అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

హంపి బడవ శివలింగం - ప్రపంచంలో అతి పెద్ద శివలింగాలలో ఒకటి !

Updated: Wednesday, May 17, 2017, 12:07 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

హంపి ... ఒక చారిత్రక పట్టణం మరియు ఒకప్పటి విజయనగర రాజుల రాజధాని. రాయల వారి కాలంలో హంపి సంస్కృతి, సంప్రదాయాలు ఉచ్ఛస్థితిలో ఉన్నాయి. ఈ పట్టణంలో హొయసలుల నాటి శిల్పకళాసంపద గోచరిస్తుంది. ఇతిహాసాలలో కూడా దీని గురించి పేర్కొన్నారు.

హంపి పట్టణం కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలో కలదు. అయినప్పటికీ తెలుగు మాట్లాడే ప్రజలు కానవస్తారు. బెంగళూరు మహానగరం నుండి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న హంపి పట్టణానికి బస్సులు అనేకం. బళ్లారి వరకు బస్సులో వెళ్లి అక్కడి నుండి హంపి చేరుకోవటానికి అనేక రవాణా సౌకర్యాలు ఉన్నాయి.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని 20 బెస్ట్ హెరిటేజ్ ప్రదేశాలు !

ప్రపంచంలో అతి పెద్ద శివలింగాలలో ఒకటి హంపి లోని బడవ శివలింగం. బడవ శివలింగం శ్రీ లక్ష్మి నరసింహ దేవాలయానికి దగ్గరలో కలదు. ఇది ప్రపంచంలోని అతి పెద్ద ఏకశిలా విగ్రహాలలో ఒకటి మరియు కర్ణాటకలోని అతిపెద్దఏకశిలా శివలింగాలలో మొదటిది.

మందిరం

అక్కడి శాశనాల ద్వారా తెలుస్తుంది. విరూపాక్షక దేవాలయానికి వెళ్ళేదారిలో కాస్త ముందుకే ఎడమవైపు పొలాలలోకి వెళితే బడవ శివలింగం ఉన్న మందిరం కనిపిస్తుంది. ఇది చూడటానికి ఒక చిన్న గది వలె కనపడుతుంది.

చిత్రకృప : Dr Murali Mohan Gurram

రూపాయిబిళ్ళ

బడవ శివలింగం మూడు కళ్ళు కలిగి ఉంటుంది. దానికి సూచనగా మూడు గీతలు శివలింగం పై చెక్కబడి ఉంటారు. ఇక్కడికి వెళ్లే ప్రతి యాత్రికుడు రూపాయి బిళ్ళను తీసుకొని శివుడి మూడో కన్నును తాకేటట్లు వేస్తారు. అలా తాకితే కోరిన కోరికలు నెరవేరతాయని భక్తుల విశ్వాసం.

చిత్రకృప : Sid Mohanty

ఆకర్షణ

ప్రస్తుతం గుడి యొక్క పైకప్పు శిధిలావస్థ కు చేరుకొని రంధ్రం కూడా పడింది. అందులో నుంచి వెలువడే సూర్యకాంతి సరాసరి శివుని మీద పడటం విశేషం.

చిత్రకృప : Klaus Nahr

నీరు

ఈ శివలింగం యొక్క మరో విశేషం ఏమిటంటే ... శివలింగం అన్ని కాలాలలోనూ మూడు అడుగుల మేర నీటితో నిండి ఉంటుంది. ఈ నీటిలోకి ఇతరులకు ప్రవేశం లేదు. రాతితో నిర్మించిన చిన్న కాలువల ద్వారా లోనికి వచ్చి మళ్ళీ అదే దారిలో నీరు బయటకు వెళుతుంది.

చిత్రకృప : Trollpande

పంటపొలాలు

ఈ రాతి కాలువలు శ్రీకృష్ణదేవరాయల కాలం నాటివి. ఇప్పటికీ ఈ కాలువలే వ్యవసాయానికి సాగు నీరు అందిస్తున్నాయి. హంపి ని సందర్శించే ప్రతి యాత్రికుడు ఈ బడవ శివలింగాన్ని ముక్కంటి శివుని ప్రతిరూపంగా భావించి సందర్శిస్తారు.

చిత్రకృప : La Priz

20 అడుగులు

శ్రీ లక్ష్మి నరసింహ విగ్రహం, రోడ్డున అనుకోని ఉన్న వీరభద్రస్వామి ఆలయం పక్కనే ఉంది. 20 అడుగుల ఎత్తైన ఈ ఏకశిలా విగ్రహం విజయనగా శిల్పకళా వైభవానికి నిదర్శనం. నరసింహుడు ఆది శేషుని పై కూర్చున్నట్లు ఉంటుంది.

