Search
  • Follow NativePlanet
Share
» »సిక్కింలోని యుమ్‌తంగ్ వ్యాలీ వేసవిలో సంద‌ర్శ‌న‌కు ఉత్త‌మం..

సిక్కింలోని యుమ్‌తంగ్ వ్యాలీ వేసవిలో సంద‌ర్శ‌న‌కు ఉత్త‌మం..

స‌మ్మ‌ర్ హాలిడేస్ మొద‌లుకానున్నాయి. ఈ సీజ‌న్‌లో చాలామంది కూల్ ప్రాంతాల‌కు వెళ్లేందుకు ప్రణాళిక‌లు సిద్ధం చేసుకుంటుంటారు. అలాంటివారికి సిక్కిం సంద‌ర్శ‌న‌ ఓ ఉత్త‌మ గ‌మ్య‌స్థానం అని చెప్పకోవాలి. సిక్కిం ప్రాంతాన్ని వీక్షించేందుకు వేసవి కాలం ఎంతో ఉత్తమమైనది. ఇక్కడ ప‌ర్యాట‌కులు చూడదగ్గ ప్రదేశాలు చాలానే ఉన్నాయి. కానీ, అందులో అత్యంత ముఖ్య‌మైన ప్ర‌దేశం యుమ్‌తాంగ్ వ్యాలీ. ఈ సీజ‌న్‌లో ఈ ప్ర‌దేశాన్ని సంద‌ర్శించ‌డం ఓ గొప్ప అనుభూత‌నే చెప్పుకోవాలి. ఈ ప్రాంతాన్ని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని కూడా పిలుస్తుంటారు. ఫిబ్రవరి నుండి జూన్ వరకు ఈ లోయ పూలతో కప్పబడి ఉంటుంది. ఈ ప్ర‌దేశం గురించి మ‌రికొన్ని విశేషాల‌ను ఇప్ప‌డు తెలుసుకుందాం.

సిక్కింలోని అందమైన ప్ర‌దేశాల‌లో యమ్‌తంగ్ వ్యాలీ ఒక‌టి. య‌మ్‌తంగ్ లోయ సిక్కిం రాజధాని గాంగ్‌ట‌క్‌కి ఉత్తరాన సుమారు 140 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. దీనిని "పూల లోయ" అని కూడా పిలుస్తారు. ఇక్క‌డ అనేక రకాల అందమైన పుష్పాలను చూడొచ్చు. సిక్కింను సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే మాత్రం ఈ ప్రదేశాన్ని అస్స‌లు మిస్స‌వ్వ‌కండి. ఇది 3,564 మీటర్ల ఎత్తులో ఉన్న ఓ లోయ. అడ్వంచ‌ర్ ట్రిప్ చేయాల‌నుకునేవారికి, సాహ‌స‌ప్రియుల‌కు ఈ ప్ర‌దేశం ఎంతో ఉత్త‌మ‌మ‌నే చెప్పుకోవాలి.

yumthangvalley

యుమ్‌తంగ్ వ్యాలీ ప్ర‌త్యేక‌త‌లు..

యుమ్‌తంగ్ లోయ‌ ముఖ్యంగా అద్భుతమైన వీక్షణలకు ప్రసిద్ధి చెందింది. 24 కంటే ఎక్కువ జాతుల రోడోడెండ్రాన్ పువ్వులు ఈ లోయలో చూడొచ్చు. ఇవి ఫిబ్రవరి నుండి జూన్ వరకు వికసిస్తాయి. అనేక రకాల చర్మ సంబంధిత సమస్యలను నయం చేసే అనేక వేడి నీటి బుగ్గలు కూడా ఈ లోయలో ఉన్నాయిని స్థానికులు చెబుతుంటారు. అంతే కాకుండా, ఇక్కడకు రావడం ద్వారా ట్రెక్కింగ్ మరియు క్యాంపింగ్ వంటి అనేక కార్యక్రమాలను కూడా ఆస్వాదించవచ్చు.

ఇక్క‌డకు వెళ్లేవారు పాటించాల్సిన చిట్కాలు..

ఏ సీజన్‌లోనైనా యుమ్‌తాంగ్ వ్యాలీని ప్లాన్ చేసుకోవ‌చ్చు. ఇక్క‌డికి వెళ్లేట‌ప్ప‌డు త‌ప్ప‌కుండా వెచ్చని దుస్తులను మీ వెంట తీసుకెళ్లాలి. ఎందుకంటే ఈ ప్రదేశం ఎంతో చ‌ల్ల‌గా ఉంటుంది. చాలా ఎత్తులో కూడా ఉంటుంది. దీని కారణంగా ఇక్కడ వాతావరణం మారుతూ ఉంటుంది. ఇక్క‌డికి వెళ్లాలంటే ముందుగా గ్యాంగ్‌టక్ చేరుకోవాలి. అక్క‌డి నుండి లాచుంగ్‌కి వెళ్లి అక్కడ రాత్రి బస చేసి, మరుసటి రోజు ఉదయం యమ్‌తాంగ్‌కు బయలుదేరాలి. ఈ వ్యాలీని సందర్శించడానికి ప్రత్యేక అనుమతి అవసరం. కాబట్టి ఇక్కడకు వెళ్లే ముందు ఖచ్చితంగా అనుమతిని తీసుకోండి.

yumthangvalley sikkim

ఈ ప్రాంతాన్ని సంద‌ర్శించేందుకు ఉత్తమ సీజన్...

యుమ్‌తాంగ్ వ్యాలీని సందర్శించేందుకు ఉత్తమ సీజన్ ఫిబ్రవరి నుండి జూన్ వరకు, కాబట్టి ఈ సమయంలో ప్లాన్ చేసుకోవ‌డం ఉత్త‌మం. అంతేకాదు, ఈ ప్రదేశం సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది.

ఎలా చేరుకోవాలి?

యుమ్‌తాంగ్ వ్యాలీ గాంగ్‌ట‌క్‌ నుండి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి చేరుకోవడానికి రోడ్డు మార్గం ఉత్తమ ఎంపిక అనే చెప్పుకోవాలి. లాచుంగ్ నుండి, యుమ్‌తాంగ్ చేరుకోవడానికి సుమారు 50 నిమిషాలు పడుతుంది. ఇక్క‌డికి ప్ర‌యివేట్ వెహిక‌ల్‌, క్యాబ్‌లు, బ‌స్సులు అందుబాటులో ఉంటాయి.

More News

    Read more about: yumthang valley sikkim
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+