Search
  • Follow NativePlanet
Share
» »వైజాగ్ స‌మీపంలోని సంద‌ర్శ‌నీయ ప‌ర్యాట‌క ప్ర‌దేశాలు!

వైజాగ్ స‌మీపంలోని సంద‌ర్శ‌నీయ ప‌ర్యాట‌క ప్ర‌దేశాలు!

వైజాగ్ స‌మీపంలోని సంద‌ర్శ‌నీయ ప‌ర్యాట‌క ప్ర‌దేశాలు!

అందాల న‌గ‌రం విశాఖ‌ప‌ట్నం చుట్టూ ప‌ర్యాట‌క ఆక‌ర్ష‌ణ‌ల‌కు కొర‌త లేదు. వైజాగ్ కేంద్రంగా జ‌ర్నీ మొద‌లుపెట్టి త‌క్కువ స‌మ‌యంలోనే ప్ర‌కృతిసిద్ధ‌మైన సంద‌ర్శ‌నీయ నేల‌పై అడుగుపెట్టోచ్చు. అందుకే, ఈ గ‌జిబిజి న‌గ‌రం నుంచి కాస్త విరామం కోరుకుని, ప్ర‌శాంత‌మైన.. ప్ర‌కృతిసిద్ధ‌మైన సుంద‌ర దృశ్యాల‌ను చూడాల‌నుకునేవారికి విశాఖ వేదికగా పేరుగాంచింది.

వైజాగ్ న‌గ‌రానికి చేరువ‌గా ఉన్న ఈ పర్యాటక ఆకర్షణలను మీ టూర్ జాబితాలో చేర్చాల్సిందే. విశాఖ‌ప‌ట్నం నుండి ఐదు గంటలు లేదా అంతకంటే తక్కువ వ్యవధిలో ఉన్న నాలుగు సమీప పర్యాటక ప్ర‌దేశాలు మీ కోసం..

తాటిపూడి రిజర్వాయర్

తాటిపూడి రిజర్వాయర్

మీరు ప్ర‌కృతిసిద్ధ‌మైన సుంద‌ర‌ దృశ్యాలను ఆస్వాదించే వారైతే, తప్పక సందర్శించాల్సిన ప్రదేశం తాటిపూడి రిజ‌ర్వాయ‌ర్‌. ఈ రిజర్వాయర్ వైజాగ్ తాగునీటి సరఫరాకు మాత్ర‌మే కాదు, మీకు కొన్ని అద్భుతమైన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లను అందేంచే ఒక అద్భుతమైన ప్రదేశం కూడా. ప‌చ్చ‌ని కొండ‌కోన‌ల మ‌ధ్య దాగిన అందాల‌ను మ‌న‌సారా ఆస్వాదించడానికి మీరు రిజ‌ర్వాయ‌ర్‌ చుట్టూ పడవ ప్రయాణం చేయవచ్చు. దీని చివరి ఒడ్డున ఒక రిసార్ట్ ఉంది. ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణాన్ని అనుభ‌వించేందుకు, శీతాకాల‌పు ఉద‌య‌పు అందాల‌ను త‌నివితీరా రుచిచూసేందుకు ఈ రిసార్ట్‌లో గ‌దిని బుక్ చేసుకోవచ్చు. తాటిపూడి విశాఖ‌ప‌ట్నం నుండి సుమారు అర‌వై కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడికి చేరుకోవడానికి మీకు రెండున్నర గంటల కంటే ఎక్కువ సమయం పట్టదు.

కొత్తపల్లి జలపాతాలు

కొత్తపల్లి జలపాతాలు

వైజాగ్ నుండి దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతాలు నగరం వెలుపల ఒక వింతైన మరియు ప్రశాంతమైన రైడ్‌కు దోహ‌ద‌ప‌డ‌తాయి. అంతేకాదు, కొత్తపల్లి జలపాతాలు ఇతర జలపాతాల మాదిరిగా అంత‌ ప్రసిద్ధి చెందినవి కావు. ఈ కార‌ణంగా రద్దీకి దూరంగా ఉన్న ప్రదేశాల కోసం వెతుకుతున్న పర్యాటకులకు ఇది సరైన ప్రదేశంగా గుర్తింపు పొందింది. జలపాతం చుట్టూ స్ట్రాబెర్రీ పొలాలు క‌నిపిస్తాయి. వీటిని మీరు సందర్శించవచ్చు. వీటితోపాటు గుబురుగా క‌నిపించే కాఫీ తోటల్లో ఫోటోలకు ఫోజులు ఇవ్వొచ్చు.

కటికి జలపాతాలు

కటికి జలపాతాలు

వైజాగ్ చుట్టుపక్కల మీరు సందర్శించాల్సిన ప్రదేశాల జాబితాలో ఇది మరొక జలపాతం. కటికి జలపాతాలు 50 అడుగుల ఎత్తునుంచి జాలువారుతాయి. ఈ జలపాతం ప్రత్యక్షంగా చూసేందుకు అద్భుతంగా ఉంటుంది. జలపాతం చుట్టూ అందమైన అడవులు ఉన్నాయి. ఇక్కడ మీరు ట్రెక్కింగ్ చేయవచ్చు. అకాశ‌పు అద్భుతాల‌ను వీక్షించేందుకు రాత్రిపూట అడవుల్లో విడిది చేసే అవ‌కాశం కూడా ఉంటుంది. కటికి జలపాతం వైజాగ్ నుండి 100 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో ఉంది. అక్కడికి చేరుకోవడానికి మూడు గంటల సమయం పడుతుంది.

యానాం

యానాం

తీరం వెంబడి ఉన్న ఈ అందమైన పట్టణం కంటికి కనిపించే దానికంటే ఎక్కువ చారిత్ర‌క నేపధ్యం గ‌ల ప‌ర్యాట‌క ప్ర‌దేశం. కాకినాడకు దక్షిణాన ఉన్న ఒక సుందరమైన పట్టణం పుదుచ్చేరి యూనియన్ టెరిటరీలో ఒక భాగం. గొప్ప చరిత్ర మరియు సంస్కృతికి చిహ్నంగా నిలుస్తోంది. ఈ పట్టణం ఫ్రెంచ్ మరియు తెలుగు సంస్కృతి యొక్క ప్రత్యేక సమ్మేళనం. పట్టణంలో మీ తదుపరి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు మంచి బ్యాక్‌డ్రాప్‌గా ఉండే అందమైన భవనాలు మరియు బీచ్‌లు ఉన్నాయి. వైజాగ్ నుండి యానాం 184 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడికి చేరుకోవడానికి నాలుగు గంటల కంటే ఎక్కువ సమయం పట్టదు.

More News

    Read more about: visakhapatnam
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+