Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » విదిష » వాతావరణం

విదిష వాతావరణం

ఉత్తమ కాలం విదిషలో చాలా దేవాలయాలు ఉన్నందువలన, పెద్ద ఉత్సవాల సమయంలో దీనిని దర్శించటం మంచిది. ఈ వేడుకలు గొప్ప ఆచారాలు మరియు అలంకరణలలో మునిగి ఉంటాయి కనుక ఆ సమయంలో విదిషలో ఉండటం చాలా ఆనందాన్ని ఇస్తుంది. అక్టోబర్ నుండి మార్చ్ నెలల మధ్య విదిషను సందర్శించటానికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా, ఈ సమయంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.

వేసవి

వేసవికాలం: ఇక్కడ వేసవిలో చాలా వేడిగా ఉండటంవలన, ఈ ప్రాంతాన్ని సందర్శించాలంటే వేసవిలో అనుకూలంగా ఉండదు. ఈ సమయంలో ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది మరియు అందువలన వేసవిలో ఈ ప్రాంత సందర్శనకు ప్రణాళిక వేయ వొద్దు.

వర్షాకాలం

వానాకాలం: విదిశ లో ఎక్కువ వర్షపాతం ఉండదు. ఇక్కడ వానాకాలం సాధారణంగా జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది మరియు తక్కువ వర్షపాతం నమోదు అవుతుంది. ఈ సమయంలో వాతావరణం మధ్యస్తంగా ఉన్నా, ఈ కాలం విదిషను సందర్శించటానికి అనుకూలంగా ఉండదు.

చలికాలం

శీతాకాలం: విదిషలో శీతాకాలం ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు శీతాకాల ప్రారంభం మరియు చివరలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. డిసెంబర్ నుండి ఫిబ్రవరి నెలలలో తక్కువ ఉష్ణోగ్రత 4 డిగ్రీలు నమోదు అవుతుంది. శీతాకాలం ఇక్కడ అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది.