Search
  • Follow NativePlanet
Share
» »ఎడారి కోటల వైపు చకచకా అడుగులు వేద్దాం, ట్రెక్కింగ్ లో నూతన అనుభూతి పొందుదాం,

ఎడారి కోటల వైపు చకచకా అడుగులు వేద్దాం, ట్రెక్కింగ్ లో నూతన అనుభూతి పొందుదాం,

జైపూర్ కు దగ్గరగా ఉన్న కోటలకు సంబంధించిన కథనం.

By Gayatri Devupalli

మీరు పర్వతాలపై ట్రెక్కింగ్ చేసి ఉండవచ్చు, కానీ ఎప్పుడైనా, ఎడారిలో కొండల పైకి ఎక్కడం గురించి ఆలోచించారా? ఇది ఆహ్లాదకరమైన మరియు పూర్తిగా భిన్నమైన అనుభవంగా మిగిలిపోతుంది. జైపూర్ ఎడారిలో లేనప్పటికీ, ఎడారికి చాలా దగ్గరగా ఉన్నందున, ఎండిపోయినట్లుగా, ధూళితో నిండి ఉంటుంది. శతాబ్దాల క్రితం ఈ ప్రదేశం రాజుల పాలనలో ఉండేది కనుక, ఈ నగరంలో ఏ మూలకు వెళ్లినా రాచరిక ఆనవాళ్లు కనిపిస్తాయి. అన్నిటికన్నా ముఖ్యమైనవి, జైపూర్ శివార్లలోని అందమైన కోటలు!ఇక్కడ మీరు హైకింగ్, క్యాంపింగ్ చేయవచ్చు. పర్వతాధిరోహణకు భిన్నంగా, ఒక కోటను అధిరోహించే అవకాశం మీకు ఇక్కడ లభిస్తుంది. మీ పయనం దుమ్ముతో నిండి ఉన్నప్పటికీ, కోటల పై నుండి కిందకు చూసినప్పుడు కనిపించే ప్రకృతి అందాలు మిమ్మల్ని మంత్రముగ్ధులను చేసి, మీరు పడ్డ శ్రమను చిటికెలో మాయం చేస్తుంది.

1. చరణ్ మందిర్:

1. చరణ్ మందిర్:

P.C: You Tube

ఉత్తేజకరమైన ప్రదేశాలలో ట్రెక్కింగ్ చేద్దామని నిర్ణయం తీసుకున్నాక, మీ ట్రెక్ చరణ్ మందిర్ తో మొదలుపెడితే అది చాలా అద్భుతంగా ఉంటుంది. ట్రెక్కింగ్ కు అత్యంత ప్రసిద్ధ చెందిన ప్రదేశాలలో ఇది ఒకటి. మీరు ఒక అనుభవశూన్యులయితే, అత్యంత సులువైన ఈ ట్రెక్, మీ కొరకు సరిగ్గా సరిపోతుంది.ఈ ట్రెక్ లో మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవలసినది జల్ మహల్ గురించి. జల్ మహల్, సరస్సు మీద తేలియాడే ఒక ప్యాలెస్.

2. ప్రత్యేకమైన వృక్షజాలం

2. ప్రత్యేకమైన వృక్షజాలం

P.C: You Tube

మీరు ఈ మార్గంలో నడుస్తున్నప్పుడు, చాలా ప్రత్యేకమైన వృక్షజాలం మరియు జంతుజాలంను ​​చూడవచ్చు. జూలై నుండి మార్చ్ మధ్య సమయం, ఈ ట్రెక్కింగ్ కు అనుకూలంగా ఉంటుంది. మీరు ఈ ట్రెక్ లో భాగంగా గణేష్ మందిర్ ని దాటి వెళుతుంది. ఇది కొంచెం చదును చేయని ఎగుడు దిగుడు రహదారి. మీరు పొదలను దాటుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. మీరు నిజంగా హైకింగ్ అంటే ఇష్టపడినట్లైతే, మీకు ఈ కాలిబాటను నచ్చుతుంది.

3. చరణ్ మందిర్ స్థావరంను ఎలా చేరుకోవాలి?:

3. చరణ్ మందిర్ స్థావరంను ఎలా చేరుకోవాలి?:

P.C: You Tube

ఈ ప్రదేశానికి చేరుకోవాలంటే కాబ్ దొరుకుతుంది లేదా జైపూర్ నగరం నుండి బస్సు తీసుకోవాలి.

