Search
  • Follow NativePlanet
Share
» »భారతదేశంలోని అతి చిన్న నగరమైన క‌పుర్తలాను సంద‌ర్శించారా?

భారతదేశంలోని అతి చిన్న నగరమైన క‌పుర్తలాను సంద‌ర్శించారా?

భారతదేశంలోని అతి చిన్న నగరమైన క‌పుర్తలాను సంద‌ర్శించారా?

భారతదేశాన్ని వైవిధ్యాల దేశం అని పిలుస్తారు. దాని అద్భుతమైన చారిత్రక విషయాలు, గొప్ప సంస్కృతి ఈ దేశాన్ని ఇతర దేశాల కంటే భిన్నంగా చేస్తున్నాయి. ముంబైని ఆర్థిక రాజధానిగా, కలల నగరంగా పిలుస్తుంటే, ఢిల్లీని హృదయాల రాజధానిగా పిలుస్తారు. కానీ భారతదేశంలో అతి చిన్న నగరం ఉంద‌ని మీకు తెలుసా? ఇక్కడ 2011 సంవత్సరం వరకు జనాభా 98,916. 10 సంవత్సరాల తర్వాత ఇక్కడ జనాభా గణన జరగాల్సి ఉంది. కానీ కోవిడ్ కారణంగా ఇక్కడ జనాభా జరగలేదు. దీనివల్ల 2011 సంవత్సరపు గణాంకాలు మాత్రమే కనిపిస్తాయి. ఈ నగరం విశేషాల గురించి చెప్పుకుందాం పదండి..

1

ప్యారిస్ ఆఫ్ పంజాబ్‌గా పేరు..

భారతదేశంలోని చాలా నగరాల గురించి విని ఉంటారు. కానీ ఎప్పుడైనా దేశంలోని అతి చిన్న నగరం గురించి విన్నారా. పంజాబ్‌లోని కపుర్తలా జనాభా ప్రాతిపదికన అతి చిన్ననగరంగా పరిగణించబడింది. కపుర్తలాను ప్యారిస్ ఆఫ్ పంజాబ్ అని కూడా అంటారు. కపుర్తలా దాని అందమైన భవనాలు, రహదారులకు ప్రసిద్ధి చెందింది. దేశంలోని అతి చిన్న న‌గ‌రంగా కూడా ప్ర‌సిద్ధి చెందింది. అయితే ఒకప్పుడు ఇక్కడ పరిశుభ్రత ఎంతగానో కనిపించేది. ఈ నగరాన్ని స్థాపించిన నవాబ్ కపూర్ పేరు మీదుగా ఈ ప్రదేశానికి పేరు పెట్టారు. అంతేకాదు, ఈ ప్రదేశం భారతీయ రైల్వేలకు కూడా ముఖ్యమైనది. ఎందుకంటే ఇండియన్ రైల్వేస్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) ఈ నగరంలోనే ఉంది. ఇక్కడ నుండి, దేశంలోని రైలు కోచ్‌ల సరఫరాను కూడా భారతీయ రైల్వే అందిస్తుంది.

2

జగత్‌జిత్ ప్యాలెస్

జగత్‌జిత్ ప్యాలెస్ ఒకప్పుడు కపుర్తలా రాష్ట్రానికి చెందిన మహారాజా జగత్‌జిత్ సింగ్ నివాసం. ఈ ఇండో-సార్సెనిక్ ఆర్కిటెక్చర్ భవనం ఇప్పుడు సైనిక్ స్కూల్ నుండి నేషనల్ డిఫెన్స్ అకాడమీ కోసం అబ్బాయిలకు శిక్షణ ఇస్తుంది. ఈ ప్యాలెస్ 1908 లో నిర్మించబడింది. దాని నిర్మాణ శైలి నేటికీ చూడదగినది. అందుకే పర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

3

షాలిమార్ గార్డెన్

నగరం నడిబొడ్డున ఉన్న షాలిమార్ గార్డెన్స్ ప‌ర్యాట‌కులు విశ్రాంతి తీసుకునేందుకు, కుటుంబంతో క‌ల‌సి స‌రాదాగా గ‌డిపేందుకు ఎంతో ఉత్త‌మ‌మైన ప్ర‌దేశం. ఈ ఉద్యానవనంలో కపుర్తలా రాజకుటుంబానికి చెందిన సమాధులు ఉన్నాయి. ఎర్ర ఇసుకరాయితో చేసిన గదులలో పాలరాతి స్మారక చిహ్నాలు ఉన్నాయి. ఇవి ఇక్క‌డికి వ‌చ్చేసంద‌ర్శకుల‌ను ఎంతో ఆక‌ర్షిస్తున్నాయి.

ఎలిసీ ప్యాలెస్

1962లో కన్వర్ బిక్రమ్ సింగ్ ఇండో-ఫ్రెంచ్ నిర్మాణ శైలిలో ఈ ప్యాలెస్‌ను నిర్మించారు. ఈ ప్యాలెస్ కపుర్తలాలోని ప్రధాన పర్యాటక ఆకర్షణలలో ఒకటి. కన్వర్ బిక్రమ్ సింగ్ 1835 నుండి 1887 వరకు కపుర్తలా రాచరిక రాష్ట్రాన్ని పాలించిన అత్యంత ప్రభావవంతమైన సిక్కు నాయకులలో ఒకరు. ప్యాలెస్ MGN స్కూల్‌గా మార్చబడింది. అయితే ఇది ఇప్పటికీ కపుర్తలాలో సందర్శించదగిన స్మారక చిహ్నం.

కపుర్తలా చేరుకోవడం ఎలా?

కపుర్తలా నగరం పంజాబ్‌లోని ప్రధాన నగరాలకు బస్సులు, రైళ్ల ద్వారా అనుసంధానించబడి ఉంది. కపుర్తలాకు సమీప విమానాశ్రయం అమృత్‌సర్‌లోని రాజా సాన్సి అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది నగరం నుండి సుమారు 82 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది. ఇక్క‌డికి సమీప రైల్వే స్టేషన్ జలంధర్ నుండి 22 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉంది. ఇక్క‌డి నుంచి ఢిల్లీకి కేవ‌లం ఆరుగంట‌ల్లో చేరుకోవ‌చ్చు.

More News

    Read more about: punjab kapurthala
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+