కేరళ రాష్ట్రం దాని సహజ అందాలకు ప్రసిద్ధి. పర్యాటకులు తేలికగా ఈప్రదేశానికి ఆకర్షించబడతారు. అలెప్పి, కుమరకోమ్ , మున్నార్ వంటివి ఈ రాష్ట్రంలో కొన్ని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు. కాని కేరళలో కొన్ని ఎవరికీ త్వరగా తెలియని ప్రదేశాలు కూడా కలవు. ఈ ఆర్టికల్ అటువంటి కేరళ రాష్ట్ర పర్యాటక ఆకర్షనలను మీకు అందిస్తోంది. మీరు వీటిని లాస్ట్ ట్రిప్ లో మిస్ అయితే, తర్వాత మీరు వెళ్ళినపుడు తప్పక వీటిని సందర్శించి ఆనందించండి.

నేల్లియంపతి
నేల్లియంపతి ఒక సుందరమైన హిల్ స్టేషన్ ఇది పాలక్కాడ్ కు 60 కి. మీ. ల దూరంలో కలదు. కొండలపై ఎత్తుగా వున్నప్పటికి ఈ ప్రదేశంలో పచ్చటి కాఫీ మరియు తేయాకు తోటలు అధికంగా కలవు. ఇక్కడ కొన్ని ప్రదేశాలలో తప్ప మిగిలిన చోట్ల మొబైల్ నెట్ వర్క్ పని చేయదు. సిగ్నల్స్ చాలా వీక్ గా వుంటాయి.

చేమ్బ్రా శిఖరం
చేమ్బ్రా శిఖరం వయనాడ్ లో అతి ఎత్తైన శిఖరం. కేరళ లోని అన్వేషించని ప్రదేశాలలో ఒకటి. సముద్ర మట్టానికి 2100 మీటర్ల ఎత్తున కల ఈ ప్రదేశం ట్రెక్కింగ్ కు చక్కగా ఉంటుది. ఈ పర్వతం కోన భాగం గుండె ఆకారంలో వుండి ఆకర్షనీ యంగా వుంటుంది.

సైలెంట్ వాలీ నేషనల్ పార్క్
సైలెంట్ వాలీ నేషనల్ పార్క్ కేరళలో ఒక సహజ వండర్ ప్రదేశం. పాలక్కాడ్ వద్డకల నీలగిరి హిల్స్ లో కల ఈ నేషనల్ పార్క్ కొన్ని అరుదైన జంతువులు కలిగి వుంది. అరుదైన పక్షులు కూడా చూడవచ్చు. కనుమరుగు అవుతున్న జాతి అయిన నీల గిరి దార్ జింకలు ఇక్కడ విరివిగా సంచరిస్తాయి. పాలక్కాడ్ కి ఈ ప్రదేశం సుమారు 70 కి. మీ. ల దూరంలో వుంటుంది.

ముజప్పిలన్గాద్ డ్రైవ్ ఇన్ బీచ్
ముజప్పిలన్గాద్ బీచ్ కన్నూర్ జిల్లా లో కలదు. ఈ బీచ్ ఇండియాలో ఒకటి మాత్రమే కాగా ఆసియ లో ఇది రెండవ అతి పెద్దది. కేరళ లో ఇది ఒక అన్వేషించని ప్రదేశం. ఇక్కడ అనేక సాహస క్రీడలు ఆచరిస్తారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. దీనికి సమీప టవున్ తలస్సేరి. ఇది బీచ్ నుండి 7 కి. మీ. ల దూరం మాత్రమే వుంటుంది.

బాణాసుర సాగర్ డాం
బాణా సుర సాగర్ డాం వయనాడ్ లోని కలపెట్ట కు 21 కి. మీ. ల దూరం. ఇండియా లో ఇది ఒక అతిపెద్ద ఎర్త్ డాం. ఆసియ లో రెండవ అతి పెద్దది. ఈ డాము పెద్ద పెద్ద రాళ్ళు, మట్టి దిబ్బలు తో నిర్మిచినది. కరవు వచ్చినపుడు, ఈ ప్రాంతానికి నీరు సరఫరా చేసేందుకు ఈ డాం నిర్మించారు. ఇక్కడ నుండి అందమైన బాణాసుర కొండలు కూడా చూడవచ్చును. పడమటి కనుమల ట్రెక్కింగ్ కు ఇది మొదటి ప్రదేశం.

