వల్పరై నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఒక టీ ఎస్టేట్ లోపల ఉన్నది. ఈ ఆలయంను పెరియా కరమలై టీ పరిశ్రమల యాజమాన్యం నిర్వహిస్తుంది. అనేక ప్రదేశాల నుండి భక్తులు ఈ ప్రదేశంకు వచ్చి పూజలు చేస్తారు. బాలాజీ ఆలయం వల్పరై లో అత్యంత ప్రసిద్ధ పర్యాటక స్థలము మరియు 30 కిలోమీటర్ల దూరంలో కోయంబత్తూర్ ఉన్నది.
విష్ణు భగవానుడి ఈ ఆలయంలో బాలాజీకి పూజలు చేస్తుంటారు.ఇది టీ మొక్కలు మరియు పర్వతాలు మద్య ఉన్నది. అలాగే ఆలయంలోకి ఫోటోగ్రఫి,మొబైల్ ఫోన్ల వాడకం నిషేధించబడింది. పూజలు చాలా వరకు తిరుపతి బాలాజీ ఆలయంలోని పూజల మాదిరి జరుగుతాయి. దేవుని దీవెనలు పొందటానికి చాలా దూరం నుంచి భక్తులు వస్తారు. వాహనాలకు ఆలయ ప్రవేశం వరకు అనుమతి లేదు. అక్కడ నుండి గుడిని చేరటానికి అర కిలోమీటర్ దూరం కాలినడకన ఉంటుంది.



Click it and Unblock the Notifications