Search
 • Follow NativePlanet
Share

అరితర్  – అపరిమిత ఆనందం కోసం !!

12

తన ప్రాకృతిక అందానికి, వైభవమైన చరిత్రకి ప్రసిద్ది చెందిన తూర్పు సిక్కిం లోని భాగం అరితర్. ప్రకృతి ఒడి లో సేద తీరాలనుకునే వారికి ఇది సరైన పర్యాటక కేంద్రం. ప్రశాంతమైన సరస్సులు, దట్టమైన అడవులు, చీకటి వరి చేల చుట్టూ వుండే కొండలతో వుండే ఈ అందమైన ప్రాంతంలో స్వర్గం లో వున్న అనుభూతిని పొందుతారు. ఉదయం వేళల్లో ఇక్కడి దృశ్యాలు చెప్పలేనంత అందంగా వుంటాయి.

భౌగోళికం పాక్యోంగ్ లేదా రంగ్పో గుండా గాంగ్టక్ నుంచి నాలుగు గంటల ప్రయాణంతో చేరగలిగే అరితర్ హిమాలయాల అంచున వుంది. ఇది సిక్కిం లోని రోంగ్లి సబ్-డివిజన్ లో వుంది. సిక్కిం లోని మిగతా ప్రాంతాల నుంచి వేరుగా వుంటుంది అరితర్. దీనికి కా౦చెన్ జంగా పర్వతంతో సరిహద్దు వుంది.

చరిత్రలోకి ఓ వీక్షణం....1904 లో ఇండో టిబెట్ వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చాక అరితర్ ప్రాధాన్యం పెరిగింది. బ్రిటిష్ వారు సిక్కిం లో కొత్త రోడ్లు నిర్మించాక టిబెటన్ లలో అనుమానం మొదలై యుద్ధానికి దారి తీసింది. టిబెటన్ లు సిక్కిం లో జేలేపా పాస్ వద్ద వున్న లింగ్టూ ను ఆక్రమించుకున్నారు.

దీని తరువాత లార్డ్ యంగ్ హస్బెండ్ అనే ఆయన టిబెట్ మీద ఒక ఒప్పదం రుద్దాడు. దీంతో బ్రిటిష్ వారికి టిబెట్ లో వాణిజ్యం చేసుకోవడానికి ఏకస్వామ్యం వచ్చింది. ఈ దారి డార్జీలింగ్ లో వున్న పెడోంగ్ లోని కాలింపోంగ్ లో మొదలై నాథులా పాస్, రేనాక్, అరితర్, జలుక్ ల గుండా వెళ్తుంది. అందువల్ల ఆ కాలంలో గాంగ్టక్ కన్నా వాణిజ్య పరంగా అరితర్ సుప్రసిద్ధం అయింది.

అరితర్ సంస్కృతి, సాంప్రదాయాలు ....ప్రతి ఏటా ఏప్రిల్ చివరిలో గానీ మే మొదట్లో గానీ అరితర్ లో లంపోఖారి పర్యాటక ఉత్సవ౦ నిర్వహిస్తారు. సాహస క్రీడలకు పెద్ద పీట వేసే ఈ ఉత్సవానికి సాహసికులంతా హాజరౌతారు. బోటింగ్, సరస్సు చుట్టూ గుర్రపు స్వారీ, సాంప్రదాయ విలువిద్య పోటీలు, వ్యూ పాయింట్ లకు, చిన్న కొండలపైకి పర్వతారోహణ ఇక్కడి పర్యాటక కార్యకలాపాల్లో కొన్ని.

అంతే కాదు, సాహసికులు ప్రయత్నించాల్సినవి ఇక్కడ ఇంకా చాలానే వున్నాయి. పర్వతారోహణ చేయాలనుకునే వారు, పేరా గ్లైడింగ్ చేయాలనుకునే వారికి కూడా అరితర్ స్వాగతం పలుకుతు౦ది. ఇక్కడి సంప్రదాయ సంస్కృతి, రుచికరమయిన అరితర్ వంటకాలు ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తుడి. ఇక్కడి స్థానిక రుచులతో బాటు నిప్పుల మీద కాల్చిన ఎండు మాంసం, స్థానిక కళ్ళు కూడా ఈ ఉత్సవంలో యాత్రికులకు అంద చేస్తారు.

అరితర్ లోను, చుట్టు పక్కలా పర్యాటక కేంద్రాలు లంపోఖారి సరస్సు (అరితర్ సరస్సు లేదా ఘాతి-త్సో అని కూడా పిలుస్తారు), ఆరితర్ గోమ్పా మాంఖిం, లవ్ దారా లాంటివి కూడా అరితర్ లో పర్యాటకులు ఎక్కువగా సందర్శిస్తారు.మీరు ప్రకృతిని, సాహసాన్ని ప్రేమించే వారైతే అరితర్ చూడాల్సిందే. మీరు కొండల పైకి ఎక్కలనుకున్నా, పాడిల్ బోట్ సవారీ చేయాలనుకున్నా ఇదే సరైన ప్రదేశం. మీ ప్రయాణంలో అడవిలోని పూదోటల అందాలు, పొడవాటి చెట్లు, ఎత్తైన కొండలు చూస్తూ కాలక్షేపం చేయవచ్చు.

అరితర్ వాతావరణం :అరితర్ లో ఏడాది పొడవునా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటు౦ది.

అరితర్ ఎలా చేరుకోవాలి?అరితర్ వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా చేరుకోవచ్చు.

అరితర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

అరితర్ వాతావరణం

అరితర్
16oC / 61oF
 • Clear
 • Wind: SSE 19 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం అరితర్

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? అరితర్

 • రోడ్డు ప్రయాణం
  The most convenient way to reach Aritar from within the other cities of Sikkim is to take a taxi to the place. It is just a three hours' drive from the city of Gangtok.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  The nearest railhead to Aritar is located at Siliguri. The Siliguri Railway Station is connected to many major cities in the country which include Chennai, Trivandrum, Secunderabad, Cochin and Guwahati.
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  The airport Of Siliguri is the nearest airport to Aritar is at Siliguri. The airport is well connected to major Indian cities like Mumbai, New Delhi, Chennai and Kolkata. International flights also operate to this airport from destinations like Bangkok and Paro.
  మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
16 Dec,Sun
Return On
17 Dec,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
16 Dec,Sun
Check Out
17 Dec,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
16 Dec,Sun
Return On
17 Dec,Mon
 • Today
  Aritar
  16 OC
  61 OF
  UV Index: 6
  Clear
 • Tomorrow
  Aritar
  -6 OC
  22 OF
  UV Index: 4
  Moderate or heavy rain shower
 • Day After
  Aritar
  -4 OC
  25 OF
  UV Index: 3
  Patchy light rain