Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఉఖ్రుల్ » వాతావరణం

ఉఖ్రుల్ వాతావరణం

ఉత్తమ సీజన్ఉష్ణోగ్రత చాలా కఠినమైన లేనప్పుడు ఉఖ్రుల్ సందర్శించడానికి ఉత్తమ సమయం వేసవిలో ఉంది. ఈ సమయలో అందమైన ఆకుపచ్చని పర్వతాలను వీక్షించవచ్చు. వేసవిలో వాతావరణము పొడిగా ఉండుట వలన ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశమునకు ప్రయాణం సులభం అవుతుంది.

వేసవి

వేసవి కాలం ఉఖ్రుల్ లో వేసవి మార్చి నుండి మొదలై మే వరకు విస్తరించి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉఖ్రుల్ లో సాధారణంగా గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉండదు. కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ క్రిందకి ఉండదు. ఆహ్లాదకరమైన వాతావరణ పరిస్థితుల కారణంగా పర్యాటకులు వేసవిలో ఉఖ్రుల్ ను సందర్శించవచ్చు.

వర్షాకాలం

వర్షాకాలంరాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఉఖ్రుల్ లో కుండపోత వర్షం ఉంటుంది. వర్షాకాలం జూన్ నుంచి సెప్టెంబర్ నెలల వరకు నిరంతర వర్షపాతంతో తడిగా ఉంటాయి. కొన్నిసార్లు వర్షాకాలం అక్టోబర్ వరకు విస్తరిస్తుంది. నిత్యం వర్షపాతం ఎక్కువగా ఉండుట వల్ల బహిరంగ కార్యక్రమాలకు అవరోధం కలుగుతుంది. పర్యాటకులు వర్షాకాలం సమయంలో ఉఖ్రుల్ ను సందర్శించేందుకు అనుకూలంగా ఉండదు.

చలికాలం

శీతాకాలంశీతాకాలంలో ఉష్ణోగ్రత చాలా నాటకీయంగా చల్లగా మరియు గడ్డకట్టే విదంగా క్రిందికి పడిపోతుంది. శీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రత 3 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతుంది. శీతాకాలంలో సందర్శించే ప్రయాణికులు ఎవరైనా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి.