Search
  • Follow NativePlanet
Share
» »కుమ‌ర‌కోమ్‌తో పాటు ఈ ప్ర‌దేశాల‌ను సంద‌ర్శించాల్సిందే..

కుమ‌ర‌కోమ్‌తో పాటు ఈ ప్ర‌దేశాల‌ను సంద‌ర్శించాల్సిందే..

భార‌త‌దేశం వైవిధ్యమైన సంస్కృతికి, గొప్ప వారసత్వ సంపదకు నిలయం. ఇక్క‌డ పర్యాటకులను కట్టిపడేసే ఎన్నో ప్రకృతి అందాలు దాగి ఉన్నాయి. భారతదేశంలోని ప్రతి రాష్ట్రం దానికదే ప్రత్యేకమైనది. ఈ ప్ర‌దేశాల ప్రకృతిని ఆస్వాదించేందుకు చాలామంది ప్ర‌యాణికులు ఇష్ట‌ప‌డుతుంటారు. అడ్వంచెర్ ట్రిప్‌ల‌ను ఇష్ట‌ప‌డే వారు కొంద‌రైతే, ప్ర‌కృతి అందాల‌లో సేద‌తీరాల‌నుకునేవారు మ‌రికొంద‌రు. అలాంటివారికోసం కేర‌ళ‌లోని కుమ‌ర‌కోమ్ ఎప్పుడూ స్వాగ‌తం ప‌లుకుతూనే ఉంటుంది.

కుమ‌ర‌కోమ్‌తో పాటు భార‌త్‌లో సంద‌ర్శించేందుకు మ‌రెన్నో ప్ర‌కృతి సోయ‌గాలు దాగి ఉన్నాయి. సెలవులను ప్రశాంతంగా గడిపి, రిఫ్రెష్‌గా తిరిగొచ్చేందుకు ఈ ప్ర‌దేశాలు ఎంతో ఉత్త‌మం. కుమ‌ర్‌కోమ్‌తో పాటు భార‌త్‌లోని ఈ ప్రాంతాలు ప్ర‌కృతి ప్ర‌సాదించిన వ‌రాలు. స‌హ‌జ‌సిద్ధ ప్ర‌కృతి అందాలు ఇక్క‌డి సొంతం. మ‌రెందుకాల‌స్యం కుమ‌రోమ్‌తోపాటు ప్ర‌కృతి అందాలకు నిల‌యాలైన ఈ ప్ర‌దేశాల‌ను చూసేయండి..

kumarakom

కుమరకోమ్, కేరళ‌

కేరళలో ఎన్నో అంద‌మైన ప్ర‌దేశాలు ఉన్నాయి. ఇక్క‌డ అనేక సుందర ప్ర‌కృతి దృశ్యాలు, కొండచరియల నుండి పారే జలపాతాలు, పచ్చటి ప్రదేశాలు, సుందర పరిసరాలు పర్యాటకులను ఎంత‌గానో ఆహ్లాద‌ప‌రుస్తాయి. ఇక్క‌డికి విచ్చేసే ప్ర‌కృతి ప్రియులు ఇక్కడ కల వృక్ష, జంతు సంపదలను పొగ‌మంచుతో క‌ప్ప‌బ‌డిన ఇక్క‌డి కొండ‌ల అందాల‌ను ఆస్వాదించొచ్చు. కుమారకోమ్ గ్రామం వెంబనాడ్ సరస్సుపై ఉన్న చిన్న ద్వీపాల సమూహం. అంతేకాదు ఇది కుట్టనాడ్ ప్రాంతంలోని ఓ భాగం కూడా. ఇక్కడ 14 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న పక్షి అభయారణ్యం వలస పక్షులకు ఇష్టమైన ప్రదేశం.