4. కుంభల్ గఢ్ కోట:

4. కుంభల్ గఢ్ కోట:

P.C: You Tube

ట్రెక్కింగ్ కు ఆరావళి పర్వతాలలో ఈ ప్రాంతం ప్రసిద్ది. ఆరావళి కొండల పశ్చిమ పరిధిలో ఈ కోట ఉంది. ఇది రాజస్థాన్ కు చెందిన మేవార్ వంశస్థుడైన మహారాణా ప్రతాప్ యొక్క జన్మస్థలం. ఈ కోట ఒక హెరిటేజ్ సైట్ గా గుర్తింపబడింది. ఈ ప్రదేశాన్ని పలువురు పర్యాటకులు సందర్శిస్తారు. ఇది కేవలం పర్యాటక ప్రదేశమే కాదు, ట్రెక్కింగ్ చేసేవారికి ఒక అందమైన సవాలుగా ఉంటుంది.

5. 38 కిలోమీటర్లు

5. 38 కిలోమీటర్లు

P.C: You Tube

ఈ కోట గోడలు 38 కిమీ పొడవు ఉన్నాయి. ఇవి ప్రపంచంలోనే అతిపెద్ద గోడల సముదాయం. ఇది 3500 అడుగుల ఎత్తులో నిర్మించబడింది, కనుక ఇక్కడ ట్రెక్కింగ్ చాలా సరదాగా ఉంటుంది. మనం ఎక్క వలసిన కొండపై కాలిబాటలు నిటారుగా ఉంటాయి. ఈ ప్రయత్నం చేసేవారు మంచి హైకింగ్ బూట్లు వేసుకోవాలి. నీళ్ల బాటిల్ మీతో తీసుకుని వెళ్లడం మర్చిపోవద్దు.

6. కుంభల్ ఘఢ్ ఫోర్ట్ చేరుకోవడం ఎలా

6. కుంభల్ ఘఢ్ ఫోర్ట్ చేరుకోవడం ఎలా

P.C: You Tube

ఈ ప్రదేశానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాణిలో రైల్వేస్టేషన్ ఉంది. ఈ మార్గంలో బస్సులు నడవవు కనుక టాక్సీని అద్దెకు తీసుకోవాలి. మీకు కావాలంటే, మీరు కంక్రోలికి వరకు బస్సులో ప్రయాణం చేసి, అక్కడ నుండి ప్యాలెస్ కు టాక్సీలో చేరవచ్చు.

7. నహార్ ఘఢ్ కోట

7. నహార్ ఘఢ్ కోట

P.C: You Tube

అత్యంత ప్రసిద్ధమైన ట్రెక్కింగ్ ప్రదేశాలలో ఇది ఒకటి. యువత మరియు పర్యాటకులలో నగర్ గఢ్ కోట ప్రసిద్ది చెందింది. ఒక గంట పాటు చెమటలు పట్టించే ట్రెక్కింగ్ చేసిన తర్వాత, అక్కడి నుండి కనిపించే పసిడి కాంతులతో మెరిసే జైపూర్ నగర సొగసును వర్ణించడానికి మాటలు చాలవు.ఈ ప్రదేశం మిడ్-లెవల్ ట్రెక్కర్లకు అనువైనది. మీరు ట్రెక్కింగ్ కు కొత్త వ్యక్తి అయితే, చాలా జాగ్రత్తగా ఉండాలి.ప్రయత్నించడం వలన ఎటువంటి ప్రమాదం లేదు.

