Search
  • Follow NativePlanet
Share
» »మాన్సూన్ ని ఈ 35 ప్రదేశాలతో గడిపేయండి !!

మాన్సూన్ ని ఈ 35 ప్రదేశాలతో గడిపేయండి !!

భారతదేశం లోని పట్టణాలు, గ్రామాలు మరియు నగరాలను మాన్సూన్ సీజన్లో చూసినట్లయితే చాలా అందంగా కనిపిస్తాయి. భారత దేశం లో అదికూడా మాన్సూన్ కాలం లోనే సందర్శించ వలసిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి అవి మొదట అండమాన్ నికోబార్ దీవులు, లేహ్ లఢఖ్, పశ్చిమ కనుమలు మరియు ఉత్తర బారత దేశం లోని కొన్ని ప్రదేశాలు. ఋతుపవనాల కాలం జూన్ నుంచి మొదలై అక్టోబర్ మాసం వరకు కొనసాగుతుంది. ఈ టైమ్ లోనే సందర్శించవలసిన ఈశాన్య భారతదేశ ప్రదేశాలు మాసిండ్రాం మరియు చిరపుంజీ. ఈ ప్రదేశాలు ఈ మాన్సూన్ సీజన్లోనే అధిక వర్షపాతాలను నమోదు చేస్తుంటాయి.

భారత దేశంలో ముఖ్యంగా రెండు రకాల ఋతుపవనాలు ఉన్నాయి. అవి ఒకటి నైరుతి ఋతుపవనాలు, మరొకటి ఈశాన్య ఋతుపవనాలు. మన భారత దేశం ఎక్కువగా వర్షాలు నైరుతి ఋతుపవనాల వల్లనే వస్తుంటాయి. ఈ వర్షాకాలం లోనే మనం నిండుగా డ్యామ్ లని చూస్తాం ... అలాగే పూర్తి స్థాయి నీటితో నిండిన నదులు, జాలు వారే జలపాతాలనూ చూస్తాం. ఎండాకాలం లో మహా అయితే ఎండ నుంచి తప్పించుకోవడానికి మీరు చల్లని ప్రదేశాలను చూసొస్తుంటారు కదా !! కానీ ఈ మాన్సూన్ కాలంలో కూడా కొన్ని ప్రదేశాలను చూసిరావాలండోయ్ !! లేకపోతే మీరు ప్రకృతిని సరిగా ఆస్వాదించటం లేనట్టే !!

గాంగ్టక్

గాంగ్టక్

సిక్కిం రాష్ట్రంలో గాంగ్టాక్ పట్టణం అతిపెద్ద నగరంగా ఉంది. ప్రపంచంలో మూడవ అతి ఎత్తైన శిఖరం అయిన కాంచనజంగను గాంగ్టక్ యొక్క పశ్చిమ ప్రాంతంలో చూడవచ్చు. వేగంగా మరియు మంచుతో కూడిన తీస్తా నది నీటి మీద ప్రకృతి మరియు సాహస ప్రియులకు ఇద్దరికీ కూడా రాఫ్టింగ్ క్రీడ ఒక గొప్ప అనుభవం. గ్యాంగ్‌టక్‌లో ప్రయాణించేటప్పుడు ఎప్పుడూ ఒక గొడుగు దగ్గర పెట్టుకోవాలి. ఎప్పుడు వర్షం పడు తుందనే విషయాన్ని అంచనా వేయలేం. ఉన్నట్టుండి పెద్ద పెద్ద వడగళ్ళతో వాన కురవడం మొదలై పోతుంది. సిటీ మొత్తం వ్యూ చూడాలంటే డియోరాలి మార్కెట్‌ నుండి రోప్‌వే ఉంటుంది. ఇది పగలే ఉంటుంది. రోప్‌వే ప్రయాణంలో సిటీ అంతా కనిపిస్తుంది.

Photo Courtesy: Jay Radhakrishnan

డార్జిలింగ్

డార్జిలింగ్

డార్జీలింగ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్న ఒక పట్టణం. సాల్, ఓక్ చెట్లను కలిగి ఉన్న సమశీతోష్ణ అడవులు, ఎత్తైన శిఖరాలతో ప్రకృతి ప్రేమికులకు ఇది ఆహ్లాద పరుస్తుంది. డార్జీలింగ్ లోని అడవులు డార్జీలింగ్ పర్యాటక విలువకు పచ్చదనాన్ని జోడిస్తాయి. ఈ పట్టణంలో పద్మజ నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్కు, ప్రకృతి ప్రేమికులు, ఫోటోగ్రాఫర్లు మధ్యాహ్న సమయాలు ప్రశాంతతను ఇచ్చే ల్లోయడ్స్ బొటనికల్ గార్డెన్ వంటి అనేక సహజ పార్కులు ఉన్నాయి. డార్జీలింగ్ లో కొన్ని తాజా పూలను కోయడంతో తమ ఆడ స్నేహితురాలు లేదా భాగస్వామితో విలాసం కోరుకునే వారికి అనేకరకాల ఎగుమతి స్థాయి పూలమొక్కలను కలిగి ఉంది. ఇది మాన్సూన్ సీజన్లో పర్యటించావల్సిన ఒక ప్రదేశంగా గుర్తించబడినది.