ఎగ్రెట్స్, డార్టర్స్, హెరాన్‌లు, టీల్స్, వాటర్‌ఫౌల్స్, కోకిల, అడవి బాతు, సైబీరియన్ కొంగ వంటి వలస పక్షులు ఇక్క‌డ‌కు మందలు మంద‌లుగా త‌ర‌లి వ‌స్తాయి. కుమరకోమ్ సందర్శకులు విశ్రాంతి తీసుకునేందుకు అనేక గ‌మ్య‌స్థానాలున్నాయి. తాజ్ గార్డెన్ రిట్రీట్‌లో బోటింగ్ మరియు ఫిషింగ్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఇది విశాలమైన పాత బంగ్లాగా మారిన రిసార్ట్. అపారమైన అందం ఇక్క‌డి సొంతం. హౌస్‌బోట్‌లో కూర్చొని బ్యాక్‌వాటర్‌లో ప్రయాణించడం ఒక ప్రత్యేకమైన అనుభవమ‌నే చెప్పుకోవాలి. మసాజ్, స్థానిక ఆహారాలు, దట్టమైన అడవులను సందర్శించడం వంటివి ఇక్క‌డ చేయొచ్చు.

kinnur1

కిన్నౌర్, హిమాచల్ ప్రదేశ్

హిమాచల్, సిమ్లా, మనాలి సందర్శించవలసిన ప్రదేశాలలో మొదటి స్థానంలో ఉంటాయి. ఈ ప్రదేశాలు చాలా అందంగా ఉంటాయి, కానీ సంవత్సరంలో చాలా నెలల్లో ఇక్కడ పర్యాటకుల రద్దీ ఎక్కువ‌గా ఉంటుంది. అందుకే చాలామంది ఈ ప్ర‌దేశాన్నిసంద‌ర్శించ‌లేక‌పోతారు. కానీ, హిమ‌చ‌ల్‌లోనే ఎటువంటి ప‌ర్యాట‌కుల ర‌ద్దీ లేని ప్ర‌శాంత‌మైన ప్రాంతం ఒక‌టి ఉంది. అదే కిన్నౌర్‌. ఇది ప‌ట్ట‌ణ సంద‌డి, ర‌ద్దీకి దూరంగా ఉంటుంది. ప్ర‌కృతి సౌంద‌ర్యాల దృశ్యాలు ఈ ప్రాంతం సొంతం. చలికాలంలో ఇక్కడికి రావడం ద్వారా అత్యంత హిమపాతాన్ని కూడా చూడవచ్చు. హిందుస్థాన్ మరియు టిబెట్ ఎత్తైన పర్వతాల అందమైన దృశ్యాలు కూడా ఇక్కడ నుండి కనిపిస్తాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత, స‌మీపంలోని స్పితి వ్యాలీని కూడా సంద‌ర్శించొచ్చు. ఈ ప్ర‌దేశం మ‌రొక కొత్త అనుభూతినిస్తుంది.

pahalgam

పహల్గాం, కశ్మీర్

కశ్మీర్‌లోని పహల్గాం పర్యాటక ప్రదేశంగా పేరుగాంచింది. పహల్గాం ప్రసిద్ది చెందిన టూరిస్ట్ డెస్టినేషన్‌తో పాటు హిల్ స్టేషన్ కూడా. పహల్గాంలోని ప్ర‌కృతి అందాలు ప‌ర్యాట‌కుల‌ను ఎంతగానో ఆక‌ట్టుకుంటాయి. ప‌హ‌ల్గాం నుంచే అమర్‌నాథ్‌ యాత్ర మొద‌ల‌వుతుంది. శివుడు వినాయకుడి తలను ఖండించిన ప్రదేశం ఇదేనని ఇక్క‌డివారు చెబుతుంటారు. ఇక్క‌డ ఎత్తైన పైన్‌ వృక్షాలు, పరవళ్లు తొక్కుతున్న నదీ జలపాతాలు, ఆకుపచ్చని మైదానాలు, మంచుతో క‌ప్ప‌బ‌డిన హిమాలయాలు ప‌ర్యాట‌కుల‌ను స్వాగ‌తం ప‌లుకుతాయి. ఇండియాలో మినీ స్విట్జర్లాండ్‌గా ఈ ప్ర‌దేశం పేరొందింది. సంవత్సరంలో వేల మంది ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షిస్తుంది. పహల్గాం నుండి సుమారు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న చందన్వారి నుండి అమర్ నాథ్ యాత్ర ప్రారంభమ‌వుతుంది.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+