Search
  • Follow NativePlanet
Share
» »ఆధునిక హంగులు క‌లిగిన విశాఖ‌ప‌ట్నం రుషికొండ భ‌వ‌నాలు..

ఆధునిక హంగులు క‌లిగిన విశాఖ‌ప‌ట్నం రుషికొండ భ‌వ‌నాలు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌సిద్ధిచెందిన ప‌ర్యాట‌క ప్ర‌దేశాలు ఎన్నో దాగి ఉన్నాయి. అందులో ఒక‌టి విశాఖపట్నం. ఈ ప్రాంతాన్ని వైజాగ్ అని పిలుచుకుంటారు. ఈ మహా నగరం ఏపీలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో ఒక‌టిగా మారింది. ఈ ప్రాంతానికి అందమైన సముద్ర తీరం ఎంతో ప్రత్యేకమ‌నే చెప్పాలి. ఎందుకంటే వైజాగ్‌లో బీచ్‌లు ఎంతో ఫేమ‌స్‌. సముద్రం ఒడ్డున ఉన్న నగరం కావడంతో పాటు ఇక్క‌డ అనేక ప్రత్యేకతలు, చరిత్ర ఉండటంతో ఏడాదంతా వైజాగ్‌కి పర్యాటకులు క్యూ కడుతూనే ఉంటారు.

ఈ ప్ర‌దేశం దేశ ర‌క్ష‌ణ‌లో ఎంతో ప్ర‌త్యేక స్థానం క‌లిగి ఉంది. ఎందుకంటే.ఇండియన్ నేవీకి చెందిన తూర్పు నౌకాదళం కార్యకలాపాలు కూడా విశాఖ కేంద్రంగానే ఉన్నాయి. ఇక్క‌డ నేవీ కార్యకలాపాలతో పాటు ప్రధాని, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, రక్షణ శాఖ మంత్రితో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, గవర్నర్లు.. ఇలా ప్రముఖులంతా విశాఖ‌కు వ‌స్తూనే ఉంటారు. అంత‌టి ప్రాధాన్య‌త సంత‌రించుకుంది విశాఖ‌.

bhimiliroad1

వైజాగ్ సముద్ర తీరానికి అభిముఖంగా భీమిలీ మార్గంలో రుషికొండపై గతంలో పర్యాటక భవనాలు ఉండేవి. ప్ర‌స్తుతం వాటి స్థానంలో కొత్త భవనాలు వ‌చ్చాయి. వాటిని గ‌త ప్ర‌భుత్వం నిర్మించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం రుషికొండ‌పై ఉన్న సౌధాలను పర్యాటక అవసరాలకు వినియోగించాలని ప్ర‌స్తుత ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. భార‌త్‌లో ప్రస్తుతం డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ల ట్రెండ్ న‌డుస్తోంది.

ఈ వెడ్డింగ్‌ల‌ నిర్వహిస్తోన్న ప్యాలెస్‌లకు ఏ మాత్రం తీసిపోని విధంగా వైజాగ్‌లోని రుషికొండ భవనాలు ఉన్నాయి.తెలంగాణ‌లోని నిజాం కాలం నాటి నిర్మాణాలు, జైపూర్‌‌లొో ఉన్న పర్యాటక కేంద్రాల తరహాలో డెస్టినేషన్‌ వేడుకలకు అనువైన పర్యాటక కేంద్రంగా రుషికొండను నిర్వహించాలనే ప్రతిపాదనల్ని కూడా ప్ర‌భుత్వం పరిశీలిస్తున్న‌ట్లు స‌మాచారం. ప్రస్తుతం ఉన్న భవనాల్లో కొద్ది మార్పులు చేసి మరికొన్ని అద‌న‌పు గదులను అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇక‌, రుషికొండలో ఉన్న మొత్తం భవనాల్లో ఒకటి రెండు భవనాలను భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించుకోవాలనే ప్రతిపాదనలు కూడా లేక‌పోలేదు.

rushikondabuildings

ఇక్కడి అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌లు..

ప్ర‌స్తుతం ప్యాలెస్‌ను త‌ల‌పించే ఈ రుషికొండ‌లో పెద్ద ప్రవేశ ద్వారాలు, విశాలమైన పడకగదులు, అంతకు మించిన లగ్జరీగా స్నానాల గదులు, లక్షలు విలువ‌చేసే మంచాలు, పరుపులు, బాత్‌ టబ్‌లు, షాండ్లియర్లు ఒక్క‌టేమిటి చాలానే ఉన్నాయి. రుషికొండ‌లో లక్షా 41వేలకు పైగా చదరపు అడుగుల్లో అత్యంత విలాసవంతమైన భవనాలను నిర్మించారు. ఇందులో అత్యంత ఖరీదైన మార్బుల్స్, గ్లాస్‌ ఫర్నీచర్‌తో మిరుమిట్లు గొలిపే భవనాలు క‌ల‌వు. సుమారు రూ.500 కోట్లతో 7 విలాసవంతమైన భవనాలను నిర్మించారు.

vizagbeaches

ఈ ఏడింటిలో మూడు ప్రత్యేక నివాస భవనాలు, 12 బెడ్‌రూములు క‌ల‌వు. ఇందులోని ప్రతి బెడ్‌ రూమ్‌లో లక్ష‌లు విలువ‌చేసే బాత్‌రూమ్‌ల‌ను నిర్మించారు. ఈ బాతూరూమ్‌ల వైశాల్యం సుమారు 480 చదరపు అడుగులు ఉంటుంది. భ‌వ‌నంలోప‌ల ఒక‌లా ఉంటే బ‌య‌టి ఏర్పాట్లను కూడా త‌ప్ప‌కు చూడాల్సిందే.సువిశాలమైన లాన్లు, పార్కులు భవనాల వెలుపల నిర్మించారు. గార్డెన్‌లో అంద‌మైన‌, ఖరీదైన మొక్కలను తీర్చిదిద్దారు.

More News

    Read more about: visakhapatnam andhrapradesh
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+