రాం బాగ్ ఒక వేసవి విడిది. ఇక్కడ పంజాబ్ పాలకుడు మహారాజ రంజిత్ సింగ్ వేసవి విడిది భవనం కలదు. దీనిని ఇపుడు ఒక మ్యూజియంగా మార్చారు. పూర్వం దీనిని కంపెనీ గార్డెన్ అనేవారు. అయితే, దీని అందాలకు ముగ్దుడైన నగర వ్యవస్థాపకుడు, గొప్ప మహర్షి అయిన గురు రాం దాస్ జి పేరు పెట్టారు. లాహోరు లోని షాలిమార్ గార్డెన్ ను పోలి అందంగా వుండే ఈ గార్డెన్ అమ్రిత్ సర్ లో తప్పక చూడదగిన పర్యాటక ఆకర్షణ.
గార్డెన్ లో కర్నిఫెరాస్ చెట్లు, హెర్బల్ మొక్కలు , నీటి కాలువలు , ఫౌంటెన్ లు బంగారు చేపలు, వంటివి ఎన్నో కలవు. పచ్చదనాల మధ్య మహారాజ రంజిత్ సింగ్ జీవిత కాల సంఘటనల చిత్రాలు వుంటాయి. గార్డెన్ లో ప్రవేశంలో పెద్ద గేటు వుంటుంది. అక్కడే గుర్రం పై స్వారి చేస్తూ అందమైన భంగిమలో రాజు విగ్రహం కూడా వుంటుంది.



Click it and Unblock the Notifications