Search
  • Follow NativePlanet
Share
» »అతి త‌క్కువ ధ‌ర‌తో తిరుమ‌ల‌తోపాటు ఐదు పుణ్య‌క్షేత్రాల‌ను చూసేయొచ్చు..!

అతి త‌క్కువ ధ‌ర‌తో తిరుమ‌ల‌తోపాటు ఐదు పుణ్య‌క్షేత్రాల‌ను చూసేయొచ్చు..!

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన తిరుమల స్వామివారిని ద‌ర్శించుకోవాల‌ని నిత్యం భ‌క్తులు ఎదురుచూస్తుంటారు. అటువంటి వారికోసం ఐఆర్‌సిటిసి ఓ స‌రికొత్త టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఏపీలోని ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రమైన తిరుమ‌ల ఆల‌యంతో పాటు మ‌రో ఐదు ప్రముఖ పుణ్య క్షేత్రాలను దర్శించుకోవ‌చ్చు.

ఈ టూర్ ప్యాకేజీ రెండు రోజులు ఉంటుంది. రోడ్డు ప్ర‌యాణం చేయాల్సి ఉంటుంది. ఐఆర్సీటీసీ పంచ్ దేవాలయం పేరుతో ఈ టూర్ ప్యాకేజీనీ ప‌ర్యాట‌కుల‌కు అందిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా వెంక‌టేశ్వ‌ర‌స్వామి ద‌ర్శ‌నంతోపాటు కాణిపాకం, తిరుచానూరు, తిరుమల, తిరుపతి దేవాలయాలను కూడా సందర్శించొచ్చు.

srikalahasti1

రెండు రోజుల టూర్ షెడ్యూల్ ఇదే..

ఈ టూర్ లో భాగంగా మొద‌టి రోజు ఉద‌యం 7 నుంచి 8 గంటల్లోపు తిరుపతి రైల్వే స్టేషన్‌లో ఉండాలి. రైల్వే స్టేషన్ లో పర్యాటకులను పికప్ చేసుకుని, హోటల్‌కు తీసుకెళ్తారు. ఆ త‌ర్వాత హోటల్‌లో ఫ్రెష్ టిఫిన్ చేస్తారు. అక్క‌డినుండి శ్రీనివాస మంగాపురం, కాణిపాకం దేవాలయాల సందర్శనకు టూర్ ఉంటుంది. మార్గ మ‌ధ్య‌లోనే లంచ్ ఉంటుంది. అక్క‌డి నుంచి శ్రీ కాళహస్తి ఆలయ వీక్ష‌ణ‌కు బ‌య‌లుదేరుతారు. అనంత‌రం తిరిగి హోటల్‌కు చేరుకుంటారు. ఆ నైటంతా తిరుపతిలోనే స్టేయింగ్ ఉంటుంది. మ‌రుస‌టి రోజు ఉద‌యం టిఫిన్ చేసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రత్యేక ప్రవేశ దర్శనం వెళ్తారు. ఉదయం 9 గంటలకు తిరుమల కొండకు బయలుదేరతారు. శ్రీవారి దర్శనం త‌ర్వాత‌ తిరుచానూరు పద్మావతి ఆలయాన్ని వీక్షిస్తారు. అనంత‌రం తర్వాత తిరుపతి రైల్వే స్టేషన్‌లో డ్రాపింగ్ ఉంటుంది. దీంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తోంది.

panchtemple

టూర్‌కు వెళ్లేవారు పాటించాల్సిన నియ‌మాలు..

ఈ టూర్ ప్యాకేజీకి వ‌చ్చేవారు త‌ప్ప‌నిస‌రిగా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును త‌మ వెంట తీసుకుని రావాలి. ప్యాకేజీని బుక్ చేస్తున్నప్పుడు కూడా ఈ కార్డు అవ‌సరం ఎంతో ఉంటుంది. గుర్తింపు కార్డు లేకపోతే టీటీడీ దర్శనం పూర్తి కాదు. తిరుమలలో తప్పనిసరి డ్రెస్ కోడ్ ఫాలో అవ్వాల్సిందే. తిరుమ‌ల ఆల‌యానికి వ‌చ్చేవారు సంప్ర‌దాయా దుస్తుల‌నే ధ‌రించాలి. పురుషుల‌యితే ధోతీ (తెలుపు), చొక్కా లేదా కుర్తా పైజామా ధరించాలి. స్త్రీలు చీర లేదా సల్వార్ కమీజ్ (పల్లుతో తప్పనిసరి) ధరించాల్సి ఉంటుంది. టీ-షర్ట్, జీన్స్ వంటి దుస్తులను అస్స‌లు ధరించకూడదు. వయస్సుతో సంబంధం లేకుండా డ్రెస్ కోడ్ కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.

padmavatitemple1

ప్యాకేజీ ధ‌ర‌లివే.. టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ. 6590 ఉంటుంది. వాటి పూర్తి వివ‌రాలు చూద్దాం..

సింగిల్ షేరింగ్ రూ.8280 చెల్లించాల్సి ఉంటుంది. అదే డబుల్ షేరింగ్ అయితే రూ.6880 చెల్లించాలి. ట్రిపుల్ షేరింగ్‌కు రూ.6590గా నిర్ణ‌యించారు. చైల్డ్ విత్ బెడ్(5-11 సంవత్సరాలు) రూ.4570 ఉంటుంది. చైల్డ్ వితవుట్ బెడ్(5-11 సంవత్సరాలు)

రూ.4070 చెల్లించాలి. ఈ ప్యాకేజీలో భాగంగా తిరుపతిలో ఏసీ వసతి కల్పిస్తారు. అలాగే రోడ్డు మార్గంలో ప్రయాణం కోసం ఏసీ వాహనం కూడా అందుబాటులో ఉంటుంది. తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం, తిరుచానూరులో సాధారణ దర్శనం చేసే అవ‌కాశం క‌ల్పిస్తారు. ఐఆర్‌సిటిసి పంచ్ దేవాలయం టూర్ ప్యాకేజీ పూర్తి స‌మాచారం కోసం లేదా బుకింగ్ కోసం ఐఆర్‌టిసి అధికారిక వెబ్‌సైట్‌ను సంప్ర‌దించండి.

More News

    Read more about: tirupati tirumala sri kalahasti
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+