Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అజ్మీర్ » వాతావరణం

అజ్మీర్ వాతావరణం

సందర్శనకు సరైన సమయం: అజ్మీర్ ను సందర్శించడానికి సంవత్సరంలో అక్టోబర్, మార్చ్ మధ్య సమయం సరైనది, ఆ సమయంలో వాతావరణం చల్లగా, తెమలేకుండా ఉంటుంది. వర్షాకాలంలో కూడా ఈ ప్రదేశాన్ని సందర్శించవచ్చు, ఎందుకంటే వర్షంలో ఈ నగరం చాలా అందంగా కనిపిస్తుంది. వేసవిలో వాతావరణం చాలా వేడిగా ఉండటం వల్ల ఈ సమయంలో అజ్మీర్ సందర్శించడం సరైనది కాదు.

వేసవి

 అజ్మీర్ లో సంవత్సరంలో చాలా భాగం బాగా వేడి వాతావరణాన్ని కలిగిఉంటుంది. వేసవి (ఏప్రిల్ నుంచి జులై వరకు): అజ్మీర్ లో, రాజస్తాన్ లోని ఇతర ప్రాంతాల వలె ఉష్ణోగ్రత 28c, 40c తో వేసవిలో ఎక్కువ వేడిని కలిగిఉంటుంది. వేసవి సమయంలో యాత్రీకులు అజ్మీర్ సందర్శనకు ఇష్టపడరు.

వర్షాకాలం

వర్షాకాలం (జూన్ నుంచి సెప్టెంబర్ వరకు): అజ్మీర్ లో జూన్, సెప్టెంబర్ మధ్య 55 సెంటీమీటర్ల వర్షపాతం ఉంటుంది. ఈ కాలంలో ఉరుములతో కూడిన వర్షాలు ఉంటాయి.

చలికాలం

శీతాకాలం (నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు): శీతాకాలం లో అజ్మీర్ లో 15c నుంచి 18c సగటు ఉష్ణోగ్రతతో ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సమయంలో తేమ అసలు ఉండదు లేదా చాలా తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో వాతావరణం అజ్మీర్ సందర్శించడానికి అనువైనది.