సిక్కిం – పవిత్రమైన పర్వతాలు, అనుగ్రహం పొందిన ప్రదేశాల పొందిక !!

హోమ్ » ప్రదేశములు » » అవలోకనం

పర్యటించడం ఎప్పుడు హుషారునిచ్చేదిగా పరిగణించబడింది. ఒక అన్వేషించబడిన లేదా అన్వేషించవలసిన ప్రదేశాన్ని సందర్శించడం ఎల్లప్పుడు కొంత అద్భుతాన్ని అక్కడి పర్యటనాభిమానులకు అందిస్తుంటుంది. కాని ఉత్తమమైన చక్కటి ప్రదేశాలు, మంచుకిరీటాన్ని ధరించిన పర్వతాలు, పూల పాన్పు వంటి మైదానాలు, దివ్యమైన జలవనరులు, ఇంకా ఎన్నో ఉండి, దాదాపుగా ఒక స్వర్గం అని స్థానికులు తిరిగి పేరు పెట్టిన ఒక స్థలాన్ని సందర్శిస్తుంటే ప్రయాణం అనే పదమే ఎంతో మనోహరంగా అనిపిస్తుంది. కాని ఏ స్థలం అంతగా ఆకట్టుకుంటుంది, కేవలం కొన్ని పదాలు మాత్రమే దానిని అద్భుతంగా మార్చిఉంటాయి? మనం ఎంతో అద్భుతమైన సిక్కిం గురించి మాట్లాడుకు౦టున్నాం!! సిక్కిం, భారతదేశంలో హిమాలయ పర్వత ప్రాంతంలోని రాష్ట్రాలలో ప్రకృతి దీవెనలతో నిండిన ఎంతో అందమైన ఒక అద్భుత భూమి.

జీవితకాలంలో ఒక్కసారైనా చూడదగిన సుందర ప్రదేశాలతో, ఈ అద్భుతమైన రాష్ట్రం గొప్పగా చెప్పుకొనే ప్రత్యేకత ఉన్న అనేక విషయాలను కల్గి ఉంది.రండి, ఈ అన్వేషించని భారతదేశ పర్వత రాష్ట్రాన్ని గురించి ముఖ్యమైన, ఆసక్తికరమైన అన్ని నిజాలను తెల్సుకొందాం.సిక్కిం భౌగోళిక స్థితిసిక్కిం, హిమాలయ పర్వతాలలో ఉన్నఒక పర్వత ప్రాంతం. సిక్కింలోని దాదాపు అన్ని ప్రాంతాలు 280 - 8,585 మీటర్ల మధ్య ఎత్తులో ఉన్న పర్వత భూభాగాలు. ఈ రాష్ట్రంలోని అత్యంత ఎత్తైన ప్రాంతం కంచన్ జంగా – విశ్వం లోనే మూడవ ఎత్తైన శిఖరం. సిక్కింకు తూర్పున భూటాన్, పశ్చిమాన నేపాల్, ఉత్తరాన టిబెట్ పీఠభూమి ఉన్నాయి.

ఈ రాష్ట్రానికి 28 పర్వత శిఖరాలు, 227 ఎత్తైన ప్రాంతాలలో ఉన్న సరస్సులు, 80 హిమానీనదాలు ఉన్నాయి. ఇంకా ఏమిటంటే, ఈ రాష్ట్ర భౌగోళికస్థితికి అదనంగా ప్రత్యేకతను జోడించే దాదాపు 100 నదులు, పిల్ల కాలువలు, అనేక ప్రధాన వేడినీటి బుగ్గలు కూడా ఉన్నాయి. సిక్కిం వేడి నీటి బుగ్గలను సహజమైన 50 డిగ్రీల సెల్సియస్ సగటు ఉష్ణోగ్రతతో, అవి కల్గి ఉన్న చికిత్సాపరమైన శక్తుల వలన ఎంతో ప్రత్యేకమైనవిగా పరిగణిస్తారు. దాని భౌగోళిక స్థితి గురించి ఇంకా మాట్లాడటం వలన సిక్కింలో మూడో వంతు దట్టమైన అడవులతో నిండిఉన్నదని, మంచుతో నిండిన ఒక స్థాయిలోని కాలువలు ‘సిక్కిం జీవం’గా పిలిచే తీస్థ నదిని చేరుతాయని మనకు అర్ధం చేసుకోవడానికి తోడ్పడుతుంది.

