Search
  • Follow NativePlanet
Share
» »నారదుడు ‘‘వేం-కట’’ అని పేరు పెట్టిన పుణ్యక్షేత్రం సందర్శనతో

నారదుడు ‘‘వేం-కట’’ అని పేరు పెట్టిన పుణ్యక్షేత్రం సందర్శనతో

వాడపల్లి వేంకటేశ్వరస్వామి దేవాలయానికి సంబంధించిన కథనం.

ఇక్కడ వేంకటేశ్వరుడు రాయితో కాకుండా ఒక చెక్కలో స్వయంభువగా కొలువై ఉన్నాడు. అసలు నారదుడే విష్ణువుకు ఇక్కడ వేంకటేశ్వరుడిగా నామకరణం చేసినట్లు చెబుతారు. ఈ క్షేత్రాన్ని కోనసీమ తిరుపతిగా పిలుస్తారు. ఇక్కడ ఏడు వారాల శనివారం వ్రతం చేస్తే మనసులో ఉన్న కోరికలన్నీ తీరుతాయని చెబుతారు. అందువల్లే ఈ క్షేత్రంలో శనివారాల్లో వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అందమైన ప్రకృతి కి నిలయమైన తూర్పగోదావరి జిల్లాలో, తెలుగువారి వంట పూతరేకులకు ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురానాకి కూత వేటు దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం.

కోనసీమ

కోనసీమ

P.C: You Tube

నారదమహర్షి వేంకటేశ్వరుడిగా నామకరణం చేసి తన స్వహస్తాతో ప్రతిష్టించిన విగ్రహమే వాడపల్లి వేంకటేశ్వర విగ్రహం. ఈ క్షేత్రాన్ని కోనసీమ తిరుపతి అని కూడా అంటారు. ఈ క్షేత్రంలోని మూలవిరాట్టు రాతితో చేయబడినది కాదు.

చెక్కతో చేయబడింది

చెక్కతో చేయబడింది

P.C: You Tube

చెక్కతో చేయబడినది. ఇందుకు సంబంధించిన పురాణ కథనం ప్రకారం. శ్రీ క`ష్ణుడు తన అవతారం చాలించి వైకుంఠానికి చేరుకొంటాడు. దీంతో ద్వాపర యుగం అంతమించి అప్పుడప్పుడే కలియుగం ప్రారంభమవుతూ ఉంటుంది.

మునులు

మునులు

P.C: You Tube

ఈ సమయంలో కలియుగంలోని ప్రజలు దైవ చింతన మరిచిపోయి డబ్బు సంపాదన పై ఎక్కువ ద`ష్టి సారిస్తూ ఉంటారు. దీంతో భూ మండలం పై పాపాలు పెరిగిపోతూ ఉంటాయి. ఈ విషయమై మునులు తీవ్రంగా భయపడుతారు.

నారదుడి ఆధ్వర్యంలో

నారదుడి ఆధ్వర్యంలో

P.C: You Tube

నారదుడి ఆధ్వర్యంలో వైకుంఠానికి వెళ్లి ఈ భూమండలం పై జరుగుతున్న విషయాలను విష్ణువుకు తెలియజేసి ప్రజలను చెడు మార్గం వైపు వెళ్లకుండా రక్షించాల్సిందిగా వేడుకొంటారు. దీంతో వారికి విష్ణువు అభయమిస్తాడు.

ప్రజలతో నిత్యం పూజలు

ప్రజలతో నిత్యం పూజలు

P.C: You Tube

ఇప్పటి వరకూ ఏదేని ఒక ఉపద్రవం సంభవించినప్పుడు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఏదో ఒక రూపంలో అవతారాన్ని ఎత్తాను. అయితే ఆ అవతారంలో తనకు అర్చనలు జరగలేదు. అయితే ఈ కలియుగంలో తాను కలియుగ దైవంగా వెలిసి నిత్యం ప్రజలతో పూజలు అందుకొంటానని చెబుతాడు.

