Search
  • Follow NativePlanet
Share
» »స‌మ్మ‌ర్‌లో ఆంధ్రాలోని ఈ ప్ర‌దేశాల‌ను చుట్టేయాల్సిందే..?!

స‌మ్మ‌ర్‌లో ఆంధ్రాలోని ఈ ప్ర‌దేశాల‌ను చుట్టేయాల్సిందే..?!

మార్చి మొద‌టి నుంచే ఏపీలో ఎండ‌లు దంచికొడుతున్నాయి. ఇక‌, ఏప్రిల్ మాసంలో ఉష్ణోగ్ర‌త‌లు అధికంగా పెరుగుతున్నాయి. మ‌రికొద్ది రోజుల్లో స‌మ్మ‌ర్ హాలీడేస్ రాబోతున్నాయి. విద్యార్థుల‌కు, ఉద్యోగుల‌కు ఇక పండగే. ఈ సెల‌వుల్లో చాలామంది కుటుంబంతో క‌లిసి కూలెస్ట్ ప్లేసెస్‌ను విహ‌రించాల‌నుకుంటారు. అయితే, చ‌ల్ల‌ని ప్రాంతాల‌కు వెళ్లాలంటే ఏ కాశ్మీరో, లేక షిమ్లానో వెళ్లాల్సిన ప‌నిలేదు. ఆంధ్రాలో కూడా కూల్ ప్లేస్‌లు చాలానే ఉన్నాయి. ఇప్ప‌డు వాటినే మ‌నం చూసేద్దాం..!

horsilihills

హార్సిలీ హిల్స్

ఈ వేస‌విలో ఏపీలో విహ‌రించాలనుకుంటే ప‌ర్యాట‌కుల‌కు ముందుగా గుర్తొచ్చే ప్ర‌దేశం హార్సిలీ హిల్స్‌. ఈ ప్లేస్ పిక్నిక్ స్పాట్‌కు బెస్ట్ అని చెప్పుకోవ‌చ్చు. ఈ ప్ర‌దేశం చిత్తూరులోని మ‌ద‌న‌ప‌ల్లిలో ఉంది. ఇది స‌ముద్ర‌మ‌ట్టానికి 4200 అడుగుల ఎత్తులో ఉంటుంది. క‌నుచూపుమేర ప‌చ్చ‌ని తివాచీ ప‌రిచిన‌ట్లు వుండే దృశ్యాలు చూప‌రుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటాయి. ఈ దారిలో ఇరువైపులా ద‌ట్ట‌మైన చెట్ల‌తో క‌ప్ప‌బడి ఉంటుంది. ఈ స్పాట్ తిరుప‌తి నుండి సుమారు 144 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్క‌డ సంద‌ర్శించేందుకు అనువైన ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి. ఇంకా ఇక్క‌డ అనేక రిసార్టులు, హోట‌ల్స్‌, ప్ర‌త్యేక గ‌దులు కూడా అందుబాటులో ఉన్నాయి. పిల్ల‌ల‌తో పాటు క‌లిసి ఈ ప్రాంతాన్ని చూడొచ్చు. చిన్నారుల కోసం ప్ర‌త్యేకంగా పార్కులు కూడా ఉన్నాయి. ఇందులో గ‌వ‌ర్న‌ర్ బంగ్లా, ఫారెస్ట్ బ‌మ్‌గ‌లో, మైక్రోవేవ్ స్టేష‌న్, వ్యూ పాయింట్, ఎనుగుమ‌ల్ల‌మ్మ దేవాలయం వంటి ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి.

chintapalle1

చింతపల్లె

వేస‌వి కాలంలో ఏపీలో అత్యంత ప్ర‌సిద్ధ ప‌ర్యాట‌క ఆక‌ర్ష‌ణ‌ల‌లో ఒక‌టిగా నిలిచిన ప్ర‌దేశం చింత‌ప‌ల్లె. ఇది సముద్ర మట్టానికి 839 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది రాష్ట్రంలోని విశాఖపట్నానికి స‌మీపంలో ఉంటుంది. ఈ ప్రాంత‌మంతా దట్టమైన సహజ అడవులతో నిండి ఉంటుంది. ఇంకా ఇక్క‌డ జలపాతాలు, ఆర్చిడ్ తోటలు చాలానే ఉన్నాయి. అడ్వంచ‌ర్ ట్రిప్ కోరుకునే వారికి ఈ ప్రదేశం ఎంతో అనువైన‌ది. ఇక్క‌డ హైకింగ్, రాత్రిపూట క్యాంపింగ్ వంటి సౌక‌ర్యాలు కూడా చేయొచ్చు.

అరకు

స‌మ్మ‌ర్‌లో సంద‌ర్శించేందుకు ఏపీలోని అత్యంత సుందరమైన, అద్భుతమైన పర్యాటక ప్రదేశాలలో అర‌కు ఒకటి. ఇక్క‌డికి కుటుంబంతో క‌లిసి సంతోషంగా హాలిడేను ఆస్వాదించేందుకు రావొచ్చు. ఇది విశాఖ‌ప‌ట్నం న‌గ‌రానికి సుమారు 114 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. ఇది ఒక హిల్‌స్టేష‌న్‌గా ప్ర‌సిద్ధిచెందింది. ఈ హిల్‌స్టేష‌న్ స‌ముద్ర మ‌ట్టానికి 900 మీట‌ర్ల ఎత్తులో ఉంటుంది. అర‌కులోయ కేవ‌లం ప‌ర్యాట‌క ప్ర‌దేశంగా ప్ర‌సిద్ధిచెంద‌డ‌మే కాదు, లోకేష‌న్ల ప‌రంగా సినిమా షూటింగ్‌ల‌కు కూడా పేరుగాంచింది. ఇక్క‌డ అనేక సినిమా షూటింగ్‌లు కూడా జ‌రిగాయి. ఇక‌, ఈమ‌ధ్య‌కాలంలో ఫొటోషూట్లు కూడా చేస్తున్నారు. ఇక్క‌డ అనేక‌ జ‌ల‌పాతాలు, గుహ‌లు, ఎత్త‌యిన వంతెన‌లు ప‌ర్యాట‌కుల‌కు క‌నువిందు చేస్తాయి.

lambasinghi2

లంబసింగి

ఈ వేసవిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సంద‌ర్శించే చ‌ల్ల‌ని ప్ర‌దేశాల్లో లంబ‌సింగి ఒక‌టి. ఇది ఒక ఏజెన్సీ ప్రాంతం. స‌ముద్ర‌మ‌ట్టానికి సుమారు 3600 అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ గ్రామం. ఈ ప్ర‌దేశం విశాఖ‌ప‌ట్నానికి స‌మీపంలో ఉంటుంది. దీనికి మ‌రోపేరు ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాశ్మీర్‌..కానీ, ఇక్క‌డి గిరిజ‌నులు ఈ ప్రాంతాన్ని కొర్ర బయలు అని కూడా పిలుస్తుంటారు. లంబ‌సింగి చుట్టుప‌క్క‌ల ఎన్నో అంద‌మైన ప్ర‌దేశాలు ఉన్నాయి. ఇక్క‌డ చుట్టూ కొండ‌లు, లోయ‌లు, జ‌ల‌పాతాలు ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ర్షిస్తాయి. మ‌రెందుకాలస్యం ఈ వేస‌విలో కూల్ కూల్‌గా ఉండే ఈ ప్రాంతాల‌ను ఒక్కసారైనా సంద‌ర్శించాల్సిందే..!

More News

    Read more about: visakhapatnam andhrapradesh
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+