Search
  • Follow NativePlanet
Share
» »విజ‌య‌వాడ‌లోని ఈ స్ట్రీట్‌ఫుడ్స్‌ను ఆస్వాదించాల్సిందే..!

విజ‌య‌వాడ‌లోని ఈ స్ట్రీట్‌ఫుడ్స్‌ను ఆస్వాదించాల్సిందే..!

విజ‌య‌వాడ‌లోని ఈ స్ట్రీట్‌ఫుడ్స్‌ను ఆస్వాదించాల్సిందే..!

సంప్ర‌దాయ వంట‌కాల‌కు పెట్టింది పేరు ద‌క్షిణాది రాష్ర్టాలు. ఇప్ప‌డు స్ట్రీట్‌ఫుడ్స్‌కు కూడా ఈ రాష్ట్రాలు ఎంత‌గానో ప్ర‌సిద్ధి చెందాయి. ఇక‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విజయ‌వాడ పేరు చెప్ప‌గానే రుచిక‌ర‌మైన వంట‌కాలు మ‌న‌క‌ళ్ల ముందు మెద‌లాడుతూ ఉంటాయి. ఇక్క‌డ రుచికరమైన స్వీట్స్, కారంగా ఉండే స్నాక్స్, వీధుల వెంట కనిపించే దుకాణాలు ఇక్క‌డికి వ‌చ్చే సంద‌ర్శ‌కుల‌ను ఇట్టే ఆక‌ర్షిస్తుంటాయి. ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కూ ఈ దుకాణాదారులు వీటి అమ్మ‌కాల‌లో బిజిగా ఉంటారు.

చిరుతిళ్లను ఇష్టప‌డేవారు క‌చ్చితంగా విజయవాడలో విభిన్న రకాల రుచులను ఆస్వాదించవచ్చు. కేవ‌లం ఫాస్ట్‌ఫుడ్స్‌, స్ట్రీట్‌ఫుడ్స్ మాత్ర‌మే కాకుండా ఇక్క‌డ అనేక ర‌కాల సంప్రదాయ వంటకాలు కూడా ఉన్నాయి. కొన్ని పదార్ధాల రుచి విజయవాడలో తప్ప మరెక్కడా దొరకని విధంగా ఉంటుంది. వీటిలో కొన్నిప్రసిద్ధమైన‌ స్ట్రీట్ ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడైనా విజ‌య‌వాడ వెళితే త‌ప్ప‌కుండా వీటిని ఓ ప‌ట్టుప‌ట్టేయండి.

ర‌వ్వ దోశ‌

విజయవాడలో వివిధ రకాల దోశ‌లు, వివిధ రుచుల‌తో లభిస్తాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది రవ్వ దోస. బియ్యం పిండి, మైదా, సూజీ మిశ్రమంలో పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, జీలకర్ర వంటి పదార్ధాలను వేసి వీటిని తయారు చేస్తారు. కొబ్బరి, అల్లం, టమాటా చట్నీలతో ఈ దోశ‌ను తింటే ఆ కిక్కే వేరు. విజయవాడలో దాదాపు అన్ని టిఫెన్ స్టాల్స్ లో ఈ రవ్వదోశ‌ లభిస్తుంది. విజ‌య‌వాడ వెళితే క‌చ్చితంగా దీన్ని టేస్ట్ చేయ‌డం మాత్రం మ‌ర‌వ‌కండి.

1

​పులిహోర

ద‌క్షిణాది వంట‌కాల‌లో పులిహోర చాలా ప్రసిద్ధ వంటకం. ఇక‌, విజ‌య‌వాడ‌లో అయితే ఈ వంట‌కం ఎంత‌గానో ప్ర‌సిద్ధి చెందింది. ఎందుకంటే, ఇక్క‌డి కనకదుర్గ అమ్మవారి ఆల‌యంలో ఈ వంట‌కాన్ని ప్ర‌సాదంగా కూడా అందిస్తారు. అమ్మ‌వారి సన్నిధి నుంచి ప్రముఖ రెస్టారెంట్ల వరకూ ప్రతి చోటా పులిహోర ఇక్క‌డ అందుబాటులో ఉంటుంది. స్థానికులకు ఇక్క‌డికి వ‌చ్చే సంద‌ర్శ‌కుల‌కు ఇది ఎంతో ఇష్టమైన వంటకం. వేడి వేడి అన్నంలో చింతపండు పులుసును బాగా కలిపి మిర్చి, అల్లం, వేరుశనగ గింజలు, ఇంగువ వంటి పదార్ధాలను నూనెలో వేయించి ఇందులో కలుపుతారు. చివరిగా మరింత రుచి కోసం నిమ్మరసాన్ని జోడిస్తారు. దీన్ని రుచి చూసిన వారు మళ్లీ మళ్లీ తినాలని కోరుకుంటారు.

2

ఫిల్ట‌ర్ కాఫీ

ఉద‌యం లేవ‌గానే కాఫీనో, టీనో తాగడం చాలామందికి అలవాటు ఉంటుంది. ఆంధ్రా ప్రజలు కాఫీ రుచిని ఎంతో ఇష్టపడతారు. విజయవాడలోని స్థానిక ప్రజలు తాగే కాఫీ ఇతర ప్రాంతాల్లో కాఫీ కంటే భిన్నంగా ఉంటుంది. దీనినే ఫిల్టర్ కాఫీ అని పిలుస్తారు. రెగ్యులర్ కాఫీకు భిన్నంగా ఇది నురగతో ఉంటుంది. నగరంలోని మార్కెట్ లు, ప్రసిద్ధ జంక్షన్ ల వద్ద ఈ కాఫీను ఎక్కువగా కోనుగోలు చేస్తుంటారు. విజయవాడలో చాలా రెస్టారెంట్‌లు అద్భుతమైన ఫిల్టర్ కాఫీను అందిస్తుంటాయి. మార్కెట్‌లో ల‌భించే కాఫీపౌడ‌ర్‌ను కొనుగోలు చేసి ఇంటి వద్ద కూడా ఫిల్టర్ కాఫీను చేసుకోవ‌చ్చు.

3

పకోడి

భార‌త‌దేశంలో ప్రముఖ స్నాక్ గా ప్రసిద్ధి చెందిన పకోడి విజయవాడలో కూడా లభిస్తుంది. వీధిలోని స్టాల్స్ నుంచి పెద్ద పెద్ద రెస్టారెంట్ల వరకూ వివిధ రకాల పకోడి రుచులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. చికెన్ పకోడి, మొక్కజొన్న పకోడి, ఉల్లి పకోడి, బంగాళదుంప పకోడి, కాలీఫ్లవర్ పకోడి వంటి వివిధ ర‌కాల ప‌కోడిలు ఇక్కడ ముఖ్యంగా లభిస్తాయి. ఈవినింగ్ టీ తో పాటు సాయంత్రం స్నాక్ గా, లేదా భోజనంతో పాటు దీనిని ఎక్కువగా తీసుకుంటారు ఇక్క‌డి వారు.

More News

    Read more about: ravva dosha pulihora
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+