మనాలి మార్గంలో ఘాటా లూప్స్ అనే ప్రాంతంలో ఓ దెయ్యం తిరుగుతూ ఉన్నట్లు చెబుతారు. అక్కడ దెయ్యానికి మనం సిగరెట్ తో పాటు మినరల్ వాటర్ ఇవ్వాలి. లేదంటే ప్రమాదం తప్పదని చాలా మంది తమ స్వ అనుభవంగా చెబుతారు.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+