Search
  • Follow NativePlanet
Share
» »దేవి న‌వరాత్రుల సంద‌ర్భంగా దేశంలోని ఈ న‌గ‌రాల‌ను సంద‌ర్శించేయండి...

దేవి న‌వరాత్రుల సంద‌ర్భంగా దేశంలోని ఈ న‌గ‌రాల‌ను సంద‌ర్శించేయండి...

దేవి న‌వరాత్రుల సంద‌ర్భంగా దేశంలోని ఈ న‌గ‌రాల‌ను సంద‌ర్శించేయండి...

ఇది అక్టోబ‌ర్ నెల‌.. ఇక ద‌సరా వ‌చ్చేస్తుంది. ఇక దేశంలో సంబరాలు అంబరాన్ని అంటుతాయి. ఈ ద‌స‌రా పండుగ‌ను దేశ‌వ్యాప్తంగా జరుపుకుంటారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తరహాలో కనీవినీ ఎరుగని విధంగా ఈ దసరా వేడుకలు జరుగుతాయి. ఇక్క‌డ నవరాత్రుల పేరుతో నిర్వహించే ప్రతి వేడుకకు ఓ ప్రత్యేకత క‌లిగి ఉంటుంది. దేవి న‌వరాత్రులు సంద‌ర్భంగా ఈ ఏడాది దసరాను వినూత్నంగా జరుపుకోవాలంటే మాత్రం తప్పకుండా దేశంలోని ఈ న‌గ‌రాల‌ను సందర్శించేయండి..

జ‌గ‌ద‌ల్‌పూర్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌

దసరా అంటే న‌వ‌రాత్రులు అంద‌రికీ గుర్తుకొస్తాయి. న‌వ‌రాత్రులు అంటే తొమ్మిది రోజులు ఈ పండుగ‌ను నిర్వ‌హిస్తారు. అయితే, ఛ‌త్తీస్‌గఢ్‌లోని ఆదివాసీలు మాత్రం ఈ ద‌స‌రా పండుగ‌ను 75 రోజుల పాటు ఎంతో ఘ‌నంగా నిర్వ‌హిస్తారు. ప్ర‌త్యేకంగా జ‌గ‌ద‌ల్‌పూర్‌లోని బ‌స్త‌ర్ గిరిజ‌నులు ద‌స‌రా పండుగ‌ను ప్ర‌కృతి ఆరాధ‌న‌గా కొలుస్తారు. ఇక్క‌డ కొలువైన ఉన్న‌దంతేశ్వరి దేవి ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ గిరిజనుల‌ దేవత. అందుకే ఈ దేవీమాత‌ను ప్ర‌జ‌లు ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో కొలుస్తారు. ఈ ద‌స‌రా వేడుకల్లో భాగంగా ఇక్క‌డివారు చెట్లను ఆరాధిస్తారు. ఈ 75 రోజుల్లో పాత జాతర, కచనగాడి, నిషా జాతర వంటి అనేక ఆచారాలను నిర్వహిస్తారు. రథం ఊరేగింపులు, బస్తర్‌లోని వివిధ దేవతల జగదల్‌పూర్ సందర్శన, గిరిజన పెద్దల సమావేశం, కృతజ్ఞతా వేడుకలు వంటివి నిర్వ‌హిస్తారు.

durgapooja , Dussehra festival

కోల్‌కతా, దుర్గాపూజ

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌క‌త్తాలో ద‌స‌ర ఉత్స‌వాలు దేశంలోని అత్యంత ప్రాచుర్యాన్ని పొందాయి. బెంగాల్ ప్రజలు ఈ పండుగను దుర్గా పూజ లేదా పుజొ పేరుతో జరుపుకుంటారు. దసరా సందర్భంగా కోల్‌కతా నగరమంతా పెద్ద పెద్ద మండ‌పాళ్ల‌ను త‌యారు చేస్తారు. ఈ మండ‌పాలను బెంగాల్ వాసులు పెండాళ్లు అంటారు. ప్రతి ఒక్క మండపానికి ఒక ప్రత్యేక థీమ్ ఉంటుంది. బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో లక్షలరూపాయ‌లు వెచ్చించి మరీ మండపాలను నిర్మిస్తారు. అంతేకాదు, ఇక్క‌డ 'బొనెది బరీ' పేరుతో కోల్‌కతాలో ఉండే రాజభవనాల్లో అమ్మవారి విగ్రహాలు ఏర్పాటుచేసి ప్రత్యేక పూజలు చేయ‌డం ఆన‌వాయితీ. ఇక్కడ ఏర్పాటుచేసే అమ్మవారి విగ్రహాల్లో జీవకళ ఉట్టిపడుతుంది. ఈ ద‌స‌రా నాడు త‌ప్ప‌కుండా కోల్‌క‌త్తాను సంద‌ర్శించండి.