8. సూర్యోదయం, సూర్యాస్తమయాలు

8. సూర్యోదయం, సూర్యాస్తమయాలు

P.C: You Tube

ప్రజాదరణ పొందినందున, ఈ కోటకు వెళ్లే మార్గం కాంక్రీటు చేయబడి ఉంటుంది. ఆ ఎత్తు నుండి సూర్యోదయం మరియు సూర్యాస్తమయం వీక్షించేందుకు హృద్యంగా ఉంటాయి. మీకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం ఉంటే కనుక, ఈ అనుభవం మీరు చాలా నచ్చుతుంది. కానీ ఈ అడవిలో మీ ట్రెక్కింగ్ అనుభవం చేదుగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గుర్తుంచుకోండి.కాలిబాట దాటినా తరువాత, ఒక హోటల్ మరియు చిన్న కేఫ్ కనిపిస్తాయి. క్రొత్త హైకర్స్ వారు అందించే సేవలు స్వర్గానికి చేరువలో ఉన్నామా అన్నట్లుగా అనిపిస్తాయి. కానీ అనుభవజ్ఞులైన పర్వత శిఖరంపై తమ సమయాన్ని గడపడాన్ని ఇష్టపడతయారు.

9. నహార్ ఘఢ్ ఫోర్ట్ చేరుకోవడం ఎలా?:

9. నహార్ ఘఢ్ ఫోర్ట్ చేరుకోవడం ఎలా?:

P.C: You Tube

ఈ కోట, చరణ్ మందిర్ దగ్గరగా ఉంది కాబట్టి మీరు జైపూర్ నగరం నుండి టాక్సీ లేదా బస్సులో చేరుకోవచ్చు. మీరు బస్సుని ఎంచుకుంటే కనుక, ఈ స్థావరాన్ని చేరడానికి రెండు బస్సులు మారాలి.

10. ఆమెర్ కోట:

10. ఆమెర్ కోట:

P.C: You Tube

ఎడారిలో ట్రెక్కింగ్ అనుభవం కోరుకునేవారికి ఇది అనువైన స్థలం. ఈ కోటను చేరుకునే మార్గంలో, మీరు బంగారు వర్ణంలో ఉండే సాండ్ స్టోన్స్, చారిత్రాత్మక రాతి కట్టడాలు, దాటుకుంటూ వెళ్ళాలి. ఈ ప్రాంతం ఎడారి దుమ్ము, ధూళితో, పొడి గాలితో నిండి ఉంటుంది.కాని ఇది లక్షలాది మంది పర్యాటకుల గమ్యస్థానం.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పర్యాటకులకు ఆకర్షించే రాజాప్రసాదం ఇది. కానీ మీరు ఆ భాగం కాకుండా ట్రెక్కింగ్ కి ప్రాముఖ్యతను ఇవ్వాలనుకున్నట్లైతే, వాచ్ టవర్ వరకు చేరుకోండి. కోట ప్రవేశ ద్వారం వరకు ఈ కాలిబాట సాగుతుంది.

11. రాతి మెట్లు

11. రాతి మెట్లు

P.C: You Tube

ఈ కోటను చేరుకోడానికి, వందల సంవత్సరాల క్రితం నిర్మించిన రాతి మెట్లను మరియు రక్షణ నిమిత్తం నిర్మించిన ద్వారాలను దాటుకుని వెళ్ళాలి. ఉదయం 3 గంటలకు మీ ట్రెక్ ను ప్రారంభిస్తే ఎగువకు మీరు నడిచే వేగాన్ని బట్టి 4 లేదా 5 గంటలకు చేరుకుంటారు. పైకి చేరాక వాతావరణం చల్లగా ఉండే అవకాశం ఉన్నందున మీతో పాటుగా దుప్పటి తీసుకుని వెళ్లడం మర్చిపోవద్దు. సూర్యాస్తమయంలోగా, మీ ట్రెక్ పూర్తి చేయండి. స్నేహితులతో కలిసి వెళ్ళడానికి ఈ ట్రెక్ చాలా బాగుంటుంది. నిశ్సబ్దంగా ఎక్కుతూ, ఫ్లాష్ లైట్లను సాధ్యమైనంత తక్కువగా వినియోగించడానికి ప్రయత్నించండి.

12. ఆమెర్ ఫోర్ట్ కు ఎలా చేరుకోవాలి?:

12. ఆమెర్ ఫోర్ట్ కు ఎలా చేరుకోవాలి?:

P.C: You Tube

బహుళప్రజాదరణ పొందిన ఈ కోటకు, జైపూర్ నగరం నుండి బస్సులు వెళ్తాయి. కానీ హైకింగ్ కు తొలి పొద్దు సమయం అనుకూలమైనది కనుక, ఆ సమయానికల్లా చేరుకోవడానికి కారును తీసుకోండి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+