భారత దేశం అంతర్జాతీయ స్థాయి లో పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇక దేశీయంగా పర్యాటకుల సంఖ్య కూడా క్రమేనా అధికమై, టూరిజం శాఖ ఇండియాలో బాగా అభివృద్ధి చెందుతోంది. అయితే, మారుతున్న ఈ పర్యాటక రంగ నేపధ్యంలో, కొన్ని ప్రదేశాలలో విదేశీ మహిళలపై అత్యాచారాలు జరగటం మనం వింటూ ఉన్నాము. కనుక మహిళా పర్యాటకులు తమ పర్యటనలో వీలైనంత వరకూ ఒంటరిగా పర్యటించే సమయంలో ఏ ఏ ప్రదేశాలు సురక్షితంగా సందర్సించాలి ? అనేది పరిశీలిద్దాం.
మహిళలకు సురక్షిత పర్యాటక ప్రదేశాలు

నైనిటాల్
పర్వత శ్రేణులు అధికంగా గల రాష్ట్రం ఉత్తరాఖండ్ లో నైనిటాల్ కలదు. నైనిటాల్ ఒక సుందరమైన హిల్ స్టేషన్. హిమాలయాల ఒడిలో కుమావొన్ ప్రదేశ పర్వత శ్రేణులలో కల ఈ ఆహ్లాదమైన ప్రదేశం అందమైన కొండలు, సరస్సులు కలిగి వుంది. భారత దేశ అతి ప్రాచీన నేషనల్ పార్క్ అయిన జిమ్ కార్బెట్ పార్క్ నైనిటాల్ సమీపంలోనే కలదు.

మనాలి
హిమాలయాల ఒడిలో ప్రశాంతంగా నెలకొన్న ఈ చిన్న హిల్ స్టేషన్ చాలా అందమైనది. మహిళలకు నచ్చినది. సముద్ర మట్టానికి 1950 మీటర్ల ఎత్తున కల ఈ హిల్ స్టేషన్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కుళ్ళు జిల్లా లో కలదు. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా నుండి సుమారు 250 కి. మీ. ల దూరం లో వుంటుంది.

పనాజి
పనాజి పట్టణం గోవా రాష్ట్ర రాజధాని. సెలవుల విహారానికి ఒక మంఛి ప్రదేశం. గోవా లో ఉత్తర, దక్షిణ గోవా అని రెండు భాగాలు కలవు. ఉత్తర గోవా లోని పనాజి, మాపూసా, బిచోలిం బీచ్ లు ఎంతో సుందరమైనవి. రాత్రి సమయాలలో సైతం ఈ ప్రదేశాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. పనాజి పట్టణం ఎంత బిజిగా ఉన్నప్పటికీ సురక్షితమైనదే.

జైసల్మేర్
జైసల్మేర్ ను బంగారు నగరం అని పిలుస్తారు. జైసల్మేర్ అక్కడ కల కోటలకు , పాలస్ లకు ప్రసిద్ధి. రాజస్తాన్ లోని ఎడారి పట్టణాలలో జైసల్మేర్ ఒక రత్నం వంటిది. ఇసుక బండ్ల ఉత్సవం, ఒంటె సఫారి వంటి ఆకర్షణలు ఇక్కడ చూడవచ్చు. మహిళల పర్యటనకు ఈ ప్రదేశం సురక్షితమై నదే.
ఫోటో క్రెడిట్ : Flicka

మహాబలేశ్వర్
మహారాష్ట్ర లోని మహాబలేశ్వర్ హిల్ స్టేషన్ అందానికి ప్రతీకగా వుంటుంది. ఈ ప్రదేశం పడమటి కనుమలలో కలదు. కొత్తగా పెళ్లి అయిన యువ జంటలు ఈ ప్రదేశానికి హనీ మూన్ కు వస్తారు. సుందర మైన ఈ ప్రదేశం కు విదేశీయులు కూడా అధికంగా వస్తారు.
ఫోటో క్రెడిట్ : Tropicana

కొడగు
కొడగు పట్టణం కర్నాటక రాష్ట్రం లో కలదు. ఈ మధ్య కాలంలో కొడగు పట్టణం ఒక గొప్ప పర్యాటక ప్రదేశం గా అధిక సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తోంది. కొడగు పట్టణం చుట్టుపక్కల అనేక పర్యాటక ఆకర్షణలు కలవు. మహిళా పర్యాటకులకు ఇది ఒక సురక్షిత పర్యాటక ప్రదేశం.
ఫోటో క్రెడిట్ Philanthropist 1

