Search
  • Follow NativePlanet
Share
» »విశాఖ ఫుడ్ ఎక్స్‌ప్రెస్‌..ఇచ్చ‌ట అన్నిర‌కాల వంట‌కాలు ల‌భించును..

విశాఖ ఫుడ్ ఎక్స్‌ప్రెస్‌..ఇచ్చ‌ట అన్నిర‌కాల వంట‌కాలు ల‌భించును..

విశాఖ ఫుడ్ ఎక్స్‌ప్రెస్‌..ఇచ్చ‌ట అన్నిర‌కాల వంట‌కాలు ల‌భించును..

భారతీయ రైల్వే ప్ర‌యాణికుల‌కు ఎన్నో సౌక‌ర్య‌వంత‌మైన వెసులుబాట్లు క‌ల్పిస్తుంది. రైల్వేల ద్వారానే ప్రతిరోజు లక్షల మంది ప్ర‌యాణికులు వారి వారి గమ్యస్థానాలకు చేరుకుంటారు. భార‌తీయుల‌కు ఆర్థికంగా ఎంతో సౌక‌ర్య‌వంతంగా ఉండే ప్ర‌యాణం సాధ‌నం రైల్వేనే. ప్ర‌యాణికుల కోసం కొత్త కొత్త వెసులుబాట్ల‌ను కూడా క‌ల్పిస్తుంటుంది. తాజాగా విశాఖపట్నంలో ఈస్ట్ రైల్వే కోస్ట్ కోచ్ ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. విశాఖ‌ప‌ట్నం అంద‌మైన ప్ర‌దేశాల‌కు, జ‌ల‌పాతాల‌కు, స‌ముద్ర‌తీర అందాల‌కు మాత్ర‌మే ప్ర‌సిద్ధి కాకుండా, ఇక్క‌డి వంట‌కాలు ముఖ్యంగా సీ ఫుడ్స్ ప‌ర్యాట‌కుల‌కు ఎంత‌గానో న‌చ్చుతాయి. విశాఖ‌ప‌ట్నంలో రైల్వేస్టేష‌న్ బ‌య‌టే రైల్వే కోచ్ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ రెస్టారెంట్ పేరు విశాఖ ఫుడ్ ఎక్స్‌ప్రెస్‌..ఈ ఎక్స్‌ప్రెస్‌లో అన్ని ర‌కాల వంట‌కాలు అందుబాటులో ఉంటాయ‌ట‌..మ‌రెందుకాల‌స్యం భోజ‌న ప్రియులంతా సిద్ధంకండి..

24 గంట‌లు అందుబాటులో...

వాల్తేరు డివిజన్‌ రైల్వే అధికారులు ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో ఓ సరికొత్త రెస్టారెంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్న‌దే త‌డ‌వుగా రైల్వేస్టేష‌న్ ముందున్న ఖాళీ స్థ‌లంలో వైజాగ్ ఫుడ్ ఎక్స్‌ప్రెస్‌ పేరుతో ఒక రెస్టారెంట్‌ను నిర్మించారు. కాంక్రీట్ నిర్మాణంతో కాకుండా ఒక పాత రైలు కోచ్‌ను తీసుకువచ్చి రెస్టారెంట్‌గా మార్చారు. ఈ రెస్టారెంట్‌ను ఎంతో అందంగా తయారుచేశారు. మండీ రెస్టారెంట్ టైప్ లో ఈ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. ప‌గ‌లైనా, రాత్ర‌యినా, ఏ స‌మ‌యంలో నైనా ఇక్క‌డ ఫుడ్ అందుబాటులోఉంటుంది. అర్థరాత్రి తర్వాత ఫుడ్ తినాలంటే నేరుగా రైల్వే స్టేషన్ కు వెళ్తే సరి కోచ్ రెస్టారెంట్లో ఫుడ్ సిద్ధంగా ఉంటుంది. ఈ రెస్టారెంట్ 24x7 అందుబాటులో ఉంటుంది. మనం ఎప్పుడు వెళ్ళినా ఇక్క‌డ వేడివేడి పదార్థాలనే వ‌డ్డిస్తారు.

VisakhaFood express

15ల‌క్ష‌ల రూపాయ‌ల‌తో త‌యారుచేశారు..

ఈ రెస్టారెంట్ నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల‌ను రైల్వేశాఖ‌వారు ఓ ప్ర‌యివేట్ సంస్థ‌కు అప్ప‌గించారు. 15 లక్షల రూపాయలు వెచ్చించి తయారు చేసిన ఈ రెస్టారెంట్ కు ఏడాదికి 72 లక్షలు లైసెన్స్‌ను ఫీజుగా నిర్ణ‌యించారు. రైల్వే శాఖ సహాయ మంత్రి దర్శన విక్రమ్‌ జర్దోష్‌ చేతులు మీదుగా ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఆహ్ల‌ద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంలో ఆధునాత‌న టెక్నాల‌జీతో ఆవిష్క‌రించిన ఈ రెస్టారెంట్ ఎంతో మంది ప‌ర్యాట‌కుల‌ను, భోజ‌న ప్రియుల‌ను ఆక‌ట్టుకుంటుంది. ఈ రెస్టారెంట్‌లో యమ్మీ అండ్ టేస్టీ ఫుడ్ రుచి చూస్తు ఎంజాయ్ చేస్తున్నారు చాలామంది భోజ‌న ప్రియులు. అన్ని ర‌కాల సౌక‌ర్యాలతో ఎన్నో వెరైటీల ఫుడ్‌తో కోచ్ రెస్టారెంట్ రారా రమ్మంటూ విశాఖ‌వాసుల‌కు సాద‌ర ఆహ్వానం ప‌లుకుతోంది.

అన్‌స‌ర్వీస్‌బుల్ కోచ్‌..

విశాఖప‌ట్నంలోని స్టార్ హోటల్స్ లో లభించే సీ ఫుడ్ ఆహారాన్నిఈ కోచ్ రెస్టారెంట్ ప‌ర్యాట‌కుల‌కు అందిస్తోంది. విశాఖ రైల్వే స్టేషన్‌కు వెళ్లారంటే చాలు రుచిక‌ర‌మైన సీ ఫుడ్‌, వైరైటీ వంట‌కాల‌ను అందించే రెస్టారెంట్ మీకు క‌నిపిస్తుంది. ఈ రెస్టారెంట్‌లో అర‌కు బొంగు చికెన్ నుంచి స్ట‌ఫ్‌డ్ క్రాబ్ వ‌ర‌కు అన్ని ర‌కాల సీ ఫుడ్స్‌, అన్నిర‌కాల వంట‌కాలు అందుబాటులో ఉంటాయి.

ఈ రైల్వే కోచ్‌ రెస్టారెంట్‌ను అన్‌సర్వీస్‌బుల్‌ కోచ్‌ని ఉపయోగించి.. అధునాతన సౌక‌ర్యాల‌తో అన్ని హంగులతో తీర్చిదిద్దారు. దాదాపు ముప్ప‌యిల‌క్షల ఖ‌ర్చు కేవ‌లం దీని ఇంటీరియర్‌కే అయ్యింద‌ని య‌జ‌మాని వంశీ చెప్పుకొచ్చారు. కోచ్‌ను రెస్టారెంట్‌ అవసరాలకు అనుగుణంగా రీడిజైన్‌ చేయడంతో రైల్వే అధికారులు లైసెన్స్‌ మంజూరు చేసిన‌ట్లు య‌జ‌మాని వంశీ తెలిపారు. ప్ర‌యాణికుల కోసం వినూత్న కాన్సెప్ట్‌ ద్వారా అందమైన ఇంటీరియర్స్‌తో పూర్తి ఎయిర్‌ కండిషన్డ్‌ మోడిఫైడ్‌ రైల్‌ కోచ్‌లో ప్రీమియం డైనింగ్‌ అనుభావాన్నిఈ రెస్టారెంట్ అందిస్తుంద‌న్నారు.

More News

Read more about: visakhapatnam andhrapradesh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+