Search
  • Follow NativePlanet
Share
» »వ‌ర్షాకాలంలో హార్సిలీ హిల్స్‌పై అడుగు పెట్టాల్సిందే!

వ‌ర్షాకాలంలో హార్సిలీ హిల్స్‌పై అడుగు పెట్టాల్సిందే!

ఆంధ్రప్రదేశ్‌లోని వ‌ర్షాకాల‌పు సంద‌ర్శ‌నీయ ప్ర‌దేశాల‌లో అందమైన హిల్ స్టేషన్ హార్సిలీ హిల్స్ పేరును చెర్చాల్సిందే. చిత్తూరు జిల్లాలో ఉన్న హార్సిలీ హిల్స్‌లో క‌నిపించే పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణం ప్ర‌శాంత‌మైన క్ష‌ణాల‌ను చేరువ చేస్తాయి. ఇక్క‌డ పీల్చే గాలి మొద‌లుకుని, వేసే అడుగు వ‌ర‌కూ ఒత్తిడిని చిత్తు చేసేలా ఉంటాయంటే న‌మ్మండి!

స‌హ‌జ‌సిద్ధ‌మైన కొండ కోన‌లు, వ్యూపాయింట్స్ ఇక్క‌డ అద‌ర‌పు ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయి. ఇక్కడి సూర్యోదయం, సూర్యాస్తమం పర్యాటకులకు మధురానుభూతిని చేరువ చేస్తాయి. వీటితోపాటు ట్రెక్కింగ్ ప్రియుల‌కు స్వ‌ర్గ‌ధామంగా చెప్పుకునే హార్సిలీ హిల్స్ విశేషాలు తెలుసుకుందాం రండి!

చిత్తూరు జిల్లాలోని మదనపల్లె పట్టణానికి హాల్సిలీ హిల్స్ స‌రిగ్గా 29 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఇక్కడ తన వేసవి నివాసాన్ని నిర్మించుకున్న బ్రిటీష్ కలెక్టర్ W.D. హార్సిలీ పేరు మీద ఈ ప్రాంతానికి ఆ పేరు వ‌చ్చింది. ఈ కొండలు సహజ సౌందర్యం మాట‌ల్లో చెప్ప‌డం అసాధ్యం. ప్రశాంత వాతావరణానికి చిరునామాగా చెప్పుకునే హార్సిలీ హిల్స్ వ‌ర్షాకాల‌పు స‌మ‌యంలో స‌రికొత్త అందాల‌ను అద్దుకుంటాయి. ఇక్కడి ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో 142 సంవత్సరాల వయసు కలిగిన యూకలిప్టస్ చెట్టు ఒకటి.

horsilihills1

ఇక్కడ జూపార్క్ కూడా ఉంది. ప్రముఖ రచయిత, తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి నెలకొల్పిన రిషివ్యాలీ విద్యాలయం సంద‌ర్శ‌కులు త‌ప్ప‌కుండా చూడాల్సిందే. ఫారెస్ట్ బంగ్లా ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇక్కడికి బెంగుళూర్, హైదరాబాద్, తిరుపతి లాంటి దక్షిణ ప్రధాన నగరాల నుంచి రోడ్డు సులభంగా చేరుకోవచ్చు. మదనపల్లె నుంచి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్‌ ట్యాక్సీల్లో కూడా వెళ్లొచ్చు. పర్యాటకుల కోసం కొండపైన అతిథి గృహాలు కూడా ఏర్పాటు చేశారు.

సంద‌ర్శ‌నీయ ప్ర‌దేశాలు..

గాలి బండలు (గాలి రాళ్ళు), హార్సిలీ జూ, క‌ళ్యాణి తీర్ణం వంటి సంద‌ర్శ‌నీయ ప్ర‌దేశాలు ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ర్షిస్తాయి. మార్గానికి రెండు వైపులా నీలగిరి (యూకలిప్టస్) వంటి అనేక జాతుల చెట్లతో ప్ర‌కృతి అందాల‌కు స‌రికొత్త అర్థాన్ని చెబుతాయి. ఈ ప్రదేశంలో జింకలు, చిరుతపులుల వంటి వన్యమృగాలు కూడా సంచరిస్తుంటాయి. హార్సిలీ జూలో వివిధ జాతుల పక్షులు, జంతువులు సంద‌డి చేస్తూ ద‌ర్శ‌న‌మిస్తాయి.

మధ్యాహ్నం స‌మ‌యం జూను సందర్శించేందుకు అనువైన స‌మ‌యంగా చెబుతారు. ఈ చుట్టుప‌క్క‌ల మైదానాల్లో అందమైన ప్రకృతి దృశ్యాలతో కూడిన తోట వివిధ రకాల వృక్షజాలం విశ్రాంతి కోరుకునేవారికి నిర్మలమైన వాతావరణాన్ని అందిస్తాయి.

horsilihills in monsoon

ట్రెక్కింగ్ ప్రియుల‌కు..

ట్రెక్కింగ్ మరియు హైకింగ్‌కు సంబంధించిన కార్యకలాపాలకు ఈ ప్రాంతం కేంద్రంగా చెప్పొచ్చు. ఈ కొండల గుండా వెళ్లి అనేక మార్గాలను అన్వేషించవ‌చ్చు. ఈ ప్ర‌యాణంలో అడుగడుగునా సుంద‌రమైన ప్ర‌కృతి దృశ్యాలు వీక్ష‌కుల‌కు క‌నువిందు చేస్తాయి. రాక్ క్లైంబింగ్, జిప్-లైనింగ్ వంటి సాహ‌న‌ కార్యకలాపాలలో పాల్గొనాల‌నుకునేవారు హార్సిలీ హిల్స్‌లో అడుగుపెట్టాల్సిందే.

ప్రశాంతమైన వాతావరణం, దట్టమైన పచ్చదనం, వర్షాల వల్ల వచ్చే స్వ‌చ్చ‌మైన‌ రిఫ్రెష్ వాతావరణం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో వర్షాకాలంలో సందర్శించాల్సిన ప్రదేశాలలో ఈ ప్రాంతం ఒక‌టిగా చేరింది. మ‌రెందుకు ఆల‌స్యం.. కుటుంబ‌స‌మేతంగా హార్సిలీ హిల్స్ అందాల‌ను చూసేందుకు మీ ప్ర‌యాణాన్ని మొదలు పెట్టండి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+