Photo Courtesy: Kristian Frisk

షిల్లాంగ్

షిల్లాంగ్

'తూర్పు స్కాట్లాండ్ ' అని పిలవబడే షిల్లాంగ్ నిస్సందేహంగా ఈశాన్య ప్రాంతంలో అత్యంత ప్రసిద్ది చెందిన పర్యాటక కేంద్రాలలో ఒకటిగా ఉంది. షిల్లాంగ్ లో పచ్చని పొలాలు,సుందరమైన ప్రకృతి దృశ్యాలు, మేఘాలతో కూడిన ఎత్తైన పర్వతాలు,తియ్యని స్మెలింగ్ పువ్వులు,పుస్తకాలుతో కూడిన ప్రదేశం. ప్రకృతి విస్తారంగా ఉండే అనేక జలపాతాలు, మంత్రముగ్దులను చేసే శిఖరం మరియు అనేక ఇతర ఆసక్తికరమైన విషయాలతో షిల్లాంగ్ ఉంది. షిల్లాంగ్ పర్యాటనలో షిల్లాంగ్ శిఖరం, ఏనుగు జలపాతం, స్వీట్ జలపాతం, లేడీ హైదరి పార్క్, లేక్ మరియు పోలీస్ బజార్ జలపాతం తప్పక సందర్సించాలి. ఇది మాన్సూన్ సీజన్లో పర్యటించావల్సిన ఒక ప్రదేశంగా గుర్తించబడినది.

Photo Courtesy: sangeeta1975

కొడైకెనాల్

కొడైకెనాల్

కొడైకెనాల్ పశ్చిమ కనుమలలోని పళని కొండలలో ఉన్న అందమైన, సుందరమైన హిల్ స్టేషన్. ఈ పట్టణం దాని అత్యద్భుతమైన అందం, ప్రజాదరణ కారణంగా పర్వత యువరాణి అని నామకరణం చేయబడింది. ఇది హనీమూన్ జంటలకి అనువైనది. ఈ ప్రాంతంలో ఉన్న దట్టమైన అడవుల మధ్య ఉండే మంత్రముగ్ధులని చేసే ప్రకృతి సౌందర్యంతో కూడిన చెట్లు, రాళ్ళు, జలపాతాలు తప్పక సందర్శించాలి. ఈ స్థలం ఇంట్లోతయారుచేసే చాక్లెట్ అమ్మే అనేక దుకాణాలతో చాక్లెట్ ప్రేమికులకు స్వర్గంగా ఉంటుంది. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్పించే కురింజి పూలు కూడా ఇక్కడ చూడవచ్చు. ఈ ప్రాంతం పర్వతారోహణ, బోటింగ్, గుర్రపు స్వారీ, సైక్లింగ్ వంటి అనేక సాహస కార్యకలాపాలను కూడా అందిస్తుంది.ఇది మాన్సూన్ సీజన్లో పర్యటించావల్సిన ఒక ప్రదేశంగా గుర్తించబడినది.

Photo Courtesy: Thangaraj Kumaravel

అండమాన్ దీవులు

అండమాన్ దీవులు

గుంపులు లేని ఒంటరి విహార ప్రదేశాలు మీకు కావాలంటే, అండమాన్ మరియు నికోబార్ ద్వీపాలకు వెళ్ళి తీరాల్సిందే మరియు ఆనందించాల్సిందే. మీరు స్కూబా డైవింగ్ లేదా నీటి లోపలి లోతులను అన్వేషించాలన్నా లేదా అక్కడ కల మొక్కలు, జంతువుల సంపదలను అన్వేషించాలన్నా ఈ దీవులు సందర్శించి అంతులేని ఆనందాలు, ఎన్నో ఆశ్చర్యాలు పొందాల్సిందే. ఇక్కడి జలచరాల జీవనం, స్వచ్ఛమైన అనేక పగడపు దిబ్బలు, మొక్క మరియు జంతు శ్రేణులు వంటివి ఈ ప్రాంతంలో మరెక్కడా లభించవు. ఇది మాన్సూన్ సీజన్లో పర్యటించావల్సిన ఒక ప్రదేశంగా గుర్తించబడినది.

Photo Courtesy: Ana Raquel S. Hernandes

మున్నర్

మున్నర్

కేరళ లోని ఇడుక్కి జిల్లాలో కల మున్నార్ హిల్ స్టేషన్ ఒక అద్బుత పర్యాటక ప్రదేశం. మున్నార్ లో ఒక ఔత్సాహిక పర్యాటకుడు కోరే అంశాలు అన్ని లభిస్తాయి. విహారానికి సరైన ప్రదేశం, విస్తృతమైన తేయాకు తోటలు, అందమైన లోయలు మెలికలు తిరిగే పర్వత ప్రాంతాలు, పచ్చటి భూములు, అరుదైన మొక్క మరియు జంతు జాలాలు, దట్టమైన అడవులు, వన్య సంరక్షణాలయాలు, తాజా గాలి, స్వాగతించే వాతావరణం మరియు ఇంకా ఎన్నో, ఎన్నో అంశాలు లభిస్తాయి. ఇక్కడ అనేక ట్రెక్కింగ్ ప్రదేశాలతో ఈ ప్రదేశం బైకర్లకు మరియు ట్రెక్కర్లకు స్వర్గంలా వుంటుంది. వివిధ రకాల అరుదైన పక్షులు ఇక్కడ తిరగటం చేత బర్డ్ వాచింగ్ ఇక్కడ ఆసక్తి కరంగా ఉంటుంది. ఇది మాన్సూన్ సీజన్లో పర్యటించావల్సిన ఒక ప్రదేశంగా గుర్తించబడినది.

