Search
  • Follow NativePlanet
Share
» »వోఖ - లోథాల భూమి !

వోఖ - లోథాల భూమి !

By Mohammad

వోఖ, నాగాలాండ్ రాష్ట్రంలో దక్షిణ భాగంలో ఉన్న చిన్న పట్టణం. ఇది నాగాలాండ్ లో అతి పెద్ద తెగ లోథాలకు నివాస ప్రాంతము. చాలా మంది లాగే వీరు కూడా బయటి ప్రపంచముతో సంబంధం లేకుండా ఉంటారు. బ్రిటీష్ వారు వచ్చాక వోఖ కు మహర్దశ పట్టుకుంది. ఈ ప్రాంతం చుట్టూ ఉన్న కొండలను, పర్వత పంక్తులను పర్యాటకానికి అనుకూలంగా మార్చారు.

వోఖ లో నివసించే లోథా తెగవారు సౌమ్యులు. వీరు పర్యాటకులను చేతులు జోడించి నమస్కరిస్తూ సాదరంగా ఆహ్వానిస్తారు. ఈ పట్టణం చేతితో తయారుచేసిన శాలువాలకు ప్రసిద్ధి చెందినది. ముఖ్య గమనిక, భారతీయులు నాగాలాండ్ లో ప్రవేశించటానికి అంతర్గతంగా అనుమతి తీసుకోవలసి ఉంటుంది. న్యూ ఢిల్లీ, కోల్కతా, గువాహటి, నాగాలాండ్ హౌస్ లలో ఈ అనుమతులు తీసుకోవచ్చు లేదా దిమాపూర్ ,కోహిమా, మొకోక్చుంగ్ డిప్యూటీ కమీషనర్ కార్యాలాలయాలలో దరఖాస్తు చేసుకొని కూడా అనుమతి పొందవచ్చు. వోఖ లోని పర్యాటక ఆకర్షణల విషయానికి వస్తే ...

డోయాంగ్ నది

డోయాంగ్ నది

చిత్రకృప : Murari Bhalekar

డోయాంగ్ నది

డోయాంగ్ నది నాగాలాండ్ లో ప్రవహించే అతి పెద్ద నదులలో ఒకటి. వోఖ జిల్లా వాసులకు ఇది ప్రాధాన నీటి వనరు. సుమారు ఈ జిల్లా గుండా 21 కి. మీ ల వరకు ప్రవహిస్తుంది. స్థానిక గిరిజనులు దీనిని 'జూ' లేదా 'జూలు' అని పిలుస్తారు. ఈ నదీ లోయ ప్రకృతి ప్రేముకులను ఆకట్టుకుంటుంది.

<strong>నాగాలాండ్ పర్వత ప్రదేశం - కిఫిరే !</strong>నాగాలాండ్ పర్వత ప్రదేశం - కిఫిరే !

లిఫన్యాన్ గవర్నర్ విడిది

వోఖ జిల్లాలో పర్వత పాదాల కింద ఉన్న లిఫన్యాన్ గవర్నర్ విడిది పర్వతారోహణకు, చేపలు పట్టడానికి ఉత్తమ ప్రదేశం. దిమాపూర్ నుండి 43 కి. మీ ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం తెప్పలు నడపడం, చేపలు పట్టడం, విహార యాత్రకు అనుకూలమైనది.

మౌంట్ టియి

మౌంట్ టియి

చిత్రకృప : telugu native planet

మౌంట్ టియి

వోఖ పట్టణంలో ప్రసిద్ధి చెందిన మరో ప్రధాన ఆకర్షణ మౌంట్ టియి. స్థానిక పురాణ కథనం ప్రకారం, ఒకప్పుడు ఇక్కడి శిఖరాలలో పండ్ల తోటలను అదృష్టవంతులు మాత్రమే చూసేవారు. ప్రస్తుతం ఇక్కడ రంగురంగుల రోడో డెండ్రాన్ లు కనపడతాయి. స్థానిక తెగలు ఈ ప్రాంతాన్ని వారి పూర్వీకులు నివశిస్తున్న ప్రాంతంగా నమ్ముతారు.

పెరెన్ - ప్రకృతిచే దీవించబడ్డ 'భూమి' !పెరెన్ - ప్రకృతిచే దీవించబడ్డ 'భూమి' !

సైట్ సీఇంగ్

ఈ శిఖరం పై నుండి అద్భుత సూర్యోదయ, సూర్యాస్తమ దృశ్యాలను చూడవచ్చు. టియి పర్వతం పర్వతారోహణ, రాళ్లు ఎక్కడం వంటి వంటి సాహసోపేత క్రీడలకు ప్రసిద్ధి చెందినది. వేసవిలో మౌంట్ క్లైమ్బింగ్ చేయటానికి పర్యాటకులు వస్తుంటారు.

అద్భుతమైన లోయదృశ్యాలు

అద్భుతమైన లోయదృశ్యాలు

చిత్రకృప : telugu native planet

మౌంట్ తొట్స్

వోఖ సముద్రమట్టానికి 1,250 అడుగుల ఎత్తులో ఉన్న మౌంట్ తొట్స్ శిఖరం సాహసోపేత క్రీడలకు సూచించదగినది. ఎత్తులో ఉండే ఈ ప్రదేశం నుండి లోయలోని అందమైన ప్రకృతి దృశ్యాలను చూడవచ్చు. శిఖరం పైన పర్యాటక శాఖ కు సంబంధించిన శిబిరం కలదు.

తోఖు ఏమంగ్ ఉత్సవం

తోఖు ఏమంగ్ ఉత్సవం

చిత్రకృప : telugu native planet

ఉత్సవాలు

పంట కొత తర్వాత 9 రోజులపాటు నిర్వహించే ఉత్సవం తోఖు ఏమంగ్ పండగ. పండగ సందర్బంగా స్త్రీ, పురుషులు రంగురంగుల సంప్రదాయ దుస్తులు ధరించి అందంగా ముస్తాబవుతారు. ప్రతిఏటా నవంబర్ నెలలో జరిగే ఈ వేడుక సంప్రదాయ సంగీత, నృత్యాలతో మిళితమైఉంటుంది.

<strong>నాగాలాండ్ అద్భుత ప్రదేశం !</strong>నాగాలాండ్ అద్భుత ప్రదేశం !

వంఖోసంగ్

క్రైస్తవ మూలాలు తెలుసుకోవాలనుకొనేవారు వోఖ పట్టణానికి 4 కి. మీ ల దూరంలో ఉన్న వంఖోసంగ్ ను దర్శించవలసి ఉంటుంది. ఇక్కడ మొదటి అమెరికా బాపిస్ట్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. పర్వత శిఖరాలతో, లోయలతో, చుట్టూ పచ్చదనంతో ఈ ప్రదేశం నిండి ఉంటుంది.

వోఖ పట్టణం ఏరియల్ వ్యూ

వోఖ పట్టణం ఏరియల్ వ్యూ

చిత్రకృప : Abs odyuo

ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : 132 కిలోమీటర్ల దూరంలో దిమాపూర్ విమానాశ్రయం కలదు. అక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీ లలో వోఖ పట్టణానికి చేరుకోవచ్చు.

రైలు మార్గం : దిమాపూర్ సమీప రైల్వే స్టేషన్. కలకత్తా, గువాహటి తదితర ప్రాంతాల నుండి స్టేషన్ మీదుగా రైళ్లు నడుస్తాయి.

రోడ్డు మార్గం : కోహిమా, దిమాపూర్ తదితర సమీప పట్టణాల నుండి వోఖ కు ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు తిరుగుతాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X