Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ట్రిచీ » వాతావరణం

ట్రిచీ వాతావరణం

ఉత్తమ సమయం అక్టోబర్ నుండి ఫిబ్రవరి మధ్య ఉండే శీతాకాలంలో ట్రిచీ సందర్శన ఉత్తమమైనది. ఈ సమయంలో వాతావరణం అత్యంత ఆహ్లాదకరంగా ఉంటుంది. శీతాకాలంలో జరిగే క్రీడా కార్యక్రమం జల్లికట్టు కూడా ఈ ప్రాంత ప్రధాన ఆకర్షణ.  

వేసవి

వేసవి ట్రిచీ వేసవిలో ప్రత్యేకంగా పగలు వేడిగా, పొడిగా ఉంటుంది. ఆగ్నేయ గాలుల వల్ల సాయంత్రాలు కొంచెం చల్లగా ఉంటాయి. వేసవి మార్చ్ నుండి జూన్ వరకు ఉంటుంది. ఉష్ణోగ్రత 30, 40 డిగ్రీల మధ్య ఉంటుంది. ఈ సమయంలో నగర సందర్శన మంచిది కాదు.

వర్షాకాలం

వర్షాకాలం ట్రిచీలో వర్షాకాలం జూలీ నుండి అక్టోబర్ వరకు ఉంటుంది. ఈ సమయంలో ఇక్కడ ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయి, వీటి ఫలితంగా వాతావరణం చల్లగా ఉంటుంది. ఈ కాలంలో వాతావరణం కొంచెం తేమగా ఉంటుంది.

చలికాలం

శీతాకాలం ట్రిచీ లో శీతాకాలం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, ఉష్ణోగ్రత 19 డిగ్రీలు 25 డిగ్రీల మధ్య ఉంటుంది. శీతాకాలం నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. సంవత్సరంలో ఈ సమయంలో ఈ నగర సందర్శన ఉత్తమం.