Photo Courtesy: Bimal K C

కూర్గ్

కూర్గ్

కూర్గ్ లేదా కొడగు పట్టణం కర్నాటక లోని ప్రసిద్ది చెందిన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఈ ప్రాంతం ప్రధానంగా పర్వతమయం. కూర్గ్ ను ఇండియాలోని స్కాట్ లాండ్ అంటారు. మరో రకంగా కర్నాటకలోని కాశ్మీర్ అని కూడా అంటారు. ఎల్లపుడూ పచ్చగా ఉండే అడవులు, లోయలు, మంచుపడే కొండ ప్రాంతాలు, విస్తారించిన కాఫీ తోటలు, టీ ఎస్టేట్లు, నారింజ తోటలు, ఎత్తైన శిఖరాలు వేగంగా ప్రవహించే జలపాతాలు, దీనికి ఆ పేరు తెచ్చి పెట్టాయి. కూర్గ్ ప్రదేశ అందాలు పర్యాటకులను అబ్బుర పరుస్తాయి. ట్రెక్కింగ్, గోల్ఫ్, చేపలు పట్టుట, రివర్ ర్యాఫ్టింగ్ వంటి వాటికి ఎన్నో అవకాశాలు కలవు. అప్పర్ బరాపోలే రివర్ లో అనేక నీటి క్రీడలు ఆడవచ్చు. ఇది మాన్సూన్ సీజన్లో పర్యటించావల్సిన ఒక ప్రదేశంగా గుర్తించబడినది.

Photo Courtesy:pravin8

లోనావాలా

లోనావాలా

లోనావాలా మహారాష్ట్రలోని పశ్చిమ ప్రాంతంలో ప్రసిద్ధ పర్వత ప్రాంతం.సహ్యద్రికి ఆభరణంగా పిలువబడే లోనావాలా పర్వహతారోహకులకు మంచి యాత్ర స్థలం. ఒకవైపు దక్కన్ పీఠ భూమిని, మరోవైపు కొంకణ్ తీరాన్ని అందంగా చూపిస్తుంది లోనావాలా. ఈ అందమైన దృశ్యాలు చూడటానికి వర్షాకాలానికి మించిన సమయం ఏముంటుంది! జాలువారే జలపాతాలు, పరచుకున్న పచ్చదనంతో ప్రకృతి ఇక్కడ చాలా రమణీయంగా ఉంటుంది. నగరంలోని రణగొణ ధ్వనులకు దూరంగా ఏడాది పొడవునా ఉండే అకలుషితమైన, ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉండే లోనావాలా ఆరోగ్య కేంద్రంగా కూడా ప్రసిద్ది పొందింది.

Photo Courtesy:Abhijit Rao

రాణిఖెట్

రాణిఖెట్

ఉత్తరాఖండ్ లో ఉన్న రాణిఖెట్ ను ఎక్కువగా 'క్వీన్స్ మేడో' అని పిలుస్తారు. ఇది అల్మోరా నగరంలో ఒక సుందరమైన హిల్ స్టేషన్.మౌంటేన్ బైకింగ్ మరియు ట్రెక్కింగ్ రాణిఖెట్ లో అస్వాదించవచ్చు. అత్యంత ప్రాచుర్యం పొందిన సాహస క్రీడలు ఉన్నాయి. క్కడ మరొక ప్రదేశం ఉపట్ ఉంది, ఇది గోల్ఫ్ క్రీడాకారులకు ఒక భూతల స్వర్గంలా ఉంటుంది. మంత్రముగ్ధులను చేసే ఈ ప్రదేశంలో పచ్చని అడవులు మరియు పచ్చికభూములుతో ఒక పెద్ద పర్యాటక ప్రవాహం వలే ఉంటుంది. యాత్రికులు వర్షాకాలాలలో ఇక్కడ సందర్శించవచ్చు.

Photo Courtesy: naveen_ora9i

జింకార్బెట్

జింకార్బెట్

ఉత్తరాఖండ్ లో ఉన్న కార్బెట్ నేషనల్ పార్క్ ని వన్య మృగ ప్రేమికుల భూతల స్వర్గంగా చెప్పవచ్చు. గొప్ప హిమాలయ పర్వతాల పాద ప్రాంతం లో ఉన్నది ఈ నేషనల్ పార్క్. రామగంగా నదీ తీరాన ఉన్న ఈ పార్క్ పర్యాటకులకు అద్భుతమైన సైట్ సీయింగ్ మరియు సాహసవంతమైన సఫారీలతో ఆకర్షిస్తున్నది. అనుభవజ్ఞులైన గైడ్లతో ఈ పార్క్ లో చేసే ట్రెక్కింగ్ ఒక గొప్ప అనుభవాన్ని మిగులుస్తుంది. వర్షాకాలంలో పర్యాటకులు కార్బెట్ వాటర్ ఫాల్ యొక్క అందాలను కూడా అస్వాదించవచ్చు.

Photo Courtesy: Mohamed Majid

ఉదయపూర్

ఉదయపూర్

బ్రహ్మాండమైన కోటలకీ, గుళ్ళు, అందమైన సరస్సులు, రాజ ప్రాసాదాలు, మ్యూజియంలు, అభాయారణ్యాలకు ప్రసిద్ది పొందిన ఉదయపూర్ ‘సరస్సుల నగరం'గా పిలువబడే అందమైన ప్రదేశం. రాజసామంద్ సరస్సు, ఉదయసాగర్ సరస్సు, జైసామంద్ సరస్సు ఈ ప్రాంతం లోని ప్రముఖ సరస్సులు. రాజపుత్రుల వైభవానికి ప్రతీకలుగా నిలిచే చాలా రాజప్రాసాదాలు, కోటలు ఇక్కడ వున్నాయి. ఈ ప్రదేశం ఎండాకాలంలో సుమారుగా 45 డిగ్రీల ఎండ వేడిమితో అల్లాడుతుంది. కనుక వర్షాకాలం ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి అనువైన సమయం.

Photo Courtesy: Nino Guarnacci

దేఒరియ సరస్సు

దేఒరియ సరస్సు

దేఒరియ సరస్సు రుద్రప్రయాగ్ కు 49 కి.మీ.ల దూరంలో కలదు. చుట్టూ పచ్చని అడవులు కలవు. ఈ సరస్సు నీటిలో చౌఖంబ పర్వత శ్రేణులు,గంగోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, నీలకంత శిఖరాలు ప్రతిబింబిస్తాయి. పర్యాటకులు రాత్రి బస, కామ్పింగ్ ట్రెక్కింగ్ ఇక్కడ సాధారణంగా చేస్తారు. దీనిని పురాణాలలో 'ఇంద్ర సరోవర్' అని పేర్కోన్నారు. ఈ సరస్సు వద్ద కల ఒక యక్షుడు పాండవులలో పెద్దవాడైన ధర్మరాజుని యక్ష ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టాడు.

Photo Courtesy: dbosu69

కుచ్

కుచ్

కచ్ అనగా సంస్క్రుతం లో ద్వీపము అని అర్ధం.ఇది గుజరాత్ రాష్ట్రంలో పశ్చిమం దిశలో ఉన్నది. ఇది ఎక్కువగా చిత్తడి నేలలతో కప్పబడి ఉంటుంది. ఎండా కాలంలో నీరు ఎండి పోవడం వల్ల చిత్తడి నేలలు మంచు వలె తెల్లగా మెరుస్తూ ఉంటాయి. వీటినే మనము ఉప్పు నీటి కయ్యలు అంటామడి బాబోయ్ !! . ఇవి సరిగ్గా ఈ మాసాలలోనే మనాలను ఆకట్టుకుంటాయి.

Photo Courtesy: dpbirds

మల్షేజ్ ఘాట్

మల్షేజ్ ఘాట్

మహారాష్ట్ర లోని పూణే జిల్లాలో వున్న పశ్చిమాద్రి కనుమల్లో వున్న కొండ ప్రాంతం మల్షేజ్ ఘాట్.లెక్కలేనన్ని చెరువులు, కొండలు వుండే ఈ ప్రదేశం ప్రకృతి ప్రేమికులకు, సరదా రాయుళ్ళకు, సాహాసికులకు, పర్వతారోహకులకు ఒకేలా ఆనందం కలిగిస్తుంది. వర్షాకాలంలో మల్షేజ్ ఘాట్ చక్కని విహార కేంద్రం. సాధారణ ప్రకృతి షికార్లు కూడా మబ్బుల్లో విహరిస్తున్నట్టు స్వర్గతుల్యమైన అనుభవం అందిస్తుంది. పక్షి ప్రేమికులు, ప్రకృతి ప్రేమికులు, మిలమిలలాడే నది నీరు, పచ్చని మైదానాల నేపధ్యంలో ఇక్కడి పిమ్పల్గావ్ జాగా డ్యాం కి వచ్చే వలస పక్షులను చూడడానికి ఇష్టపడతారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఫ్లెమింగో పక్షులను చూడడం మరిచిపోకండి.

Photo Courtesy: An@vrin

లెహ్

లెహ్

సింధు నది ఒడ్డున, హిమాలయ, కరకోరం పర్వత శ్రేణుల మధ్య నెలకొని వుంది లెహ్ నగరం. మంచుతో కప్పి వుండే హిమాలయ పర్వతాలు ఈ ప్రాంతం అందాన్ని మరింతగా పెంచుతాయి. సాహస ప్రేమికులు లెహ్ లోని వివిధ ప్రాంతాల్లో హిమాలయ పర్వతారోహణ చేస్తూ ఇక్కడి ప్రాకృతిక అందాల్ని ఆస్వాదించవచ్చు. మార్చ్ నుంచి సెప్టెంబర్ నెలల మధ్య ఇక్కడి ఉష్ణోగ్రత భరించగలిగే స్థాయిలో వుంటుంది కనుక ఈ ప్రాంత సందర్శనకు ఇదే అనువైన సమయం.

