రీక్ అనేది ఒక చిన్న గ్రామం, ఇది ఐజవాల్ కు పడమర దిశగా పది కి. మీ. ల దూరం లో వుంటుంది. ఇది చాలా ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. విలేజ్ కి తూర్పున అందమైన కొండలు వాటిలో తొలచిన గుహలు వుంటాయి. ఇక్కడే సహజ అడవులు కూడా చూడవచ్చు. ఈ విలేజ్ లో మిజో ల ప్రత్యేకత అయిన వారి గుడిసెలు చూడవచ్చు. వీటిని టూరిజం శాఖ నిర్వహిస్తోంది. ఇక్కడ మిజో తెగ నాయకుని నివాసం, బాచేలర్ల వసతి కలవు. ఈ నిర్మాణాలు మిజో సంస్కృతి కలిగి వుంటాయి.
రీక్ గ్రామం లో ప్రతి ఏట అన్తూరియుం పండుగ జరుగుతుంది. ఇది పూవులా సాగు వాటి అమ్మకాలను సూచిస్తుంది. ఈ పండుగలో వీరు అనేక మ్యూజిక్ ప్రోగ్రాం లు, ఆటలు, ఫాషన్ షో లు నిర్వహిస్తారు. పక్షి ప్రియులకు ఇక్కడి అడవులు ఆకర్షనీయం. వివిధ రకాల పక్షులు, ఇక్కడి కొండలలో చూడవచ్చు. ఇక్కడి కొండలలో ప్రకృతి దృశ్యాలు చూడటం తో పాటు, ట్రెక్కింగ్ అవకాశాలు కూడా కలవు.
రీక్ గ్రామం కు ఐజవాల్ నుండి టూరిస్ట్ వాహనం లో ఒక గంటలో మార్గం లోని ప్రకృతి దృశ్యాలను ఆనందిస్తూ చేరవచ్చు.



Click it and Unblock the Notifications