ఏలగిరి - ప్రకృతి మాత ఒడిలో వారాంతపు విడిది!

ఎలగిరి గా కూడా పిలువబడే ఏలగిరి తమిళనాడు లోని వెల్లూరు జిల్లాలో ఉన్న చిన్న పర్వత కేంద్రం, పర్యాటకుల స్వర్గధామ౦. వలస రాజ్యం నాటి చరిత్ర ఏలగిరిది – అప్పట్లో ఈ ప్రాంతం అంతా ఏలగిరి జమీందార్లది, ఇప్పటికీ రెడ్డియూర్ లో వల్ల ఇల్లు వుంది. 1950 లలో ఏలగిరి భారత సంస్థానంలో విలీనం అయింది. సముద్ర మట్టానికి 1048 మీటర్ల ఎత్తున వున్న ఏలగిరి గిరిజనులు నివసించే 14 కుగ్రామాల సమూహం. వివిధ గిరిజన తెగలు వుండే ఏలగిరి – తమిళనాడు లోని ఊటి, కొడైకెనాల్ లాంటి ఇతర పర్వత కేంద్రాల్లా అభివృద్ది చెందలేదు. అయితే, ఇటీవలే ఏలగిరి జిల్లా యంత్రాంగం ఈ ప్రాంతంలో పేరా గ్లైడింగ్, పర్వతారోహణలాంటి సాహస క్రీడలను ప్రోత్సహిస్తోంది. ఏలగిరి రాగానే ఎవరికైనా కనిపించేది ఇక్కడి నిశ్శబ్ద, ప్రశాంత పరిసరాలు, ఈ ప్రాంతంలో వుండే అందం. ఇక్కడి తాజా పళ్ళ ఘుమఘుమలు, రాలిన ఆకులతో ఈ ప్రాంతం నిండిపోతుంది – ఎందుకంటే ఇక్కడ పళ్ళ తోటలు, గులాబి తోటలు, పచ్చటి లోయలు వున్నాయి. ఈ మైదానాల గుండా ప్రయాణించడం చాలా బాగుంటుంది.

కాలక్షేపాల ప్రాంతం

ఏలగిరి కొండలు సాహాసాన్ని ఇష్టపడే వారిలో ప్రసిద్ది చెందాయి. నిజానికి, ఇటీవలే దీన్ని మహారాష్ట్ర లోని పంచగని తరువాత రెండో ఉత్తమ సహజ క్రీడా ప్రాంతంగా గుర్తించారు. ఏలగిరిలో చాలా దేవాలయాలు వున్నాయి, ఇవి వృద్ధులకు, యువకులకు కూడా దీన్ని ఒక ఆకర్షణీయ పర్యాటక కేంద్రంగా తయారు చేసాయి. ఇక్కడ బోటింగ్ చేసి అందాలతో చుట్టుముట్టబడి వున్న ఈ ప్రాంతం మొత్తం చూడవచ్చు. ఇక్కడి పచ్చదనాన్ని కొండమీది నుంచి చూడవచ్చు – పర్యాటకులు టేలీస్కోప్ ద్వారా గ్రామీణ అందాన్ని చూడవచ్చు. నిలవూర్ సరస్సు బోటింగ్ చేయదగ్గ ప్రాంతాల్లో ఒకటి.

స్థల సందర్శన – రవాణా సౌకర్యాలు

వేలవన్ దేవాలయ౦, స్వామిమలై కొండ లాంటి పర్వత ప్రాంతాలు, పర్వతారోహణ లాంటి ఇతర సందర్శనీయ స్థలాలు కూడా ఇక్కడ వున్నాయి. ఇక్కడి సహజమైన పార్కులు, ప్రభుత్వ మూలికా, పండ్ల తోటలు ప్రకృతి ప్రేమికులను అలరిస్తాయి.

