Search
 • Follow NativePlanet
Share

లచుంగ్  – ఆనంద పరిచే భూభాగం !!

10

-----

ఉత్తర సిక్కిం జిల్లాలో సముద్ర మట్టానికి 9600 మీటర్ల ఎత్తున వున్న అందమైన పట్టణం లచుంగ్. తీస్తా నది ఉపనదులు లచేన్, లచుంగ్ కలిసే చోటు ఇది. లచుంగ్ అంటే ‘చిన్న పాస్’ అని అర్ధం – ఇది ప్రపంచ వ్యాప్తంగా రచయితలకు ఇష్టమైన ప్రదేశం. ప్రపంచం నలు మూలల నుంచి యాత్రికులు సందర్శించే లచుంగ్ ఆశ్రమం లచుంగ్ లో ప్రసిద్ది చెందింది. యుమతాంగ్ లోయకు ఇది ముఖ ద్వారంగా పని చేస్తుంది.

సిక్కిం లోని చాలా అందమైన ఈ చిన్న పట్టణం ప్రసిద్ధ పర్యాటక కేంద్రం కూడా. ఈ పట్టణం ఎంత అందమైనదంటే బ్రిటిష్ పర్యాటకుడు జోసెఫ్ డాల్టన్ హుకర్ తన ‘హిమాలయన్ జర్నల్’ లో ‘సిక్కిం లోని అత్యంత అందమైన గ్రామం’ గా అభివర్ణించాడు. ఇక్కడి జలపాతాలకు, స్వచ్చమైన సెలయేళ్ళు, కొన్ని విస్తారమైన అందమైన యాపిల్ తోటలకు ప్రత్యేకంగా ప్రసిద్ది చెందిన ఈ పట్టణాన్ని అక్టోబర్ నుంచి మే మధ్య ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తారు. శీతాకాలం లో భారీగా మంచు పడుతుండడం కొద్దిగా పర్యాటకులు తగ్గుతారు.

లచుంగ్ లోను, చుట్టు పక్కలా పర్యాటక కేంద్రాలు

పర్యాటక కేంద్రాలు మరిన్ని లేకపోయినా సిక్కింలో వున్నప్పుడు తప్పక చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు లచుంగ్ లో చాలానే వున్నాయి. లచుంగ్ ఆశ్రమం, రోడోడెన్డ్రాన్ అభయారణ్యం లాంటివి లచుంగ్ లో సుప్రసిద్ధ ఆకర్షణలు – ఈ అభయారణ్యంలో రాష్ట్ర పుష్పం రోడోడెన్డ్రాన్ లోని చాలా రకాలు వేసవి మొదట్లో పుష్కలంగా పుష్పిస్తాయి.

లచుంగ్ లో రుచికరమైన యాపిళ్ళు, యాప్రికాట్ లు, పీచ్ లు లాంటివి రుచి చూడవచ్చు కానీ, ఈ అందమైన పట్టణం హస్త కళాకృతులకు ప్రసిద్ది చెందింది. ఇక్కడి నుంచి ఇంటికి కొన్ని అందమైన హస్త కళాకృతులు తీసుకు వెళ్ళవచ్చు.

లచుంగ్ వాతావరణం

లచుంగ్ లో వెచ్చటి వేసవులు వుంటాయి, శీతాకాలాలు చాలా చల్లగా వుంటాయి, వానా కాలం లో భారీ వర్షాలు కురుస్తాయి.

లచుంగ్ లో స్థానికులు

లచు౦గ్ లో వుండే వారు ఎక్కువగా లెప్చా జాతికి, టిబెటన్ మూలాలు వున్న భూటియా జాతికి చెందిన వారు. వారినే లచుంగ్ పా లంటారు. నేపాలి, లెప్చా, భూటియా ఇక్కడ ఎక్కువగా వాడే భాషలు. ఈ పట్టణ వాసులు ఇప్పటికీ జుమ్సా అనే తమదైన పరిపాలనా విధానాన్ని పాటిస్తుంటారు, దీని ప్రకారం స్థానిక వివాదాలు అన్నీ అక్కడే పరిష్కరించుకుంటారు.

సాహస ప్రియులకు లచుంగ్

లచుంగ్ కొన్ని సాహస క్రీడలకు అవకాశం కల్పిస్తుడి. రోడోడెన్డ్రాన్ అభాయారణ్యానికి పర్వతారోహణ చేయడానికి ఇదే బేస్ కాంప్. (యుమతాంగ్ లోయ లో మొదలై లచేన్ లోయలో అంతమౌతుంది). ఇక్కడికి దగ్గరలోనే ఫుని అనే పట్టణం వుంది – అది స్కీయింగ్ కు అవకాశం కల్పిస్తుంది.

లచుంగ్ ఎలా చేరుకోవాలి ?

లచుంగ్ కు వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా చుట్టు పక్కల ప్రాంతాల నుంచి చేరుకోవచ్చు.

లచుంగ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

లచుంగ్ వాతావరణం

లచుంగ్
19oC / 66oF
 • Partly cloudy
 • Wind: NE 3 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం లచుంగ్

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? లచుంగ్

 • రోడ్డు ప్రయాణం
  రోడ్డు ద్వారా లచుంగ్ కు రాష్ట్రంలో తిరిగే బస్సులు, కార్ల ద్వారా చేరుకోవచ్చు.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  రైలు ద్వారా : లచుంగ్ లో రైల్వే స్టేషన్ లేదు. లచుంగ్ నుంచి 139 కిలోమీటర్ల దూరంలో వున్న సిలిగురికి దగ్గరలో వున్న న్యూ జల్పాయి గురి ఇక్కడికి సమీప రైల్వే స్టేషన్. జల్పాయి గురి లోని జల్పాయి గురి, న్యూ జల్పాయి గురి, జల్పాయి గురి రోడ్ అనే మూడు రైల్వే స్టేషన్ లకు దేశం లోని అన్ని ప్రధాన నగరాల నుంచి నిత్యం రైళ్ళు తిరుగుతాయి.లచుంగ్ కు సమీప రైల్వే స్టేషన్ న్యూ జల్పాయి గురి జంక్షన్
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  వాయు మార్గం ద్వారా : లచుంగ్ నుంచి 128 కిలోమీటర్ల దూరంలో వున్న పశ్చిమ బెంగాల్ లోని బాగ్డోగ్రా ఇక్కడికి దగ్గరి అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ విమానాశ్రయం నుంచి డిల్లీ, ముంబై, కోల్కతా, గువహతి లాంటి ప్రధాన నగరాలకు అనుసంధానం బాగుంది.
  మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Mar,Tue
Return On
27 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
26 Mar,Tue
Check Out
27 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
26 Mar,Tue
Return On
27 Mar,Wed
 • Today
  Lachung
  19 OC
  66 OF
  UV Index: 7
  Partly cloudy
 • Tomorrow
  Lachung
  19 OC
  67 OF
  UV Index: 6
  Patchy rain possible
 • Day After
  Lachung
  19 OC
  66 OF
  UV Index: 7
  Partly cloudy