వాతావరణం సిక్కిం ఎంత అందమైనదో, దాని వాతావరణం కూడా అంతే. ఒక క్రమ పద్ధతిలో ప్రతి ఏటా మంచుకురిసే భారతదేశ అతి కొద్ది రాష్ట్రాలలో సిక్కిం రాష్ట్రం ఒకటైనప్పటికీ, ఈ ప్రాంతంలో నివసించే వారు మాత్రం ఎల్లప్పుడు ఒక మోస్తరైన, ఆహ్లాదకర వాతావరణాన్ని అనుభవిస్తారు. ఇక్కడి ఉత్తర ప్రాంతంలో మంచుతో కప్పబడే వాతావరణం ఉండగా, దక్షిణ ప్రాంత౦లో ఉప ఉష్ణమండల వాతావరణంగా మారుతుంది. మంచుతో నిండిన వాతావరణాన్ని అనుభవించే ఉత్తరప్రాంతంలో ప్రతి ఏటా నాలుగు నెలల వరకు మంచుతో కూడి, ఉష్ణోగ్రత సుమారు 0 డిగ్రీల సెల్సియస్ కు పడిపోతుంది. ఈ ప్రాంత౦ వాతావరణ పరిస్థితులను ఆహ్లాదకరంగా మార్చే నిజమేమిటంటే, దీని ఉష్ణోగ్రత వేసవిలో 28 డిగ్రీల సెల్సియస్ కు ఎల్లప్పుడు మించకపోగా, శీతాకాలంలో అది 0 డిగ్రీల సెల్సియస్ ల గడ్డకట్టించే స్థితికి కూడా రాదు. ఈ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడే౦తగా ఎంతో భారీగా వర్షాలు కురిసినందున వర్షాకాలం మాత్రం కొంత ప్రమాదకరంగా ఉంటుంది. సిక్కిం వివిధ పేర్లు, దీని ఉపవిభాగాలు, జనబాహుళ్యం. . .సిక్కిం రాష్ట్రానికి అనేక పేర్లు ఉన్నాయి.

లేప్చాల ప్రకారం దీనిని నయే-మే-ఎల్ అనగా ‘స్వర్గం’ అని అర్ధంతో పిలువగా, లింబు సమాజానికి చెందిన వారు దీనిని సుఖిం అనగా ‘కొత్త గుర్రం’ అని పిలుస్తారు. భూటియా సమాజానికి చెందిన ప్రజలకు సిక్కిం ‘బెముల్ దేమజాంగ్’ – ‘వారి దాగిన లోయ’. రాష్ట్రం తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణాలుగా, వాటి రాజధానులు గాంగ్ టక్, గేజింగ్, మంగన్, నమ్చి లతో నాలుగు విభాగాలుగా ఏర్పడింది. మొత్తం రాష్ట్ర జనాభా సుమారు 607,000 కాగా, ఇది అతి తక్కువ జనాభా ఉన్న భారతదేశ రాష్ట్రమవ్వడంతో బాటుగా గోవా తర్వాత భారతదేశంలో రెండవ అతి చిన్న రాష్ట్రమైంది.సిక్కిం లో చూడదగినది ఏది . . .మీరు అందమైన సిక్కిం భూభాగంపై ఉన్నప్పుడు ఈ ప్రదేశాలను సందర్శించి, ఈ కింద తెలపబడిన అక్కడి కార్యకలాపాలలో పాల్గొనండి: నమ్చి లో సిక్కిం పోషక సాధువు – పద్మసంభవ గురువు అతి ఎత్తైన విగ్రహం, అందమైన రోడోడెండ్రాన్ అభయారణ్యం - అనేక రకాలతో రాష్ట్ర పుష్పానికి చెందిన పవిత్ర ప్రదేశం, కాంచనజంగా – ప్రపంచంలో మూడవ అతి ఎత్తైన శిఖరం, అనేక పవిత్రమైన, శక్తివంతమైన బౌద్ధ సన్యాసి మఠాలు, అందమైన పచ్చటి లోయలు, నదులు, సిక్కిం ప్రత్యేక వేడి నీటి బుగ్గలు, ప్రశాంతమైన, పర్యావరణ పర్యాటక రంగానికి అనుకూలమైన గ్రామం, అన్వేషించబడని స్థలాలు, సాహస క్రీడలకు ఎంతో అనుకూలమైన కొండలు, ఇలా జాబితా కొనసాగుతుంది . . .

ఆహారపదార్థాలు, పండుగలు మర్చిపోలేనిది, సిక్కిం వంటకాలు, సంస్కృతి అనే రెండు విషయాలు కూడా ఈ చిన్న అందమైన రాష్ట్రాన్ని ఒక ముఖ్య స్థాయిని కల్గించాయి. సిక్కిం ప్రజలకు వరి ప్రధానాహారం. సిక్కింలోని కొన్ని సంప్రదాయ వంటలలో మోమోలు, చౌమెన్, వాంటొన్, ఫక్తు, గ్యాతుక్ లేదా తుక్ప – నూడుల్ ఆధారిత సూపు, ఫగ్షప, చుర్పితో కూడిన నింగ్రో. ఆల్కహాల్ ఆధారిత పానీయాలు కూడా సిక్కిం ప్రజలు ప్రముఖంగా తీసుకొంటారు. స్థానిక బౌద్ధ సిక్కిం వాసులు జరుపుకొనే సాంప్రదాయ పండుగలలో మాఘే సంక్రాంతి, భీమసేన పూజ, ద్రుప్క తెషి, లోసార్, బుమ్చు, సగ దవ, లూసాంగ్ కొన్ని చెప్పుకోదగినవి. ఎంతగానో అందిస్తున్న ఈ రాష్ట్రం సిక్కిం మెల్లగా ఒక ప్రధాన భారతీయ పర్యాటక హాట్ స్పాట్ గా మారుతుందనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. రండి, ఈ దీవెనలందుకున్న రాష్ట్రం గురించి ఇంకా ఎంతో అన్వేషిద్దాం; సెలవులను ఇక్కడ గడపడం అనేది సాటిలేని అనుభూతి కావచ్చు!

 

Please Wait while comments are loading...