Search
  • Follow NativePlanet
Share
» »చారిత్రక ఎల్లోరా, అజంతా గుహల పర్యటన !

చారిత్రక ఎల్లోరా, అజంతా గుహల పర్యటన !

వర్షాలు మీ విశ్రాంతి సెలవుల ప్రణాలికలను అడ్డుకుంటూ న్నాయా ? ఈ వర్షాలలో ఎక్కడికి వెళ్లాలని అనుకుంటున్నారా ? వర్షాలు అధికంగా వుండేది ఇక్కడే.

ఈ జూన్ నెలలో పశ్చిమ భారత దేశంలో వర్షాలు తక్కువగా వుంటాయి. ఈ సమయంలో అక్కడి కోస్తా ప్రాంతాలైన ఆలి బాగ్, గణపతి పూలే, చిప్లున్ వంటి ప్రదేశాలు పర్యటించవచ్చు. లేదా చారిత్రక ఎల్లోరా గుహలు, కజ్రాట్ మొదలైనవి పర్యటించవచ్చు. ఈ ప్రదేశాలలో ట్రెక్కింగ్ లేదా ఇతర సాహస క్రీడలు ఆచరించవచ్చు.

ఈ ప్రాంతంలోని అంబి వాలీ పర్యటన ఎంతో అద్భుతంగా వుంటుంది. మరి లగేజ్ సర్ది ఏమేమి చూడాలో ఒక్కసారి పరిశీలించండి.

ఆలి బాగ్

ఆలి బాగ్

మహారాష్ట్ర లోని పడమటి కోస్తా తీరంలో ఆలి బాగ్ ఒక చిన్న పట్టణం. కొంకన్ ప్రాంతం లోని రాయ్ గడ జిల్లాలో కలదు ఇక్కడ కల కొలబ ఫోర్ట్ ఒక ప్రధాన ఆకర్షణ. ఇది శిధిలావస్థ లో ఉన్నప్పటికీ పర్యాటకులు చూసేందుకు అధికంగా వస్తారు. దీనిని ఆలి బాగ్ బీచ్ నుండి చూడవచ్చు. కానేశ్వర్ మరియు సోమేశ్వర్ దేవాలయాలలో కల శివుడి అసేస్షులు పొందవచ్చు. అందంగా వుండే ఈ దేవాలయాలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఆలి బాగ్ లో అందమైన అనేక బీచ్ లు కలవు. బీచ్ ల వెంబడి కొబ్బరి మరియు తమలపాకు తోటలు వుండి ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పిస్తాయి.

అమ్బోలి

అమ్బోలి

అమ్బోలి ఒక చిన్న హిల్ స్టేషన్ ఇది సింద్ దుర్గ జిల్లాలో సహయాద్రి పర్వత శ్రేణులలో కలదు. వారాంతపు విహారాలకు అనువైన ప్రదేశం. ఇక్కడ కల శిర్గావ్న్కర్ జలపాతాలు, మహాదేవ జలపాతాలు, నగట్ట జలపాతాలు ఈ ప్రదేశానికి మరింత అందాలను చేర్చే. ఇది ఒక అద్భుత విహార ప్రదేశం. ఇక్కడ కల సి వ్యూ పాయింట్, కావేల్సాద్ పాయింట్, పరిక్షిట్ పాయింట్ మరియు మహాదేవ గడ పాయింట్ లనుండి సుందర దృశ్యాలు, అరేబియన్ సముద్రం, కొంకన్ తీరం లు చూడవచ్చు.

Photo Courtesy: Ayilliath

అంబి వాలీ

అంబి వాలీ

అమ్బి వాలీ ని సహారా గ్రూప్ ఒక వారాంతపు విశ్రాంతి ప్రదేశంగా తీర్చి దిద్దింది. ఇక్కడ ఇందూర్ మరియు అవుట్ డోర్ క్రీడలతో ఒక రిసార్ట్ కలదు. అనేక సుందర ప్రదేశాలు, మానవ నిర్మిత సరస్సులతో ఆనందం కలిగిస్తాయి. Photo Courtesy: Swaminathan

చిప్లున్

చిప్లున్

చిప్లున్ రత్నగిరి జిల్లలో ఒక అందమైన పట్టణం. చిప్లున్ , తూర్పున పడమటి కనుమలు, పడమటి లో అరేబియన్ సముద్రం లు తో కలదు. సంవత్సరం పొడవునా వాతావరణం ఆహ్లాదంగా వుంటుంది. ఒకప్పుడు ఈ ప్రాంతం లో పరశురాముడు నివసించే వాడు. కొన్ని ప్రధాన దేవాలయాలు కూడా కలవు. ఇక్కడ కల గోవల్కొట్ కోట వద్ద అనేకమంది ఫోటోగ్రాఫర్లు లభిస్తారు. ఇది ఒక టూరిస్ట్ ఆకర్షణ

ఎల్లోరా గుహలు

ఎల్లోరా గుహలు

ఎల్లోరా గుహలు ఔరంగాబాద్ నుండి 30 కి. మీ. ల దూరంలో కలవు. వీటికి వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు కలదు. మొత్తంగా ఇవి 34 గుహలు. వీటిని బౌద్ధ, హిందూ మరియు జైన గుహలుగా విభజించారు. ఇవి అన్నీ సన్నిహితంగా వుండి ఆనాటి పరమత సహనం చాటుతాయి.

గణపతి పూలే

గణపతి పూలే

గణపతి పూలే కొండన తీరంలో ఒక అందమైన బీచ్ టవున్. రత్నగిరి జిల్లాలో కలదు. గణపతి పూలే లోని స్వయంభు గణపతి టెంపుల్ ఒక మహత్తరమైన గుడి. ఇక్కడి బీచ్ నీరు స్వచ్చంగా వుంటుంది. తీరం వెంబడి తాటి చెట్లు వరుసగా వుంది ఆకర్షణీయంగా వుంటుంది. ఈ ప్రాంతంలో రాయ గడ ఫోర్ట్ మరియు రాయ గడ లైట్ హౌస్ లు మరికొన్ని పర్యాటక ఆకర్షణలు.

కర్జాట్

కర్జాట్

కర్జాట్ రాయ్గడ్ జిల్లాలో ఒక పట్టణం. అనేక సుందర ప్రకృతి దృశ్యాలు, పర్వత ప్రాంతాలు కలిగి వుంటుంది. ప్రత్యేకించి ఈ ప్రదేశం ట్రెక్కింగ్ కు బాగుంటుంది. ట్రెక్కింగ్ కొత్తగా నేర్చుకునే వారు సైతం ఇక్కడ ట్రెక్కింగ్ చేసి ఆనందించవచ్చు. ఈ ప్రాంతంలో కల ఇతర బౌద్ధ స్మారకాలు, పెట్ ఫోర్ట్ , కొండన గుహలు వంటివి మరికొన్ని ఆకర్షణలు.

Photo Courtesy: RameshSharma1

సిల్వాస్సా

సిల్వాస్సా

సిల్వాస్సా పట్టణం దాద్రా మరియు నగర్ హవేలీ లకు రాజధాని. ప్రకృతి ఒడిలో విశ్రాంతి పొందగోరే వారికి ఒక ప్రసిద్ధ ప్రదేశం. ఇక్కడ కల రోమన్ కేథలిక్ చర్చి ఒక ప్రధాన ఆకర్షణ. వన్య జంతు ప్రియులు ఇక్కడకు పది కిలో మీటర్ల దూరం లో కల వసోనా లయన్ సఫారి కూడా సందర్శించవచ్చు.

ముంబై హోటల్ వసతులకు క్లిక్ చేయండి

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+