Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » వాయనాడు » వాతావరణం

వాయనాడు వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయంవాయనాడు ని సందర్శించడానికి అనువైన సమయం శీతాకాలం. ఉదయం పుట ఎండ వెచ్చగా ఉండి, గాలిలో తేమ తక్కువగా ఉండడం వల్ల సందర్శకులు ఆనందంగా పర్యటించవచ్చు. సాయంత్రం మరియు రాత్రులు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు అనువుగా ఉంటాయి.

వేసవి

వాతావరణం :ఎండాకాలం :ఎండాకాలం లో ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్ వరకు చేరడం వల్ల వాతావరణం కొంచెం వేడిగానే ఉంటుంది. ఈ సమయంలో బయటికి వెళ్ళడమే కష్టమైనప్పుడు సైట్ సీయింగ్ ని మీరు ఆనందించలేరు. అయినప్పటికీ సాయంత్రాలు, రాత్రులు మాత్రం చల్లగానే ఉంటుంది. ఇక్కడ మార్చ్ లో ప్రారంభమయ్యే ఎండాకాలం మే వరకు ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలంజూన్ నుండి సెప్టెంబర్ మధ్యలో ఇక్కడ వర్షాకాలం. భారి వర్షపాతం ఇక్కడ నమోదవుతుంది. ఇక్కడ ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ కి పడిపోతుంది. ఈ సమయం లో ఎడతెరిపి లేని గాలులు మరియు వర్షాల వల్ల ఈ ప్రాంతం సందర్శించడానికి అనువైనది కాదు. ఈశాన్య, నైరుతి ఋతుపవనాల రాకతో ఇక్కడ వర్షపాతం నమోదవుతుంది.

చలికాలం

చలికాలండిసెంబర్ ప్రారంభంలో మొదలయ్యే చలికాలం ఫిబ్రవరి మధ్య వరకు ఉంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ నుండి 28 డిగ్రీల సెల్సియస్ మధ్యలో హెచ్చుతగ్గులకి గురవుతుంది. వాతావరణం ఉదయం పూట ఆహ్లాదకరంగా సాయంత్రం పూట చల్లగా ఉంటుంది. శీతాకాలంలో రాత్రులు చలి తీవ్రమవడం వల్ల స్వెట్టర్ లని, లైట్ జాకెట్స్ ని వెంట తీసుకెళ్ళడం మంచిది.