Search
  • Follow NativePlanet
Share
» »విశాఖ‌లోని ఈ ప్ర‌దేశాల్లో ప‌క్షుల అందాల‌ను చూడాల్సిందే..

విశాఖ‌లోని ఈ ప్ర‌దేశాల్లో ప‌క్షుల అందాల‌ను చూడాల్సిందే..

వైజాగ్ సహజ సౌందర్యం.. ఇక్క‌డి అద్భుతమైన తీర‌ప్రాంత‌పు ఆహ్లాదం ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేని అనుభూతిని అందిస్తాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. మ‌రీ ముఖ్యంగా ప‌క్షి ప్రేమికుల మ‌న‌సు దోచే కిల‌కిల‌రావాలు ఇక్కడి ప్ర‌తిచోటా ఆప్యాయంగా ప‌ల‌క‌రిస్తాయి. న‌గ‌ర‌పు వేకువ‌జాము దృశ్యాల‌ను మ‌న‌సులో ప‌దిల‌ప‌రుచుకునేందుకు విశాఖ న‌గ‌రం ఓ కేంద్రం. ఈ ప్రదేశాలను సందర్శించడం ద్వారా వైజాగ్‌లో కేరింత‌లు కొట్టే పక్షుల విన్యాసాల‌ను కనులారా వీక్షించే గొప్ప అవ‌కాశాన్ని అందిపుచ్చుకోవ‌చ్చు. మ‌రెందుకాల‌స్యం న‌గ‌రపు ప్ర‌కృతి అందాల నడుమ దాగిన ప‌క్షుల విహారాన్ని చూసేందుకు అనువైన ప్ర‌దేశాల‌ను అన్వేషిద్దాం రండి.

మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్

సుందరమైన ప్రకృతి దృశ్యాల మధ్య ఉన్న మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్ పక్షి ప్రేమికుల‌కు ఇది స్వర్గధామమ‌నే చెప్పాలి. సూర్యుడు ఆకాశాన్ని వెచ్చని రంగులతో చిత్రించినట్లు ద‌ర్శ‌న‌మిచ్చే ఆ సుంద‌ర దృశ్యాన్ని ఆస్వాదించేందుకు అనువైన స‌మ‌యం ఉద‌యం. రంగులు వెద‌జ‌ల్లే కింగ్‌ఫిషర్ ప‌క్షి ఈకల ఆక‌ర్ష‌ణ‌కు తోడు, ఎగ్రెట్స్ యొక్క సొగసైన స్ట్రైడ్‌లు సంద‌ర్శ‌కుల చూపుతిప్పుకోనికుండా చేస్తాయి.

కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యం

జీవవైవిధ్యానికి కేంద్ర‌మైన‌ కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యం విభిన్న రకాల పక్షుల ఆవాసంగా నిలుస్తుంది. ఆసియన్ కోయెల్స్ యొక్క శ్రావ్యమైన పిలుపుల నుండి భారతీయ పీఫౌల్స్ యొక్క గంభీరమైన ఉనికి వరకు, ఈ అభయారణ్యం ఔత్సాహిక మరియు అనుభవజ్ఞులైన పక్షి వీక్షకులకు ఎన్నో పాఠాల‌ను నేర్పుతుంది. ఈ అద్భుత క్షణాలను ప‌దిల ప‌రుచుకునేందుకు ఇక్క‌డ అడుగుపెట్టే ఔత్సాహికుల చేతుల్లో కెమెరాలు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి. ఎన్నో అరుదైన ప‌క్షుల మ‌నుగ‌డ‌కు ఈ అభ‌యార‌ణ్యం చిరునామా అనే చెప్పాలి.

andhrauniversity

ఆంధ్రా యూనివర్సిటీ

న‌గ‌రం న‌డిబొడ్డున ఉన్న‌ప్ప‌టికీ ఆంధ్ర‌యూనివ‌ర్సిటీ ప‌లు అరుదైన ప‌క్షుల‌కు నివాస కేంద్రంగా నిలిచింది. ఇక్క‌డి క్యాంప‌స్‌లో ఉద‌య‌పు వేళ అడుగులు వేస్తూ ముందుకు సాగితే చాలు. సన్‌బర్డ్స్ త‌మ శ్రావ్య‌మైన పిలుపుల‌తో మ‌నుసును ఆహ్లద‌ప‌రుస్తాయి. కేవ‌లం ఈ దృశ్యాల‌ను వీక్షించేందుకే క్యాంప‌స్ నందు ఉద‌య‌పు వేళ న‌డ‌క‌ను అల‌వాటుగా చేసుకున్న‌వారు ఎంతో మంది ఉన్నారంటే ఆశ్చ‌ర్యం క‌లుగ‌క మాన‌దు.

vizagzoo1

వైజాగ్ జూ

వైజాగ్ జూ అంటే కేవ‌లం విదేశీ జంతువుల విడిది కేంద్రంగా చాలామంది భావిస్తారు. వాస్త‌వంగా ఈ జూలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌. వివిధ ర‌కాల అరుదైన ప‌క్షుల‌కు ఆవాస‌మ‌ని చాలాందికి తెలీదు. పురివిప్ప నాట్యం చేసే నెమ‌ళ్ల ఆనంద‌క‌ర విన్యాసాలు విశాఖ జూ సొంతం. ఇంకా ఇక్క‌డ అంద‌మైన ప‌క్షుల కిల‌కిల‌రావాలు ప‌ర్యాట‌కుల‌కు స్వాగ‌తం ప‌లుకుతాయి. స్కార్లెట్ మకాస్ వంటి విభిన్న ర‌కాల రంగులు క‌లిగిన చిలుక‌లు ఈ జూలో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ అని చెప్పుకోవాలి.

kondakarlaava1

కొండకర్ల అవ

వైజాగ్‌లోని కొండ‌క‌ర్ల ఆవ వ‌ల‌స ప‌క్షుల‌కు స్వ‌ర్గ‌ధామ‌మ‌ని చెప్పుకోవాలి. ఇక్క‌డ ఎటుచూసిన చుట్టూ ప‌చ్చ‌ద‌న‌మే క‌నిపిస్తుంది. ఇక‌, ఇక్క‌డికి శీతాకాలంలో నార్తర్న్ పిన్‌టెయిల్స్, గడ్‌వాల్స్ వంటి బాతులు వ‌స్తుంటాయి. ప‌క్షి ప్రేమికుల‌కు ఈ ప్రాంతం ఎంతో అనువైన‌ది. ఉద‌యం మ‌రియు సాయంత్రం వేళ‌ల్లో ఈ ప్రాంత సంద‌ర్శ‌న ఎంతో హాయిగా ఉంటుంది. మ‌రెందుకాల‌స్యం వైజాగ్‌లోని ఈ ప్ర‌దేశాల‌ను సంద‌ర్శించేందుకు బ‌య‌లుదేరండి మ‌రి..

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+