పుంగనూరు సరస్సు ఒక కృత్రిమ సరస్సు, ఇది పర్యాటకులను ఆకర్షిస్తూ, ఆ ప్రాంత అందాన్ని పెంచడానికి నిర్మించబడింది. పుంగ నూర్ సరస్సు ఏలగిరి లో అతిపెద్ద పర్యాటక ఆకర్షణ. ఇది 56.70 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది, ఈ సరస్సు ఏలగిరి హిల్స్ నడిబొడ్డున ఉంది.
ఈ సరస్సు, అక్కడ ఉన్న బోటింగ్ సౌకర్యాలని ఏలగిరి హిల్ అభివృద్ది సంస్ధ, పర్యాటక అభివృద్ది సంస్థ నిర్వహిస్తున్నారు. ఈ లేక్ బోటింగ్, రోయింగ్ సౌకర్యాలను కలిగిఉంది, ఇది విరామ ప్రదేశం వద్ద పర్యాటకులను ఈ కొండల అద్భుతమైన అందాలతో ఆనందపరచి ఆహ్లదపరుస్తుంది.
దీనికి దగ్గరలో ఒక అందమైన తోట ఉంది, ఇక్కడ ప్రజలు కూర్చుని, ఈ సరస్సు అందాలను చూసి ఆనందించవచ్చు. ఈ తోటలో ఫౌంటెన్, పిల్లల పార్క్ ఏర్పాటుచేయబడ్డాయి. ఇక్కడ వాటి ఆహరం కోసం వలస వచ్చే వివిధ రకాల పక్షులను కూడా చూడవచ్చు. అందుకే, ఈ ప్రదేశం నిజంగా ప్రకృతి ప్రేమికుల కోసం ఏర్పడింది.