చిత్రకృప : Eric00000007

ముష్కరులు

విజయనగర పాలన అనంతరం, కొంత మంది ముష్కరులు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. నాలుగు చేతులు, తొడపై కూర్చున్న లక్ష్మి దేవి అదృశ్యమైనవి. ఇప్పుడు లక్ష్మి దేవి కుడి చేయి కొంత భాగం మనకు కనిపిస్తుంది.

చిత్రకృప : Srikar.agnihotram

కృష్ణ భట్టు

క్రీ.శ. 1528 వ సంవత్సరంలో శ్రీకృష దేవరాయల ఆదేశానుసారం కృష్ణ భట్టు ఈ ఏక శిలా విగ్రహాన్ని స్థాపించెను. ఈ విగ్రహానికి సంబంధించిన పూర్వాపరాలు, చరిత్ర స్థానిక మ్యూజియంలో చూడవచ్చు.

చిత్రకృప : P4psk

ఇతర సందర్శనీయ స్థలాలు-1

హంపి బజారు, హంపి బజారులో ఫోటో ప్రదర్శనశాల, హొస్పెట్ అనంతశయన ఆలయం, సూలె బావి, కమలాపురం, పట్టాభి రామాలయం, గినిగిట్టి జైన్ దేవాలయం, మాల్యవంత రఘునాథ దేవాలయం, సరస్వతి ఆలయం, చంద్రశేఖరాలయం, మహారాణి స్నాన ఘట్టం, భోజనశాల, పాతాళేశ్వర్ ఆలయం, దండనాయకుని కోట, రాణివాస భవనం, పద్మ మహల్, గజశాల, కాలపాదారుల నివాస భవనం ఇంకా ...

చిత్రకృప : Naveen P.G

ఇతర సందర్శనీయ స్థలాలు-2

మాధవ / రంగ ఆలయం, ఎల్లమ్మ గుడి, శివాలయ సమూహం, హజార రామాలయం, దర్బార్ హాల్, రహస్య మందిరం, కోనేరు, దసరా దిబ్బ, అక్క- చెల్లెళ్ళ గుండ్లు, వీరభద్ర స్వామి ఆలయం, శ్రీకృష్ణా ఆలయం, గణపతి ఆలయం, అచ్యుత రామాలయం, సుగ్రీవుని గుహ, తులా భారం, విఠలాలయం, ఆనెగొంది, చింతామణి ఆశ్రమం మొదలుగునవి చూడదగ్గవి.

చిత్రకృప : Dineshkannambadi

వసతి

హంపి లో వసతికై హెరిటేజ్ రిసార్ట్ లు, హోటళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఏసీ, నాన్ - ఏసీ గదులు లభ్యమవుతాయి. హంపి కి సమీపాన ఉన్న బళ్లారి లో కూడా బస చేయవచ్చు. ఇక్కడ కూడా పెద్ద పెద్ద స్థార్ హోటళ్లు, రిసార్ట్ లు లభిస్తాయి. వెజ్ - నాన్ వెజ్ భోజనం లభిస్తుంది.

హంపి హోటళ్ళ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

చిత్రకృప : telugu native planet

బళ్లారి

వాయు మార్గం

బళ్ళారి సమీపాన ఉన్న దేశీయ విమానాశ్రయం. బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాల నుండి విమానాలు తరచూ వస్తుంటాయి. 307 కి.మీ ల దూరంలో బెంగళూరు, 358 కి.మీ ల దూరంలో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాలు కలవు.

రైలు మార్గం

హంపికి సమీపాన 13 కి.మీ ల దూరంలో హొస్పెట్ రైల్వే స్టేషన్ కాలదు. బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాల నుండి రైళ్లు వస్తుంటాయి.

బస్సు మార్గం/ రోడ్డు మార్గం

బెంగళూరు, హైదరాబాద్, కర్నూలు, చిత్రదుర్గ, మహబూబ్ నగర్ తదితర ప్రాంతాల నుండి బళ్లారి కి బస్సులు నడుస్తుంటాయి. బళ్లారి నుండి ప్రతిరోజూ ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు నడుస్తాయి.

చిత్ర కృప : Indi Samarajiva

English summary

Hampi Badava Shivlinga Facts !

You must known some facts about Badava Shivlinga in Hampi. The fact is ..
Please Wait while comments are loading...