Search
  • Follow NativePlanet
Share
» »గుడ్ ఫ్రైడే లాంగ్ వీకెండ్ కోసం సిసు సంద‌ర్శించండి

గుడ్ ఫ్రైడే లాంగ్ వీకెండ్ కోసం సిసు సంద‌ర్శించండి

గుడ్ ఫ్రైడే లాంగ్ వీకెండ్ కోసం సిసు సంద‌ర్శించండి

లాంగ్ వీకెండ్ డెస్టినేషన్ సిసు.. హిమాచల్ ప్రదేశ్‌లోని చాలా అందమైన గ్రామం. ఇది రెండు మూడు రోజులు సర‌దాగా గ‌డిపేందుకు సరైన గమ్యస్థానంగా ప్ర‌సిద్ధి చెందింది. కాబట్టి మీరు ఈ నెల‌లో వచ్చే లాంగ్ వీకెండ్ కోసం ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. సిసు, ప్రకృతి అందాలతో నిండిన చిన్న గ్రామం. చుట్టూ విస్తరించి ఉన్న పచ్చని అడవులు మరియు మంచుతో కప్పబడిన పర్వతాలు ఈ ప్రదేశానికి మ‌రింత అందాన్ని ఇనుమడింప జేస్తున్నాయి. కాంక్రీట్ న‌గ‌రాల‌ కలుషిత వాతావరణం నుంచి బయటపడి కొద్దిరోజుల పాటు స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలంటే ఇక్కడే ప్లాన్ చేసుకోండి.

హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లోని సిసు గ్రామం అందాల‌ను చూసేందుకు రెండు నుండి మూడు రోజులు సరిపోతాయి. ఈ నెలలో గుడ్ ఫ్రైడే (ఏప్రిల్ 7, 2023న) అంటే శుక్రవారం మరియు 8వ తేదీ, 9వ తేదీ శనివారం-ఆదివారం కలిసి ఇది సుదీర్ఘ వారాంతం అవుతుంది. కాబట్టి ఇక్కడ సందర్శించడానికి ఇదే మంచి అవకాశం. మ‌రో మంచి వార్త ఏంటంటే, ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి మీరు పెద్దగా డబ్బు ఖర్చు చేయనవసరం లేదు. స్నేహితులతో లేదా కుటుంబ‌స‌మేంతంగా చిరస్మరణీయ జ్ఞాప‌కాల‌ను మూట‌గ‌ట్టుకునేందుకు ఇదే స‌రైన ఎంపిక‌.

sisufalls1

సిసు జలపాతం

సిసు జలపాతం లేహ్-మనాలి హైవేపై ఉంది. హిమాచల్‌లోని అత్యంత అందమైన మరియు ప్రసిద్ధ జలపాతాలలో ఇది ఒకటి. చుట్టూ విస్తరించి ఉన్న దట్టమైన అడవులు మరియు ఎత్తైన పర్వతాలు ఈ జలపాతాన్ని మ‌రింత సుందరంగా మారుస్తాయి.

sisulake1

సిసు సరస్సు

సిసు సరస్సు ఈ గ్రామానికి మరొక ఆకర్షణ. చుట్టూ పర్వతాలతో చుట్టుముట్టబడిన ఈ సరస్సు అందం కనుచూపు మేరలో ఎటుచూసినా విస్త‌రించిన‌ట్లు కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి ప్రదేశం మాన‌సిక ప్రశాంత‌త‌ను చేరువ చేసేలా ఎంతో ఆహ్లాద‌క‌రంగా ఉంటుంది. ఫోటోగ్రఫీ కోసం ఇక్కడ చాలా ప్ర‌దేశాలు ఉన్నాయి.

gefangtemple1

గెఫాంగ్‌ ఆలయం

ఈ ఆలయం గెఫాంగ్ శిఖరంపై ఉంది. ఇది గెఫాంగ్ దేవతకు అంకితం చేయబడింది. స్థానిక ప్రజల న‌మ్మ‌కం ప్రకారం, లాహౌల్ లోయలో నివసించే ప్రజలకు గెఫాంగ్ దేవత రక్షకుడు.

సిసు గ్రామానికి ఎలా చేరుకోవాలి?

రోడ్డు మార్గంలో- సిసు లేహ్-మనాలి హైవేపై ఉంది. కాబట్టి ఇక్కడకు చేరుకోవడానికి మీరు ముందుగా మనాలి చేరుకోవాలి. మనాలి బస్ స్టాండ్ నుండి కీలాంగ్ కు బస్సులో వెళ్ళండి. ఈ మార్గం అటల్ టన్నెల్ గుండా వెళుతుంది. అందమైన సిసు గ్రామం అటల్ టన్నెల్ నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. విమాన మార్గంలో అయితే, సిసు గ్రామానికి చేరుకోవడానికి సమీప విమానాశ్రయం భుంతర్. ఇక్కడి నుండి ఈ గ్రామం దాదాపు 90 కి.మీ దూరంలో ఉంది. విమానాశ్రయం నుండి కీలాంగ్ లేదా లేహ్‌కు బస్సులో వెళ్లండి.

దీని నుండి మీరు సులభంగా సిసు గ్రామానికి చేరుకోవచ్చు. చండీగఢ్ సిసు గ్రామానికి చేరుకోవడానికి సమీప రైల్వే స్టేషన్. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, జైపూర్ మరియు లూథియానా వంటి ప్రాంతాల నుండి రైళ్లు సులభంగా అందుబాటులో ఉంటాయి. చండీగఢ్ నుండి మనాలికి బస్సులు నడుస్తాయి మరియు ఇక్కడ నుండి కీలాంగ్‌కు బస్సులో సిసు గ్రామానికి చేరుకోవచ్చు.

More News

    Read more about: sisu village himachal pradesh
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+