మున్నార్
ఎత్తైన ఈ ప్రదేశంలో విశాలమైన సుగంధ వాసనల తేయాకు తోటలు కలవు. మున్నార్ చుట్టుపక్కల పరిసరాలు ఎంతో అందంగా వుంటాయి. మున్నార్ ప్రదేశం అనేక కొండలు, సరస్సులతో ఒక ఆకర్షణీయ హిల్ స్టేషన్. పశ్చిమ కనుమలలో కేరళ రాష్ట్రంలో కల అందమైన ఈ ప్రదేశం ఒక సారి చూస్తె చాలు, మరీ మరీ చూడాలని అనిపించే ప్రదేశం గా వుంటుంది.
ఫోటో క్రెడిట్ : Bimal K C

కొడైకెనాల్
కోడై కెనాల్ ను హిల్ స్టేషన్ ల యువ రాణి అంటారు. అందమైన ఈ ప్రదేశం తమిళనాడు రాష్ట్రంలో కలదు. ఆహ్లాదకర వాతావరణం, సుందరమైన జలపాతాలు కల ఈ ప్రదేశాన్ని మహిళలు అమితంగా ఇష్టపడతారు. ఈ పర్యాటక ప్రదేశం మహిళలకు సురక్షితమై నదే.
ఫోటో క్రెడిట్ : Wikitom2

దివియాగర్
దివియాగర్ మహారాష్ట్ర లోని రాయ గడ్ జిల్లాలో కల శ్రీ వర్ధన తాలూకా లో కలదు. ఇది ఒక కోస్తా తీర పట్టణం. హరి హరేస్వర్ ప్రదేశం సమీపంలో కల ఈ ప్రదేశం ఒక గొప్ప పర్యాటక ఆకర్షణ. ఇక్కడి బీచ్ లో మీరు డాల్ఫిన్ చేపలను సైతం చూసి ఆనందించవచ్చు.
ఫోటో క్రెడిట్ : Pankaj Dhande

ఊటీ
ఊటీ పట్టణం అంటే ఎంతో మంది బాగా ఇష్టపడతారు. నీలగిరి కొండలలో ఇది ఒక సుందర హిల్ స్టేషన్ . దీని అధికార నామం ఉటకమాండ్
అని అంటారు. కాల క్రమేనా ఈ పర్యాటక ప్రదేశం క్లుప్తంగా ఊటీ అని పిలువ బడుతోంది. దక్షిణ భారత దేశంలోని ఈ ప్రాంతానికి అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చి ఆనందిస్తారు.
ఫోటో క్రెడిట్ : Ghost Particle

పాండిచేరి
దక్షిణ భారత దేశంలో గొప్ప పర్యటన ప్రదేశం అయిన పాండిచేరి కేంద్ర పాలిత ప్రాంతాలలో ఒకటి గా కలదు. అనేక వసతి గృహాలు, టెంపుల్స్, చర్చి లు మరియు సముద్రపు ఒడ్డు కల ఈ ప్రదేశం పర్యాటకులు అమితంగా ఇష్టపదేడిగా వుంటుంది.
ఫోటో క్రెడిట్ : Aviad2001

వైజాగ్
ఆంధ్ర ప్రదేశ్ లోని వైజాగ్ పట్టణం ఒక కోస్తా తీర పట్టణం. ఈ పట్టణం తలరాత నగరం లేదా సిటీ అఫ్ డెస్టినీ గా పేరు గాంచినది. ఇక్కడ కల అందమైన పర్వత శ్రేణులు, సుందర మైదానాలు ఈ పట్టణం ను ఒక గొప్ప పర్యాటక ప్రదేశంగా మార్చాయి. ఇక్కడ నౌకా దళ కేంద్ర ఆఫీస్ మరియు అనేక కేంద్ర ప్రభుత్వ డిఫెన్సు ఆఫీస్ లు కలవు.
ఫోటో క్రెడిట్ :Sekharyeeti

డార్జిలింగ్
భారత దేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కల డార్జిలింగ్ పట్టణం ఎంతో ముద్దు వచ్చే పట్టణం. ఈ పట్టణం తేయాకు తోటలకు ప్రసిద్ధి. వేడి వేడి డార్జిలింగ్ టీ తాగిన పర్యాటకులు మరొక సారి ఈ పట్టణానికి వెళ్ళ కుండా ఉండలేరు. మహిళలు అతిగా ఇష్టపడే ఈ పట్టణం వారికి సురక్షితమైనదే. ఫోటో క్రెడిట్ : Judith

పూరి
పూరి పట్టణం భారతదేశంలోని హిందువుల పుణ్య క్షేత్రాలు అయిన చార్ ధాం లలో ఒకటి. ఇక్కడ కల పూరి జగన్నాధ స్వామీ ఆలయం మరియు కోణార్క్ సూర్య దేవాలయంలు ఎంతో ప్రసిద్ధి. ఇది ఒక కోస్తా తీర పట్టణం. సుందరమైన బీచ్ కలిగి వుంది.
ఫోటో క్రెడిట్: Lovedimpy



Click it and Unblock the Notifications