గతంలో నౌకాపురం

గతంలో నౌకాపురం

P.C: You Tube

దీని వల్ల వారిలో భక్తి భావం పెరుగుతుందని అభయమిస్తాడు. ఇందు కోసం ఇప్పటి వాడపల్లిలో స్వయంభువుగా వెలుస్తానని వారికి వివరిస్తాడు. దీంతో మునులు సంతోషంతో అక్కడి నుంచి వెనుదిరుగుతాడు. కాగా ఇప్పటి వాడపల్లినే పూర్వం నౌకాపురమనే పేరుతో పిలిచేవారు.

గౌతమి నదీతీరం

గౌతమి నదీతీరం

P.C: You Tube

ఇదిలా ఉండగా కొన్ని రోజుల తర్వాత మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వాడపల్లి వద్ద ఉన్న గౌతమీ నదీ లో ఓ చందనం పెట్టె తీరం వైపు వస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే ప్రజలు దానిని తీసుకురావడానికి వెళితే నదిలో ఆ పెట్టే కనిపించదు.

పక్షి నీడలో ఉన్న పెట్టే

పక్షి నీడలో ఉన్న పెట్టే

P.C: You Tube

చివరికి అశరీర వాణి రూపంలో ఆ పెట్టెలో మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉన్నాడని శుచిగా వెళితే కనిపిస్తాడని వినిపిస్తుంది. దీంతో ఆ తీరంలో ఉన్న ప్రజలు మంగళ స్నానాలు చేసి నదిలోకి వెలితే ఓ పక్షి నీడలో ఉన్న పెట్టే కనిపిస్తుంది.

నారదుడు కథ మొత్తం వారికి వివరిస్తాడు

నారదుడు కథ మొత్తం వారికి వివరిస్తాడు

P.C: You Tube

భక్తి శ్రద్ధలతో ఆ పెట్టెను ఒడ్డుకు చేరుస్తాడు. దీనిని తెరిచి చూడగా అందులో శంఖం, చక్రం, గదతో పాటు లక్షీ దేవితో శ్రీ మహావిష్ణువు కనిపిస్తాడు. ఇంతలో అక్కడకు నారదుడు వచ్చి జరిగిన కథ మొత్తం వారికి చెబుతాడు.

వేం-కట

వేం-కట

P.C: You Tube

అంతేకాకుండా ఆ మూర్తికి ‘వేం' అంటే ‘పాపాలను' ‘కట' అంటే పోగొట్టేవాడు. అని నామకరణ చేసి అక్కడ విగ్రహాన్ని ప్రతిష్టింపజేస్తాడు. అలా ఇక్కడ కొలువైన స్వామికి వేంకటేశ్వరుడిగా పేరు వచ్చింది. అటు పై అక్కడ ఉన్నవారంతా కలిసి అక్కడ ఆలయం నిర్మింపజేశారు.

తుఫాను

తుఫాను

P.C: You Tube

అయితే కాలక్రమంలో ఈ దేవాలయం నదిలో మునిగిపోయింది. ఇదిలా ఉండగా ఈ ప్రాంతంలో పెనుబోతుల గజేంద్రుడనే క్షత్రియుడు ఉండేవాడు. అతడు చాలా ఓడలకు అధిపతి. ఓకసారి తుఫాను సంభవించగా అతని ఓడలన్నీ సముద్రంలో ఎక్కడికో కొట్టుకుపోయాయి.

ఆలయం నిర్మిస్తాడు.

ఆలయం నిర్మిస్తాడు.

P.C: You Tube

దీంతో తన ఓడలు సురక్షితంగా ఒడ్డుకు తీసుకువస్తే నదిలో మునిగిపోయిన దేవాలయంలోని విగ్రహాన్ని తిరిగి ఒడ్డుకు చేర్చి దేవాలయాన్ని నిర్మిస్తానని చెప్పాడు. తుఫాను వెలిశాక ఓడలు భద్రంగా ఒడ్డుకు చేరాయి. దీంతో గజేంద్రుడు ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని కట్టించాడని స్థానిక శాసనాలు చెబుతాయి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+