హరముక్ పర్వత పాద భాగం లోగల వూలార్ సరస్సు సోపూర్,బండీపూర్ పట్టణాల మధ్యలో ఉంది. ఈ సరస్సుని ఆసియా ఖండం లో కేల్ల అతి పెద్ద మంచి నీటి సరస్సు గా గుర్తించారు.24 కి.మీ పొడవు,10 కి.మీ వెడల్పు కలిగిన ఈ సరస్సు 200 చదరపు మీటర్ల వైశాల్యం లో విస్తరించబడి ఉంది.
సూర్యాస్తమయం వీక్షించడానికి అనువైనదిగా ఇది ప్రసిద్ధి. జీలం నది ఈ సరస్సు కి ఆధారం. రాజా జైనులబ్దీన్ నిర్మించిన చిన్న ద్వీపం "జైన లంక" ఈ సరస్సు మధ్య లో ఉంటుంది.ఈ సరస్సు పురాతనమైన సతిసార్ సరస్సు లో భాగం గా కాశ్మీరు పురాతన కావ్యమైన నిల్మతపూర్ణ లో పేర్కొనపడినది.