వైజాగ్ నుండి నేరుగా విమాన సర్వీసులు ఉన్న పర్యాటక ప్రదేశాలు
విశాఖ నగరం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. బీచ్‌లు, కొండలు, సంస్కృతి, వారసత్వ నిర్మాణాలు ఇలా చెప్పుకుంటూపోతే ఇక్కడ లేనిది అంటూ ఏది ఉండదంటారు. అందుకే, వైజాగ్ చాలా మంది ప్రయాణికుల టూర్ ప్లాన్‌లో అగ్రస్థానంలో ఉంటుంది. అయితే, దేశంలోని ప్రసిద్ధ ప్రదేశాలకు ప్లాన్ చేస్తున్నట్లయితే, సౌకర్యవంతంగా గమ్యస్థాన్ని చేరుకునేందుకు నేరుగా విమానం ప్రయాణం మంచి ఎంపికగా భావిస్తారు.
విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో 14 డైరెక్ట్ డొమెస్టిక్ విమానాలు మరియు ఒక డైరెక్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఉన్నాయని మీకు తెలుసా? ఇవి కొన్ని ప్రసిద్ధ పర్యాటక గమ్యస్థానాలకు అనుసంధానించబడి ఉంటాయి. ఇక్కడ విశాఖపట్నం నుండి నేరుగా విమానాలు అందుబాటులో ఉన్న ఐదు పర్యాటక ప్రదేశాల వివరాలను మీకు అందిస్తున్నాం.

తిరుపతి
సెలవు దినాలను ఆధ్యాత్మిక చింతనలో గడపాలి అనుకునేవారి మొదటి ఎంపిక తిరుపతి. విశాఖపట్నం నుండి నేరుగా విమానంలో చేరుకునే అవకాశం ఉన్న హిందూ పుణ్యక్షేత్రమైన తిరుమల నగరం ఆంధ్రప్రదేశ్‌కి ఆధ్యాత్మిక రాజధానిగా కూడా పేరుపొందింది. ఈ పవిత్ర నగరంలో సంస్కృతి, చారిత్రక నేపథ్యానికి నిలయం. ఇది భారతదేశంలోని వివిధ మతాల పట్ల ఆసక్తి ఉన్నవారికి ఇది సరైన గమ్యస్థానంగా నిలుస్తుంది. ఇక్కడకు ఇండిగో రోజువారీ డైరెక్ట్ విమానాన్ని నడుపుతుంది. ఇది వైజాగ్ నుండి ఉదయం 9:55 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:10 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.

కోల్‌కతా
సౌకర్యవంతమైన సెలవుదినాలను ఎంజాయ్ చేయడానికి కోల్‌కతా సరైన గమ్యస్థానంగా చెప్పొచ్చు. ఇక్కడికి చేరుకునేందుకు విశాఖపట్నం నుండి నేరుగా విమానాల సౌకర్యం అందుబాటులో ఉంది. కోల్‌కతా నగరానికి గొప్ప చారిత్రిక నేపథ్యం ఉంది. మరీ ముఖ్యంగా ఇక్కడి పురాతన నిర్మాణాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ట్రామ్‌లు, మ్యూజియంలు, ఆర్ట్ గ్యాలరీలు మొదలైన సందర్శనీయ ప్రదేశాల కారణంగా ఈ నగరం దాని మనోహరమైన గతానికి సాక్ష్యమిచ్చేలా ఠీవిగా నిలబడుతోంది. ఇండిగో ప్రతిరోజూ విశాఖపట్నం నుండి మధ్యాహ్నం 3:25 గంటలకు బయలుదేరి సాయంత్రం 5:00 గంటలకు కోల్‌కతా చేరుకుంటుంది.

గోవా
విశాఖపట్నం నుండి ప్రత్యక్ష విమానాలతో ఉత్తమ పర్యాటక గమ్యస్థానాల్లో అందుబాటులో ఉన్న తాజా గమ్యస్థానం గోవా. భారతదేశాన్ని సందర్శించే ప్రతి పర్యాటకుడు సందర్శించవలసిన ప్రదేశాల జాబితాలో గోవా ఉంటుందంటే నమ్మకతప్పదు. ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన బీచ్‌లను ఆస్వాదించే వారికి భారతదేశంలోని ఉత్తమ విహారయాత్రలలో ఇది ఒకటి. ఇండిగో ఎయిర్‌లైన్స్ అందించే ఈ విమానం విశాఖపట్నం నుండి రాత్రి 7:00 గంటలకు బయలుదేరి రాత్రి 8:50 గంటలకు గోవాలోని మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటుంది.

అండమాన్ మరియు నికోబార్
ఈ మనోహరమైన ద్వీపాలు కొన్ని ఇతర సందర్శనీయ ప్రదేశాలకు అతీతంగా సహజ సౌందర్యాన్ని కలిగి ఉంటాయి. ఈ ద్వీపాల అందమైన దృశ్యాలను మరెక్కడా చూసే అవకాశం లేదు. నీటిలో అనేక ఆసక్తికరమైన జాతుల వన్యప్రాణులకు నిలయంగా ఉన్నాయి. ఎయిర్ ఇండియా సోమ, గురువారాల్లో వైజాగ్ నుండి పోర్ట్ బ్లెయిర్‌కు నేరుగా విమాన సర్వీసును అందిస్తుంది. ఈ విమానం విశాఖపట్నం నుంచి ఉదయం 8:15 గంటలకు బయలుదేరి 10:20 గంటలకు పోర్ట్ బ్లెయిర్ చేరుకుంటుంది.

సింగపూర్
విశాఖపట్నం నుండి ఇప్పటివరకు నేరుగా విమానాలు ఉన్న ఏకైక అంతర్జాతీయ గమ్యస్థానం సింగపూర్. సింగపూర్ దేశం ప్రపంచ ఆర్థిక కేంద్రంగానే కాకుండా లగ్జరీ టూరిజంలో అభివృద్ధి చెందుతున్న ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. స్కూట్ ఎయిర్‌లైన్స్ వారానికి నాలుగు రోజులు నేరుగా విమానాన్ని అందిస్తోంది. ఇది వైజాగ్ నుండి రాత్రి 11:55 గంటలకు బయలుదేరి ఉదయం 6:35 గంటలకు సింగపూర్ చేరుకుంటుంది.



Click it and Unblock the Notifications