తట్టేక్కాద్ బర్డ్ సాన్క్చురి.
కేరళలో ఇది మొదటి బర్డ్ సాన్క్చురి . ఇక్కడ మీరు వివిధ రకాల ఫారెస్ట్ పక్షులు, నీటి పక్షులు చూడవచ్చు. ఇండియా లో ఇది ఒక అద్భుత బర్డ్ నివాసంగా ప్రసిద్ధ పక్షి శాస్త్రజ్ఞుడు సలీం ఆలి దీనిని పేర్కొన్నాడు. ఈ సాన్క్చురి ఎర్నాకులం జిలాలోని పెరియార్ నది కి ఉత్తర దిశగా వుంది.

వజాచల్ వాటర్ ఫాల్స్
బహుశా మీరు అతిరపల్లీ వాటర్ ఫాల్స్ గురించి వినే వుంటారు. కేరళలో అతిరాపల్లీ సమీపంలోనే ఈ వాటర్ ఫాల్స్ కలవు. అతిరపల్లీ మరియు వాజచల్ ఫాల్స్ కు మధ్య 5 కి. మీ. ల దూరం కలదు. ఈ ఫాల్స్ ను సందర్శించేందుకు అక్టోబర్ నుండి మార్చ్ వరకూ అనుకూలమైన సమయం.

వల్లియ పరంబ బ్యాక్ వాటర్స్
వల్లియ పరంబ బ్యాక్ వాటర్స్ కాసర్గోడ్ జిల్లాలో కలవు. ఈ బ్యాక్ వాటర్స్ చుట్టూ నాలుగు నదులు ప్రవహిస్తూ చిన్న ద్వీపాలు అనేకం ఏర్పడ్డాయి. ఈ ప్రదేశం చేపలు పట్టుటకు అనువైనది. బెకల్ నుండి ఒక గంట రోడ్డు ప్రయాణంలో చేరవచ్చు.
Photo Credit: Sherjeena

ఇలవీజ పూన్చిర
ఈ హిల్ స్టేషన్ ఒక అద్భుత పర్యాటక ప్రదేశం. ప్రకృతి ప్రియులు బాగా ఇష్టపడతారు. ఎవరూ అన్వేషించని ఈ ప్రదేశం కేరళలోని కొట్టాయం జిల్లా లో కలదు. ఇలవీజ పూన్చిర అంటే, ' ఆకులు కిందపడని వాలీ 'అని అర్ధం చెపుతారు.

పొంముడి
సముద్ర మట్టానికి సుమారు 1100 మీటర్ల ఎత్తున కల పొంముడి కేరళలోని తిరువనంతపురం లో ఒక ప్రసిద్ధ విహార ప్రదేశం. దీనిని గోల్డెన్ పీక్ అంటారు అంటే స్వర్ణ శిఖరం అని అర్ధం. ఈ ప్రదేశంలో వేసవిలో కూడా ఎంతో ఆహ్లదంగా వుంటుంది.

తేన్మల
తేన్మల ఒక పర్యావరణ రక్షిత ప్రదేశం. ఇది తిరువనంతపురానికి సుమారు 70 కి. మీ. ల దూరం లో వుంటుంది. తేన్మల అంటే, ' తేనెల పర్వతం' అని అర్ధం. ఇక్కడ ఔషధ గుణాలు కల అనేక మొక్కలు వున్నాయని చెపుతారు. ఇండియా లో మొట్ట మొదటి ఎకో టూరిజం ప్రాజెక్ట్ ఇక్కడ అమలు చేసారు.



Click it and Unblock the Notifications














