Search
  • Follow NativePlanet
Share
» »హోలీ సంద‌ర్భంగా దేశంలోని ఈ ప్ర‌దేశాలను చుట్టేయండి..!

హోలీ సంద‌ర్భంగా దేశంలోని ఈ ప్ర‌దేశాలను చుట్టేయండి..!

హోలీ పండుగను దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా నిర్వ‌హించుకుంటారు. హిందూ మతంలో ఈ పండుగ ఎంతో ముఖ్యమైనదిగా. ఈ పండుగ‌ను అన్నిర‌కాల రంగులతో జరుపుకుంటారు. కాబట్టి దీనిని రంగుల పండుగ అని పిలుస్తంటారు. ఫాల్గుణ మాసం ప్రారంభమంలో ఈ పండుగ వ‌స్తుంది. హోలీ, రంగుల పండుగ, హిందూ మతం యొక్క అతిపెద్ద, ముఖ్యమైన పండుగలలో ఇది ఒకటిగా చెప్పుకోవ‌చ్చు. ప్రతి ఏటా ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున హోలీ పండుగను నిర్వ‌హించుకోవ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది.

ఇక ఈ సంవ‌త్సరం మార్చి 25న ఈ రంగుల పండుగ జరుపుకోనున్నారు. దేశమంతటా ఈ పండుగ వైభవం కనిపిస్తున్నప్పటికీ, భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో మాత్రం ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. దేశ‌వ్యాప్తంగా హోలీ పండుగ‌కు ప్రసిద్ధిచెందిన ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

holi vrinndhavan

బృందావనం

బృందావ‌నం హోలీ పండుగ‌కి ప్ర‌సిద్ధిచెందింది. ఈ ప్రాంతం శ్రీ కృష్ణుడు పెరిగిన‌ది అని చెబుతుంటారు. ఈ ప్ర‌దేశం మథుర నుండి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దేశంలో అద్భుతమైన హోలీ వేడుకలకు నిద‌ర్శ‌నంగా నిలిచే ప్రదేశాల్లో ఇది ఒకటి అని చెప్పుకోవ‌చ్చు. అందుకే చాలామంది ప‌ర్యాట‌కులు హోలీ సంద‌ర్భంగా ఈ ప్ర‌దేశాన్ని సంద‌ర్శిస్తుంటారు. ప్ర‌తి సంవ‌త్స‌రం ఇక్క‌డి హోలీ వేడుకల్లో భాగ‌స్వాముల‌య్యేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తుంటారు. ఇక‌, ఈ హోలీ వేడుకలను బృందావనంలోని బండే బిహారీ ఆలయంలో ప్ర‌త్యేకంగా నిర్వహిస్తారు. ఈ హోలీ వేడుకల్లో పాల్గొనే వారిపై పూజారులు పువ్వులు, రంగులు విసర‌డం ఇక్క‌డి ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఈ నగరం "హోలీ ఆఫ్ ఫ్లవర్స్‌కి కూడా ఎంత‌గానో పేరుగాంచింది.

holimathura1

మథుర

శ్రీ కృష్ణ జన్మస్థలమైన మథుర కూడా హోలీ పండుగకు ఎంత‌గానో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ద్వారకాధీష్ ఆలయంలో శ్రీకృష్ణుడు మరియు రాధ వేషధారణలో ఉన్న పిల్లలు గులాల్‌తో జరుపుకుంటారు. హోలీని జరుపుకోవడానికి భారతదేశంలోని అత్యుత్తమ ప్రదేశాలలో మ‌థుర ఒక‌టిగా చెప్పొచ్చు. ఇక్కడ ప్రజలు హోలీని ప్ర‌త్యేకంగా 16 రోజులపాటు జరుపుకుంటారు. ఈ స‌మ‌యంలో ఇక్క‌డ సంప్రదాయ పద్ధతులలో ఆచారవ్యవహారాలతో తమ ఇష్టదైవమైన శ్రీ కృషుడికి ప్రత్యేకమైన పూజలు నిర్వ‌హిస్తారు.

ఉదయపూర్

రాజస్థాన్ లోని ప్ర‌సిద్ధిచెందిన పర్యాటక ప్రదేశాలలో ఉద‌య్‌పూర్ ఒకటి. ఈ ప్రాంతం హోలీ పండుగ‌కి కూడా ప్ర‌సిద్ధిచెందింది. ఇక్క‌డ హోలీ వేడుకలు రాజరికం, సాంప్రదాయాలకు నిలువుట‌ద్దాలుగా ఉంటాయి. ఈ హోలీ వేడుక‌లు మేవార్ మహారాజాచే నిర్వహించబ‌డిన‌వి. ఇక్క‌డ హోలీ ఉత్స‌వాలు సిటీ ప్యాలెస్‌లో జ‌రుగుతాయి. మహారాజు సాంప్రదాయ రాజ వస్త్రాలు ధరించి ఊరేగింపుగా ఇక్కడికి వచ్చి భోగి మంటలను వెలిగించ‌డం ఆన‌వాయితీ. దీనిని హోలీ కా దహన్ అని అంటారు. భోగి మంటలు చెడుపై మంచి విజయాన్నిసూచిక‌గా భావిస్తారు. అనంతరం నృత్యాలు, పాటలతో ఆ ప్రాంతంమంతా సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది.

holibarsana1

బర్సాన

బ‌ర్సాన హోలీ వేడుక‌ల‌కు ఎంతో ప్ర‌సిద్ధిచెందింది. ఈ ప్ర‌దేశం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో నెల‌కొని ఉంది. ఈ ప్రాంతాన్నిరాధా రాణి న‌గ‌రంగా కూడా అభివ‌ర్ణిస్తుంటారు.ఇక‌, ఇక్కడి హోలీ ని లాల్ మార్ హోలీ అని పిలుస్తారు. స్థానికంగా 'మార్' అంటే కొట్టు అని. హోలీ రోజున స్త్రీలు కర్రలతో పురుషులను కొట్ట‌డం ఇక్క‌డి ఆన‌వాయితీగా వ‌స్తోంది. హోలీ నాడు ఇక్క‌డ రాధా కృష్ణా ఆలయంలో సంప్రదాయ నృత్యాలు, భక్తి పాటలు ఆల‌పిస్తుంటారు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+