మీకు నక్షత్రాలను చూడడం ఇష్టమైతే, టెలిస్కోప్ హౌస్, వైను బప్పు సౌర పరిశోధనా సంస్ధ కి వెళ్ళడం మరవకండి. నవంబర్, ఫిబ్రవరి సమయంలో ఉండే శీతాకాలంలో ఏలగిరి సందర్శించడం ఉత్తమం. అయితే, సంవత్సరం పొడవున వాతావరణం ఒక మోస్తరుగా ఉంటుంది. వేసవి ఉష్ణోగ్రత 18, 34 డిగ్రీల మధ్య ఉంటుంది, అయితే శీతాకాలంలో ఉష్ణోగ్రత 11 నుండి 25 డిగ్రీల మధ్య ఉంటుంది. జులై, సెప్టెంబర్ మాసాలలో ఒక మోస్తరు వర్షపాతం ఉంటుంది. ఈ ప్రాంతం జనవరిలో జరుపుకునే పొంగల్ పండుగ, అక్టోబర్ లో జరుపుకునే దీపావళి పండుగ సమయంలో కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఏలగిరి లో ఈ రెండు పండుగలను ఎంతో ఉత్సాహంతో, వైభవంగా జరుపుకుంటారు. మే నెలలో మూడు రోజులు జరుపుకునే వేసవి పండుగ, కోడై విలా కూడా ఇక్కడి ప్రధాన పర్యాటక ఆకర్షణ.

ఏలగిరి బాగా అనుసంధానించబడి ఉంది, దీనిని తేలికగా చేరుకోవచ్చు. ఏలగిరికి బెంగళూర్ సమీప విమానాశ్రయం. ఈ విమానాశ్రయం నుండి, ఏలగిరి కి అద్దె కాబ్ లో చేరుకోవచ్చు. చెన్నై విమానాశ్రయం కూడా ఏలగిరి కి దగ్గర విమానాశ్రయ. ఏలగిరి కి జోలర్పెట్టై జంక్షన్ సమీప రైలు కేంద్ర౦, బస్సులు, కాబ్ లలో ఇక్కడికి తేలికగా చేరుకోవచ్చు. ఏలగిరికి తమిళనాడు లోని పొంనేరి నుండి రోడ్డు మార్గం ఉంది. చెన్నై, సాలెం, హోసూర్, బెంగళూర్ నుండి రోజువారీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. అయితే, బస్సు ప్రయాణం నిజంగా సుదీర్ఘం, ఖర్చుతో కూడుకున్నది. ఏలగిరి కి రైలులో లేదా డ్రైవ్ చేసుకుని వెళ్ళాలని సూచన. ఏలగిరి కి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలంటే మైలురాళ్ళు, సైన్ బోర్డ్ గుర్తులు ఆ మార్గంలో బాగా ఉన్నాయి, పెట్రోలు పంపులు కూడా తగినన్ని ఉన్నాయి. అయితే, కొండల వద్ద ఏమీ ఉండవు కాబట్టి నిల్వ ఉంచుకోవడం అవసరం. ఇది ఏలగిరి కి మృదువైన ప్రయాణం. మీరు ఇంటికి వెళ్ళేటపుడు ఒక సీసా తేనె, జాక్ ఫ్రూట్స్ కొనుక్కొని వెళ్ళడం మరవకండి, ఎందుకంటే తమిళనాడు లో మంచి తేనె ఏలగిరి లో దొరుకుతుంది. తేనెటీగల పెంపకంతో ఇ౦ట్లోనే తేనెని తయారుచేస్తారు. రాళ్ళపై, చెట్లపై అడవి తేనెటీగల వల్ల సహజ తేనె ఉత్పత్తి ఔతుంది, దీనిని కూడా స్థానికులు సేకరిస్తారు. అందువల్ల, మీరు ప్రకృతి మాత ఒడిలో కొంత సమయ౦ సేదతీరాలి అనుకుంటే ఏలగిరి ఖచ్చితమైన విరామ స్థలం.

Please Wait while comments are loading...