1500 శతాబ్దం నుంచి పేరెన్నికగన్నది ఈ సెయింట్ ఆండ్రూ స్ చర్చ్. ఆ సమయంలో దండయాత్ర చేసిన పోర్చుగీసులు ఈ చర్చ్ ని చెక్క మరియు రాళ్ళతో పునర్నిర్మించారు. కాలక్రమంలో ఈ చర్చ్ ప్రఖ్యాతిగాంచడం వల్ల వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సంఖ్యను తట్టుకునే విధంగా పునరుద్దరించబడినది.
సెయింట్ సెబాస్టియన్ విందు ఈ చర్చ్ లో జరిగే ప్రధాన పండుగ. ఈ చర్చ్ కి సంబంధించి ఎన్నో చారిత్రక గాధలు, జానపద కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. స్థానిక ఆచారాలు ఇక్కడ ఆరాధనలో అంతర్భాగమయ్యాయి. కొంత మంది భక్తులు ఇక్కడ ముడుపులు చెల్లిస్తారు. తీరం వెంబడి నడుస్తూ ఇతరులు ఇచ్చే పండ్లు, పానియాలని స్వీకరిస్తారు. మానవత్వాన్ని ప్రతిఫలించే ఈ ఆచారం పురాతన కాలం నించి సంక్రమించింది. అలెప్పి నుండి ఈ ప్రాంతం 25 కిలోమీటర్ల దూరంలో ఉంది.



Click it and Unblock the Notifications