Photo Courtesy: sandeepachetan.com travel photography

లడఖ్

లడఖ్

సింధు నదీ తీరాన ఉన్న లడఖ్, జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రం లోని ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. అందమైన సరస్సులు, బౌద్ధారామాలు, మంత్రం ముగ్ధులను చేసే ప్రకృతి దృశ్యాలు, పర్వత శిఖరాలు, ఈ ప్రదేశం యొక్క కొన్ని ఆకర్షణీయమైన అంశాలు. పర్యాటకులు, మే మరియు సెప్టెంబర్ మధ్య ఎప్పుడైనా, లడఖ్ పర్యటనకు ప్రణాళిక తయారు చేయవచ్చు. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు 33 డిగ్రీలకు మించవు.

Photo Courtesy: sandeepachetan.com travel photography

చిరపుంజీ

చిరపుంజీ

చిరపుంజీ మేఘాలయ రాష్ట్రంలో ఉన్నది.స్థానికులు చిరపుంజీ లేదా సోహ్ర అని పిలుస్తారు.ఒకప్పుడు భూమి మీద అతి తేమగా ఉండే భూమిగా చిరపుంజీ మంత్రముగ్దులను చేస్తుందని చెప్పవచ్చు. ఎత్తుపల్లాల కొండలు,అనేక జలపాతాలు,బంగ్లాదేశ్ మైదానాలతో విస్తృత దృశ్యం మరియు స్థానిక గిరిజన జీవనవిధానం ఒక సంగ్రహావలోకనం చిరపుంజీ పర్యటనకు వెళ్లినప్పుడు చిరస్మరణీయంగా ఉంటుంది.ఇక్కడున్న అందమైన నోహ్కలికై జలపాతం ప్రత్యేకంగా దేశంలోనే ఎత్తైన జలపాతలలో ఒకటిగాఉన్నది.ఈ ప్రదేశాన్ని సందర్శించాలంటే ఇదే ఉత్తమమైన సమయం ఎందుకంటే ఈ సమయంలోనే ఈ జలపాతం నిండుగా కనబడుతుంది.

Photo Courtesy: Kunaldalui

అలెప్పి

అలెప్పి

అనేకమైన సరస్సులు తో, విశ్రాంతి ని అందించే ప్రశాంతమైన ప్రదేశం కావడం వల్ల అలెప్పి కి "వెనిస్ అఫ్ ది ఈస్ట్" అనే పేరు సరిగ్గా సరిపోతుంది. మంత్ర ముగ్ధుల్ని చేసే బ్యాక్ వాటర్స్ అందాలు, ఆకుపచ్చని తివాచీ లా కనిపించే ప్రకృతిలో ని పచ్చదనం, తాటి చెట్ల మధ్యలో వంపులు తిరిగే కాలువలు పర్యాటకులలో ఉన్న సృజనాత్మకతని బయటకి తీసి వారి ఉహాశక్తి లో ని విభిన్న కోణాలను ఉత్తేజపరుస్తాయి. అద్భుతమైన బ్యాక్ వాటర్స్ సౌందర్యాన్ని, ఆశ్చర్యచకితుల్ని చేసే ప్రకృతి యొక్క వైభవాన్ని పర్యాటకులు మనఃస్పూర్తిగా అభినందిస్తారు. బీచ్ లు, సరస్సులు మరియు ఎన్నో గొప్ప ప్రశంసలు అందుకున్న హౌస్ బోటులు పర్యాటకులని విశేషంగా అలరిస్తాయి. ఈ సీజన్లోనే ఇక్కడే జరిగే పడవ పోటీలు ప్రతి ఒక్కరినీ ఆనందపరుస్తాయి.

Photo Courtesy: dinesh babu

షోజా

షోజా

హిమాచల్ ప్రదేశ్ లోని సిరాజ్ లోయలో వున్న అందమైన ప్రాంతం షోజా. ఇది మంచుతో కప్పబడిన హిమాలయాల అందమైన దృశ్యాల్ని అందిస్తుంది. షోజా లో తప్పక చూడవలసిన ప్రాంతాల్లో ఒకటి జలపాత కేంద్రం. ప్రకృతి ఒడిలో వున్న ఈ జలపాత కేంద్రం అచ్చేరువొందించే ఆనందంతో అలరారుతోంది. షోజా నుంచి కేవలం 1కిలోమీటర్ దూరంలోనే ఉండడంతో ఉదయం పూట నడక కోసం జనం ఇక్కడి దాకా వస్తారు. ఇక్కడి నీరు చల్లగా, తీయగా ఉంటాయని చెప్తారు. వర్షాకాలంలోనే ఈ ప్రాంతాన్ని సందర్శించడం ఉత్తమం అంటారు.

Photo Courtesy: Kriti & Sachin

 జోగ్ ఫాల్స్

జోగ్ ఫాల్స్

ప్రకృతి మానవుడికి ప్రసాదించిన బహుమతులలో జోగ్ జలపాతాలు ఒకటి.షుమారుగా 830 అడుగుల ఎత్తునుండి ఒంపు సొంపులతో క్రిందకు పడే ఈ జలపాతాలు వేలాది సందర్శకులను ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. రమణీయమైన ఈ జలపాతాల అందం ఈ ప్రదేశానికి చుట్టుపట్ల గల పచ్చటి పరిసరాలతో మరింత అధికమవుతుంది. మళయాళం సినిమా కుమ్కి ఇక్కడే తీసింది. ఈ జలపాతాన్ని పర్యటించాలంటే ఇదే సరియైన సమయం.

Photo Courtesy: Amar Raavi

స్పితి

స్పితి

స్పితి హిమాచల్ ప్రదేశ్ కి ఈశాన్య భాగంలో ఉన్న ఒక మారుమూల హిమాలయ లోయ.పర్వత బైకింగ్ మరియు జడలబర్రె సఫారీ వంటి సాహస చర్యలు ఈ ప్రాంతపు ప్రధాన ఆకర్షణలు. ఈ ప్రాంతపు సహజ సౌందర్యం కారణంగా, పాప్ మరియు మిలరేపా వంటి కొన్ని బాలీవుడ్ సినిమాలు ఇక్కడ చిత్రీకరించబడ్డాయి.

Photo Courtesy: Akshaymishra

వయనాడు

వయనాడు

కేరళలో ఉన్న పన్నెండు జిల్లాలలో ఒకటయిన వయనాడు, కన్నూరు మరియు కోజ్హికోడ్ జిల్లాల మధ్య ఉంది. వెస్ట్రన్ ఘాట్స్ పర్వతాల మధ్య ఉన్న పచ్చని చెట్ల మధ్య నెలకొని ఉన్న ఈ ప్రాంతం, సహజసిద్దమయిన అందం తో ప్రాచుర్యం పొందింది. రోజు వారి జీవితాలలో మనం కోల్పోతున్న ప్రశాంతత , సంతృప్తి లను ఇక్కడ పొందేందుకు అనువైన ప్రదేశం. అడవులకి దగ్గరలో ఉన్న కొన్ని రిసార్ట్స్ లలో అలసి సొలసిన పర్యాటకులని తిరిగి ఉత్తేజ పరిచేందుకు ఆయుర్వేదిక్ మసాజ్, స్పా వంటి సౌలభ్యాలు అందుబాటులో ఉన్నాయి. కనుక ఈ సమయమే ఉత్తమ సమయం.

Photo Courtesy: faisy5c

కుమరకొం

కుమరకొం

అందమైన చిన్న చిన్న ద్వీపాల పొందిక కుమరకొం . అందరూ వెళ్లితీరాలనుకునే పర్యాటక మజిలీ కుమరకొం. కేరళ లో ని అతి పెద్ద మంచి నీటి సరస్సు గా గుర్తింపు పొందిన వెంబనంద సరస్సు వద్ద ఉన్న ఈ ప్రాంతం సహజమైన తన అంద చందాలతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పర్యాటకులని ఆకర్షిస్తోంది.కుమరకొం లో ఉన్న ఈ ఆకుపచ్చని ద్వీపకల్పం, చుట్టూ అందమైన ప్రవాహాలతో, విస్తరించిన పచ్చదనంతో పర్యాటకులని అమితంగా ఆకర్షిస్తోంది.ఋతుపవనాల రాకతో చిరు జల్లులు ఈ నేలపై కురవగానే ఈ ప్రాంతం మొత్తం పచ్చని తోరణంగా మారి సందర్శకులకి కనువిందు చేస్తుంది.

Photo Courtesy: Sarath Kuchi

మహాబలేశ్వర్

మహాబలేశ్వర్

మహారాష్ట్ర లోని సతారా జిల్లాలో కల మహాబలేశ్వర్ ఒక ప్రసిద్ధి చెందిన పర్వత ప్రాంతం. మహాబలేశ్వర్ ఒక పర్యాటక స్వర్గం. ఎన్నో వింతలు మరియు విశేషాలతో ఆకట్టుకుంటున్న మహాబలేశ్వర్ ప్రాంతంలో సుమారుగా 30 వరకు చూడదగిన ప్రదేశాలు ఉన్నాయి. లోయలు, అడవులు, జలపాతాలు, నదులు, వివిద రకాల మొక్కలు, జంతువులు కలిగి పర్యాటకులకు అద్భుత ఆనందం కలిగిస్తుంది. ఇక్కడ కల సూర్యోదయ ప్రదేశం విల్సన్ పాయింట్ అత్యంత ఎత్తుగల ప్రదేశం. అక్కడి చల్లని వాతావరణం మీకు మరువలేని అనందానుభూతులను, చక్కని విశ్రాంతిని కలిగిస్తుంది. ఇంత అందమైన ఈ హిల్ స్టేషన్ చూడాలంటే ఈ సీజన్లోనే ప్రయాణించాలి మరి !!

Photo Courtesy: Nishanth Jois

ఖండాల

ఖండాల

మహారాష్ట్ర లోని ముఖ్య పర్వత కేంద్రాలలో ఒకటైన ఖండాలా ప్రధాన ముఖద్వారం. . పర్యాటకులకు కళ్ళు చెదిరే ఆరాధ్యనీయమైన అద్భుత ప్రకృతి సౌందర్యం, పచ్చని కొండలపై ఉత్కంఠభరితమైన దృశ్యాలు, మనోహరమైన లతలు, అందమైన సరస్సులు, దివ్యమైన సెలయేళ్ల తో ఖండాలా పర్యాటకులకు దిగ్భ్రమపరుస్తుంది. మనోహరమైన ఈ లోయలలో నడవడం వల్ల ప్రకృతి ప్రేమికులకు, ఔత్సాహికులకు ఈ ప్రాంత ఆద్యాత్మిక ఆకర్షణ తెలుస్తుంది. అపారమైన ప్రకృతి అందంతో ఆశీర్వదించిబడిన ఖండాలాను ఆస్వాదించడానికి ప్రకృతి అందాలు ఎంతో విరబూసే వర్షాకాలం అనువైనది. పరిసరాలు బాగా తాజాగా పచ్చగా మధురంగా ఉండి సాహస భావనను కల్గిస్తాయి.

