Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» శ్రిపెరంబుదూర్

శ్రిపెరంబుదూర్ -స్మారకాలు, రేస్ లు,

15

శ్రిపెరంబుదూర్ -స్మారకాలు, రేస్ లు, పరిశ్రమల ప్రదేశం, శ్రిపెరంబుదూర్ తమిళ్ నాడు లోని కాంచీపురం జిల్లాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఒక పర్యాటక పట్టణం. శ్రీ పెరంబుదూర్ కు పురాతన పేరు బూధపురి. శ్రీ పెరంబుదూర్ లో మరణించిన వారికి నెరుగా స్వర్గపు ద్వారాలు తెరచి ఉంటాయని చెపుతారు. ఇటీవలి కాలంలో శ్రీ పెరంబుదూర్ అనేక అంతర్జాతీయ సంస్థలకు నిలయంగా మారింది. ఈ సంస్థల కార్యాలయాలు ఇక్కడ కలవు. హ్యుండై కార్ల కంపెనీ మొట్ట మొదటగా ఈ పట్టణంలో 1999 లో దాని కార్యాలయం తెరచింది. వెనువెంటనే మరో పెద్ద కంపెనీ సెయింట్ గోబైన్ , నోకియ,ఫోర్డ్, బి ఎం డబ్లుయు, మిత్సుబిషి, హిందుస్తాన్ మోటార్స్ వారు మరీ ఇటీవలగా నిస్సాన్ కంపెనీ వారి ఆఫీస్ లు తెరచారు. ఈ పట్టణం వ్యూహాత్మకంగా బెంగుళూరు - చెన్నై హై వే లో చెన్నై కి 40 కి.మీ.ల దూరంలో కలదు. ఫలితంగా పట్టణం పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. మొత్తంగా పట్టణంలో రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడులు ప్రవహించటంతో ఇది 2008 నాటికి ఒక సెజ్ గా మారింది. ఫలితంగా ఈ పట్టణం దేశీయ, విదేశీయ పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తోంది.

శ్రిపెరంబుదూర్ చుట్టుపట్ల పర్యాటక ఆకర్షణలు

శ్రిపెరంబుదూర్ పట్టణంలో 1991 మే 21 వ తేదన మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధిని హత్య గావించా టంతో దేశ వ్యాప్తంగా ఈ పట్టణం అపకీర్తి పాలు అయ్యింది. తమిళ్ నాడు ప్రభుత్వం ఈ ప్రదేశాన్ని ఒక స్మారకంగా, రాజీవ్ గాంధీ మెమోరియల్ గా తీర్చి దిద్దింది. అనేక మంది పర్యాటకులు తమ శ్రద్ధాంజలి ఘటించేందుకు ఇక్కడకు వస్తారు.

ఈ పట్టణంలో 'మద్రాస్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్' మరొక ప్రధాన ఆకర్షణ. ఇది ప్రతి సంవత్సరం ఇక్కడ మోటార్ రేస్ లు నిర్వహిస్తుంది. సౌత్ ఇండియా రల్ల్య్ మరియు ఎయిర్ ఇండియా మోటార్ రేస్ మీట్ వంటివి మద్రాస్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ నిర్వహిస్తుంది. వీరు ప్రపంచ శ్రేణి స్థాయి ఫార్ముల 3 రేసింగ్ నిర్వహించెందుకు అనుమతులు పొందారు. కనుక ఈ రేస్ ల సీజన్లో అనేక మంది టూరిస్టులు ఇక్కడకు వస్తారు.

ఇతర ఆకర్షణలు అంటే వల్లకోట్టై మురుగన్ టెంపుల్. ఇది శ్రిపెరంబుదూర్ కు 10 కి.మీ.ల దూరంలో కలదు.

మరొక ఆకర్షణ తాంబరం థీమ్ పార్క్. దీనిని 1995లో నిర్మించారు. ఇది శ్రిపెరంబుదూర్ కు 25 కి. మీ.ల దూరంలో వుంటుంది. ఇంకా మద్రాస్ అటమిక్ పవర్ స్టేషన్ మరియు బ్రహ్మకుమారీల మ్యూజియంలు కూడా ఇతర ఆకర్షణలు. శ్రీ పెరంబుదూర్ వచ్చే పర్యాటకులు చెంగల్పట్టు ప్రదేశం తప్పక చూడాలి. ఈ పట్టణంలో అక్షరాస్యత అధికం. తమిళం అధికార భాషగా వుంటుంది.

శ్రీ పెరంబుదూర్ ఎలా చేరాలి ?

శ్రీ పెరంబుదూర్ ను బెంగుళూరు లేదా చెన్నైల నుండి తేలికగా చేరవచ్చు. ఈ రెండు మెట్రోల నుండి రెగ్యులర్ బస్సు లేదా ట్రైన్ సర్వీస్ లు కలవు. శ్రీ పెరంబుదూర్ పట్టణం లోపల ట్రావెల్ కూడా ప్రభుత్వ రవాణా బస్సులో సౌకర్యంగా వుంటుంది.

వాతావరణం

శ్రీ పెరంబుదూర్ వాతావరణం అధిక వేడి కలిగి వుంటుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు వేసవిలో 40 డిగ్రీలకు పైగా కూడా వుంటాయి. వర్షాలు జూన్ లో మొదలై సెప్టెంబర్ వరకూ పడతాయి. ఉష్ణోగ్రతలు ఈ సమయంలో తగ్గినప్పటికీ గాలిలో తేమ అధికంగా వుంటుంది. ఇక్కడ వింటర్ నెలలు డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకూ వుంటాయి. శ్రీ పెరంబుదూర్ సందర్శనకు ఇది మంచి సమయం. పర్యటన ఆహ్లాదకరంగా వుంటుంది.

శ్రిపెరంబుదూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

శ్రిపెరంబుదూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం శ్రిపెరంబుదూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? శ్రిపెరంబుదూర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం చెన్నై నుండి ప్రభుత్వ బస్సు లలో శ్రిపెరంబుదూర్ తేలికగా చేరవచ్చు. వ్యయం చాలా తక్కువ. చెన్నై నుండి బెంగుళూరు వెళ్ళే బస్సు ల లో శ్రీ పెరంబుదూర్ చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం శ్రిపెరంబుడుర్ కు తిరువళ్లూర్ రైలు స్టేషన్ 17 కి. మీ. ల దూరంలో కలదు. చెన్నై ప్రధాన రైలు స్టేషన్ . ఇక్కడనుండి టాక్సీలలో శ్రీ పెరంబుదూర్ చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం శ్రిపెరంబుడుర్ కు చెన్నై నుండి విమాన మార్గంలో చేరవచ్చు. సుమారు 30 కి.మీ.లదూరంలోవుంటుంది. ఎయిర్ పోర్ట్ నుండి టాక్సీ లలొ చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat