Search
  • Follow NativePlanet
Share
» »హైద‌రాబాద్ టు అమ‌రావ‌తి ప్ర‌యాణ‌మా..? అయితే, వీటిని అస్స‌లు మిస్స‌వ్వ‌ద్దు..

హైద‌రాబాద్ టు అమ‌రావ‌తి ప్ర‌యాణ‌మా..? అయితే, వీటిని అస్స‌లు మిస్స‌వ్వ‌ద్దు..

హైద‌రాబాద్ నుంచి స‌మీపంలోని ప్రాంతాల‌కు సంద‌ర్శ‌న‌కు వెళ్లాల‌ని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే, చాలామంది ఆంధ్ర‌ప్ర‌దేశ్ వాసులు కూడా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఉంటారు. అయితే, సెల‌వుల్లో ఏ ప్రాంతాల‌కైనా విహ‌రించాల‌నుకునేవారు త‌ప్ప‌కుండా ఏపీ రాజధాని అమ‌రావ‌తిని విజిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇక్క‌డ ఏన్నో పురాత‌న ఆలయాలు, చారిత్ర‌క క‌ట్టడాలు దాగి ఉన్నాయి. ఇక‌, ఏపీలో ఏర్ప‌డిన కొత్త ప్ర‌భుత్వం ఇక్క‌డి ప‌ర్యాట‌క అందాలను ప్ర‌జ‌ల్లోకి వెళ్లేలా చేరువ చేస్తుంది. గుంటూరు జిల్లాలో కృష్ణా నది ఒడ్డున నెలకొని ఉన్న అమరావతి పురాతన కాలం నుండి ఆధునికత వైపు సాగిన ఓ ప్రయాణం లాంటిద‌నిచెప్పుకోవాలి.

దక్షిణ భారతదేశంలోని ఓ చిన్న పట్టణం అమరావతి! ఇక్కడ ఎన్నో ప‌ర్యాట‌క ప్రాంతాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా పురాత‌న ఆల‌యాలు, చారిత్ర‌క క‌ట్ట‌డాల‌తో పాటు అంద‌మైన జల‌పాతాల స‌వ్వ‌డులు ఇక్క‌డి సొంతం. అమ‌రావ‌తిలో ఉన్న‌ అమరేశ్వర టెంపుల్, బౌద్ధరామాలు కారణంగా ఈ ప్రదేశం ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందింది. ప్రాచీన శాసనాల ప్రకారం అమరావతిని అప్పట్లో "ధాన్య కటకం" లేదా "ధరణికోట" అని పిలిచేవారట! ప్రస్తుతం అమరావతిలోని బౌద్ధ రామాలు, అద్భుత శిల్పాలు శిధిలాస్థితిలో చేర‌కున్నాయి. ఆ శిల్పాలు శిథిల‌మైన‌ప్ప‌టికీ వాటి నిర్మాణాల‌ను చూస్తే ఆశ్చ‌ర్యం క‌లుగ‌క‌మాన‌దు.

ఈ ప్ర‌దేశం విజయవాడ నుండి సుమారు 65 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో విద్యార్థులను ఆకర్షించిన భారతదేశంలోని నాలుగు ప్రధాన అభ్యాస కేంద్రాలలో అమరావతి కూడా ఒకటి. ఈ ప్రదేశం ఇటీవలి కాలంలో ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతుంది. అమరావతి హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-గుంటూరు లైన్‌లో వస్తుంది. రైలు ప్ర‌యాణం ద్వారా అమ‌రావ‌తిని చేరుకోవాల‌నుకునేవారు ఈ రూట్ల‌లో ప్ర‌యాణించవ‌చ్చు.

amareswaratemple1

పురావస్తు మ్యూజియం

అమరావతిలోని ప్ర‌సిద్ధిచెందిన ప్ర‌దేశాల‌లో పురావస్తు మ్యూజియం ఒక‌టి. ఇది ఆర్కియాలజికల్ మ్యూజియం త్రవ్వకాలలో కనుగొనబడిన వేల సంవత్సరాల నాటి అనేక అవశేషాలకు నిలయంగా ఉంది. ఈ మ్యూజియంలో 3వ శతాబ్దపు BCకి చెందిన అమరావతి సంపద దాగి ఉంది.

అమరావతి పురాతన చరిత్రకు సంబంధించిన ఆన‌వాళ్లు, ఆ రోజుల్లో బౌద్ధుల జీవితానికి దగ్గరగా తీసుకెళ్ళే వివిధ గ్యాలరీలు ఈ మ్యూజియంలో పొందుప‌రిచి ఉన్నాయి. ఇక, మ్యూజియం శుక్రవారాల్లో మూసివేయబడుతుంది. ఇతర రోజులలో ఉదయం 10:00 నుండి సాయంత్రం 5:00 వరకు పర్యాట‌కుల సంద‌ర్శ‌నార్థం తెరిచి ఉంటుంది.

amaravati buddha stupa

అమరావతి స్తూపం

అమరావతిలో అమరావతి స్తూపం లేదా మహా చైత్య ఒక గొప్ప ఆకర్షణ అనే చెప్పుకోవాలి. అశోక చక్రవర్తి కాలంలో ఈ స్తూపాలు నిర్మించబడ్డాయి. ఈ స్తూపం, దానిపై చెక్కబడిన బుద్ధుడి జీవిత కథ, అతని బోధనలను వివ‌రిస్తుంది. పర్యాటకులు ఇక్కడికి వచ్చి బుద్ధుని స్థూపాలను దర్శిస్తారు. చాలా మంది బౌద్ధ భిక్షులు ప్రతి ఏటా ఇక్కడికి వస్తుంటారు.

2వ శతాబ్దంలో నిర్మించబడిన అమరావతి మహా స్థూపం దేశంలోనే అతి పెద్ద స్థూపంగా పేరుగాంచింది. ఇది గొప్ప సన్యాసి అయిన ఆచార్య నాగార్జున కృషితో నిర్మించబడిందని చ‌రిత్ర చెబుతోంది. స్థూపం యొక్క ఉపరితలం అందంగా చెక్కబడిన తెల్లటి సున్నపురాయి పలకలతో కప్పబడి ఉంటుంది. ఇది ఒక పాలరాయిని పోలి ఉంటుంది. స్థూపం చుట్టూ ఉన్న రైలింగ్, నాలుగు గేట్‌వేలు కూడా చెక్కిన సున్నపురాయి పలకలతో అలంకరించబడ్డాయి.

More News

    Read more about: amaravati andhrapradesh
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+