అహ్మద్ నగర్ లో కోట్ బాగ్ నిజాం అనేది అధిక పర్యాటకులు సందర్శించే స్ధలం. గార్డెన్ ఆఫ్ విక్టరీగా పేరొందిన కోట్ బాగ్ నిజాం ను అహ్మద్ నిజాం షా 1499 సంవత్సరంలో నిర్మించాడు. ఇతనినే మాలిక్ అహ్మద్ అని కూడా అనేవారు. బహమని రాజులపై తాను గెలుపొందిన విజయానికి చిహ్నంగా ఈ గార్డెన్ నిర్మాణం చేశాడు. షా నగర స్ధాపనను సైనా నది ఒడ్డున 1494 సంవత్సరంలో తాను తన రాజధానిని జున్నార్ నుండి అహ్మద్ నగర్ కు బదిలీ చేస్తున్నపుడు చేశాడు. దౌలతాబాద్ కోటను వశం చేసుకొని బహమని రాజ్యాన్ని కొల్లగొట్టాడు. అదే సమయంలో దీని నిర్మాణం చేశాడు.



Click it and Unblock the Notifications