తిపేశ్వర్ అభయారణ్యం 148 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి వుంది. ఇది యావత్మల్ లోని పందకావడా తాలుకాలో వుంది.ఇక్కడ దక్షిణ ఉష్ణమండల తేమ మిశ్రమ వనాల్లాంటి వివిధ వృక్ష జాతులు, కొండ ప్రాంతాలు, పొదలతో కప్పి వుండే పచ్చని బయళ్ళు వుంటాయి. ఇక్కడ అవోలా, ఐన్, టేకు, కలప లాంటి చెట్లు కూడా వుంటాయి.నీలకంత పక్షి, చితాల్, కోటి, సాంబార్, కుందేలు, నల్ల దుప్పి లాంటి వన్యప్రాణులు కూడా ఇక్కడ దొరుకుతాయి.ఈ అభాయారణ్యాన్ని సందర్శించడానికి వేసవి అనువైన సమయం. యావత్మల్ రైల్వే స్టేషన్ ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు.



Click it and Unblock the Notifications