అహ్మ‌దాబాద్‌, వ‌డోద‌ర‌-గుజ‌రాత్‌

ఇక‌, దేశంలోని న‌వ‌రాత్రులు జ‌రుపుకునే ప్ర‌సిద్ధి చెందిన మ‌రో ప్ర‌దేశం గుజ‌రాత్‌. గుజరాత్‌లో నవరాత్రి వేడుకలను అత్యంత వైభ‌వంగా నిర్వహిస్తారు. ఇక్క‌డి హాలెరి రాజుల ఆధిపత్య చరిత్రలో దసరా పండుగకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ పండుగను మరియమ్మ పండుగ అని కూడా పిలుస్తారు. ఇక్కడ దసరా రోజున ప్ర‌ద‌ర్శించే గర్బా నృత్యం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా అహ్మదాబాద్‌, వడోదరలో జరిగే వేడుకల్లో ప్రదర్శించే గర్బా నృత్యాలు ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటాయి. డోలు బాజాలు వాయిస్తూ రంగు రంగుల దుస్తుల్లో కళాకారులు ప్రదర్శించే నృత్యాలు క‌నుల‌విందుగా ఉంటాయి. అమ్మవారికి నిర్వహించే 'గుజరాతీ హారతి' నృత్యం తప్పకుండా చూడాల్సిందే.

maadurga , Dussehra festival is special, దేశంలో ద‌స‌రా సంబ‌రాలు

కోట‌, రాజస్థాన్

దేశంలోని ద‌స‌రాల‌కు ప్ర‌సిద్ధి చెందిన మ‌రో ప్ర‌దేశం రాజస్థాన్‌లోని కోట నగరం. ఇక్క‌డి దసరా వేడుకలు అత్యంత ప్రసిద్ధి పొందాయి. కోటలో, ప్రతి ఏటా ఇర‌వైఐదు రోజుల పాటు దసరా ఉత్స‌వాలు జరుపుకొంటారు. ఈ ప్రధాన సాంస్కృతిక కార్యక్రమానికి నిత్యం భారీగా సందర్శకులు త‌ర‌లివ‌స్తుంటారు. నగరంలోని దసరా 'మేళా' మైదానంలో ఒక జాత‌ర‌ను నిర్వ‌హిస్తారు. జాతర సందర్భంగా ల‌క్ష‌లాది మంది సందర్శకులు, భ‌క్తులు ఇక్క‌డికి వస్తారు. పండుగ ముగింపు స‌మ‌యంలో ఇక్క‌డివారు సంప్రదాయ దుస్తులు ధరించి రావణ‌ విగ్రహాలను దహనం చేస్తారు. చంబల్ నది ఒడ్డున జ‌రిగే ఈ జాతర ఎంతో ఘ‌నంగా జరుగుతుంది.

durga pooja , ద‌స‌రా ఉత్స‌వాలు ఎప్ప‌టి నుంచి ప్రారంభం

కులు

ఈ అక్టోబర్‌లో కులు మనాలి పర్యటనకు వెళ్లేవారు తప్పకుండా దసరా వేడుకలకు హాజ‌ర‌య్యేలా ప్ర‌ణాళిక‌లు చేసుకోండి. దసరా సందర్భంగా కులులోని ధలపూర్ మైదానంలో రఘునాథ రథయాత్ర ఎంతో ఘ‌నంగా నిర్వహిస్తారు. కులు సమీపంలోని వివిధ గ్రామాల నుంచి 200 పైగా విగ్రహాలను ఈ సంద‌ర్భంగా ఊరేగించ‌డం ఆన‌వాయితీ. ఈ ఊరేగింపులకు శతాబ్దాల చరిత్ర ఉంది. దేశంలో దసరా వేడుకలు ముగిసిన తర్వాత విజయదశమి నుంచి కులు దసరా వేడుకలు ప్రారంభమవుతాయి. ఇక్కడ రావణ విగ్రహానికి బదులు ఆకులు, గడ్డి కాల్

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+