Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఏలగిరి » వాతావరణం

ఏలగిరి వాతావరణం

ఉత్తమ సమయం ఏలగిరి లో ఎడాదిపొడవునా ఒక మోస్తరు వాతావరణం ఉంటుంది అయితే, సంవత్సరంలో ఏ సమయంలోనైనా ఈ ప్రాంతాన్ని సందర్శించ వచ్చు. అయితే, నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఇక్కడి వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది కాబటి ఈ సమయంలో ఏలగిరి సందర్శన ఉత్తమమైనది. స్థానిక సంస్కృతిని ఇష్టపడేవారు మే నెలలో జరిగే వేసవి పండుగ సమయంలో కూడా ఏ ప్రాంతాన్ని సందర్శించవచ్చు.

వేసవి

వేసవి సంవత్సరంలో ఎక్కువ భాగం ఏలగిరి లో ఒక మోస్తరు వాతావరణం ఉంటుంది. వేసవి మార్చ్ నుండి జూన్ వరకు ఉంటుంది. ఉష్ణోగ్రత 18 డిగ్రీల నుండి 34 డిగ్రీల మధ్య మారుతూ ఉంటుంది. మే, జూన్ మాసాలలో జరిగే మూడురోజుల వేసవి పండుగ ఇక్కడి ప్రధాన పర్యాటక ఆకర్షణ.

వర్షాకాలం

వర్షాకాలం ఏలగిరి లో వర్షపాతం జులై నుండి సెప్టెంబర్ మాసాలలో ఉంటుంది. ఇక్కడ వర్షపాతం అంత భారీగా కాకుండా లేదా మారీ తీవ్రంగా కాకుండా షుమారుగా ఉంటుంది. అయితే ఈ సమయంలో స్థల సందర్శనకు, పర్వతారోహణకు వర్షాలు ప్రతిబంధకంగా ఉంటాయి కాబట్టి ఏలగిరి సందర్శన సూచనప్రాయం కాదు.

చలికాలం

శీతాకాలం శీతాకాలం డిసెంబర్, ఫిబ్రవరి చివరి వరకు ఉంటుంది. ఈ సమయంలో ఉష్నోగ్రత11 డిగ్రీల నుండి 25 డిగ్రీల మధ్య మారుతూ ఉంటుంది. శీతాకాలం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది కావున ఏలగిరి సందర్శనకు ఉత్తమ సమయం. సంవత్సరంలో ఈ సమయంలో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి స్థలసందర్శనకు, పర్వతరోహనకు వెళ్ళవచ్చు.