Photo Courtesy: Alosh Bennett

పంచగని

పంచగని

ప్రకృతి రమణియత తో శోభిల్లే జంట పర్యాటక కేంద్రాలు మహారాష్ట్ర లోని పంచగని.అందమైన పకృతి లో కొండల మధ్య సూర్యాస్తమయం ఆస్వాదించాలన్నా, అలా కాసేపు బొటు లో షికారు చేద్దామనుకున్నా, స్ట్రా బెర్రీ పళ్ళూ కోసుకోవాలన్నా, లేదా మీరు సాహసోపేతమైనా ఆలోచనలున్నవారైతే పారాగ్లైడింగ్ చేయవచ్చు. ఇలా ప్రతి ఒక్కరినీ ఆహ్లాదపరిచే ఎన్నో ప్రత్యేకతలు కలిగిఉన్న ప్రదేశం పంచగని.ఇక వర్ష ఋతువు ఈ ప్రాంతానికి సరికొత్త అందాలను తీసుకు వస్తుంది.

Photo Courtesy: B Balaji

కౌసని

కౌసని

కౌసని సముద్ర మట్టానికి సుమారుగా 6075 అడుగుల ఎత్తులో, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ఒక సుందరమైన పర్వత పట్టణం.ఈ ప్రదేశమును సందర్శించటం ద్వారా సాహస ఔత్సాహికులు ట్రెక్కింగ్ మరియు రాక్ క్లైంబింగ్ వంటి కార్యకలాపాలను అస్వాదించవచ్చు.ఇక్కడ దేశంలోనే ఉత్తమ ట్రెక్కింగ్ మార్గాలు ఉన్నాయి. ప్రయాణికులకు వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు అంటే జూనే మరియు ఆగస్ట్ మధ్య కౌసని సందర్శించడానికి ఇష్టపడతారు.

Photo Courtesy: Utkarshsingh.1992

మౌంట్ అబు

మౌంట్ అబు

రాజస్థాన్ లోని సిరోహి జిల్లాలో గల మౌంట్ అబూ ఒక పర్వత ప్రాంతం. ప్రకృతి సౌందర్యం, సౌకర్యవంతమైన వాతావరణం, పచ్చటి కొండలు, దివ్యమైన సరస్సులకు ఈ ప్రదేశం ప్రసిద్ధి. 1220 మీ. ఎత్తు లో గల ఈ పర్వత కేంద్రం ఆరావళి పర్వత శ్రేణుల లోని ఎత్తైన శిఖరం మీద నెలకొని వుంది. మౌంట్ అబూ ప్రముఖ చరిత్ర, పురాతన పురాతత్వ ప్రాంతాలు, అధ్భుతమైన వాతావరణం కల్గి ఉండటం వలన రాజస్థాన్ లోని అతి పెద్ద పర్యాటక ఆకర్షణ లలో ఒకటిగా పరిగణింపబడుతున్నది. ప్రధానంగా వర్షా కాలంలో వేలాదిమంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు.

Photo Courtesy: Selmer van Alten

అగుంబే

అగుంబే

మహాకవి కువెంపు స్వంత పట్టణం అయిన తీర్ధహళ్ళి తాలూకాలో అగుంబే ఒక చిన్న గ్రామం. అరేబియా మహా సముద్రంలోకి సూర్యుడు అస్తమించే సుందర దృశ్యాలను ఈ ప్రదేశంనుండి చూసి ఆనందించవచ్చు. దక్షిణ భారతదేశంలోని ఈ ప్రాంతం అత్యధిక వర్షపాతాన్ని నమోదు చేస్తుంది. గుంబే సందర్శనలో పర్యాటకులు బర్కానా మరియు కుంచికల్, ఒనకే అబ్బి ఫాల్స్ మరియు జోగిగుండి మరియు కూడ్లు తీర్ధ జలపాతాలు జలపాతాలు కూడా చూడవచ్చు. ప్రకృతి ప్రియులకు ఈ ప్రాంతంలో ట్రెక్కింగ్ కూడా కలదు. ఎన్నో అటవీ జంతువులు చూడవచ్చు.

Photo Courtesy: Mylittlefinger

చిక్కమగళూరు

చిక్కమగళూరు

చిక్కమగళూరు పట్టణం కర్నాటక రాష్ట్రంలోని చిక్కమగళూరు జిల్లాలోనే ఉంది. ఈ ప్రాంతంలో అనేక పర్యాటక స్ధలాలున్నాయి. జలపాతాలైన మాణిక్య ధార జలపాతం, శాంతి జలపాతం, కాదంబి జలపాతాలు కూడా ఈ ప్రాంతంలో సందర్శించవచ్చు. ప్రశాంతతలు గోరే ఆధ్యాత్మిక వ్యక్తులకు చక్కటి ప్రదేశం శృంగేరి నుండి హొరనాడు మరియు కలాసా వరకు ఆద్యాత్మిక ప్రియులకు ఎన్నో ప్రదేశాలు దర్శనమిస్తాయి.ఒక్కమాటలో చెప్పాలంటే, చిక్కమగళూరు పట్టణమే కాదు పూర్తి జిల్లా అంతా ప్రతి ఒక్కరి అభిరుచులను తీర్చగల విహార స్ధలాలు ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే దీనిని వర్షాకాలంలో సందర్శిస్తే అందాలన్నీ ఆస్వాదిస్తారు.

Photo Courtesy: Vikram Vetrivel

కోవలం

కోవలం

కోవలం కేరళ లోని ప్రసిద్ధ బీచ్ లలో ఒకటి. ఇది కూడా వర్ష రుతువు పర్యాటక ప్రదేశమే. బీచ్ లో సుదీర్ఘ నడకలు, తాజా సముద్రపు ఆహారాలు, వంటివి అద్భుతంగా వుంటాయి. ఫిషింగ్ బోటు లనుండి తాజా చేపలు దొరుకుతాయి. ఈ చేపలు తీసుకు వెళితే అక్కడి చిన్న హోటల్లు మీకు కావలసిన రీతిలో డిష్ లు తయారు చేస్తాయి. ఇక్కడ మీరు ఆయుర్వేద ఆయిల్ మసాజ్ లు చేయిన్చుకోనవచ్చు. ఇవి మీకు చక్కని అనుభూతి కలిగించి విశ్రాంతినిస్తాయి.

Photo Courtesy: Jo Kent

అలప్పుజ

అలప్పుజ

అలప్పుజ ను కేరళలో ని బ్యాక్ వాటర్ టూరిజం రాజధానిగా చెపుతారు. ఈ పట్టణాన్ని 'తూర్పు దేశ వెనిస్ నగరం' అని కూడా పిలుస్తారు. హౌస్ బోటు లలో తిరుగుతూ టవున్ అందాలు ఆనందించండి. మీ అదృష్టం బాగుంటే, ఒక ఫిషర్ మాన్ బోటు దొరకవచ్చు. టూరిస్ట్ లు ఇక్కడ తాజా చేపలు కొని అక్కడే వండుకోనవచ్చు. హౌస్ బోటు లో వేడి వేడి భోజనం చేస్తూ పడుతున్న వర్షపు జల్లులు ఆనందించవచ్చు.

Photo Courtesy: Kerala Tourism

మట్టుపెట్టి

మట్టుపెట్టి

మట్టుపెట్టి ఒక కొండ నగరం. ఇది ఇడుక్కి ప్రాంతం లో కలదు. వర్శభారిత శృంగారానికి చక్కటి విహారం. ఇక్కడ వర్షాల తో పాటు ఉరుములు, మెరుపులు కూడా వుంటాయి. కనుక ప్రియమైన వారితో తప్పక ఇంటి లోపలి ఆనందాలు కూడా పొందవచ్చు. సరస్సు ఒడ్డున షికార్లు కొట్టి ఆనందించవచ్చు.

Photo Courtesy: Raj

అష్టముడి

అష్టముడి

అష్టముడి తిరువనంతపురం నుండి 76 కి. మీ. ల దూరం. ఇక్కడ ఆక్టోపస్ ఆకారంలో ఒక సరస్సు కలదు. వర్ష సెలవులకు చక్కని ప్రదేశం. బ్యాక్ వాటర్స్ లో పడే వర్షాలు అబ్బుర పరుస్తాయి. మరి ఈ సమయంలో హౌస్ బోటు రైడ్ చేస్తూ ప్రియమైన వారితో ఆనందిస్తే అంతకు మించినది ఏముంటుంది.

Photo Courtesy: peterwurst44

దూద్ సాగర్ జలపాతాలు

దూద్ సాగర్ జలపాతాలు

దూద్ సాగర్ జలపాతాలకు మరొక పేరే పాల సముద్రం ఇది అందరికి సుపరిచితమైన పేరు. నీళ్ళలాగా కాకుండా పాల వాలే కనిపించే ఈ జలపాతం రాళ్ళ కింద ఉదృతంగా ప్రవహిస్తుంది. పానాజీ నుండి షుమారు 60 కిలోమీటర్ల దూరంలో కర్ణాటక-గోవా సరిహద్దు మధ్య ఉన్న ఈ జలపాతం చాలా అందమైన ప్రదేశం. ఇది ప్రపంచంలోనే అత్యంత అందమైన జలపాతాలలో ఒకటిగా ఉంది. ఇది ప్రత్యేకంగా వర్షాకాల సమయంలో చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇది వివిధ రకాల జంతువులు, మొక్కలు, కీటకాలు, పక్షులకు నిలయమైన ఈ అడవి దట్టమైన ఆకురాల్పులతో చుట్టబడి ఉంది. దూద్ సాగర్ వద్ద పర్వతారోహణ కూడా ప్రసిద్ధ ఆకర్షణ. ఈ జలపాత అందాలనూ దగ్గరించి చూడటానికి రైలు రెండు నిమిషాల వరకు ఆగుతుంది.

Photo Courtesy: Premnath Thirumalaisamy

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+