ఆకల తఖ్త్ అంటే అర్ధం... అంతులేని సింహాసనం అని. ఖాల్సా కు ఇది ఒక ఉన్నత పదవి. సిక్కుల ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఇది ఒక కేంద్ర బిందువు. ఆరవ సిక్కు గురువు గురు హరగోవింద్ జి చే నిర్మించబడిన ఈ తక్త్ అన్నిటికంటే పురాతనమైనది మరియు ఇండియా లో మిగిలిన అయిదు తఖ్త్ ల కంటే శక్తిమంత మైనది. అమ్రిత్సర్లోని హరమందిర్ సాహిబ్ కాంప్లెక్స్ లో కల ఈ శ్రీ ఆకల తఖ్త్ ప్రత్యేకించి సిక్కు పర్యాటకులకు తప్పక సిఫార్సు చేయ దగిన పర్యాటక ఆకర్షణ.
సిక్కు జాతి అధికారానికి ప్రతీక అయిన ఈ అయిదు అంతస్తుల భవనం లో చక్కని మార్బుల్ నిర్మాణాలు, బంగారు పూత డోమ్, సెమి సర్కులర్ ప్లాట్ ఫారం వంటివి కలవు. పగటి పూట గోల్డెన్ టెంపుల్ లో వుంచబడే ఆది గ్రంధ రాత్రులలో శ్రీ ఆకల తఖ్త్ ఆవరణలోకి మార్చబడుతుంది. మీరు ఇక్కడ 1984 లో గోల్డెన్ టెంపుల్ పై జరిగిన దాడి లో సిక్కులు ఉపయోగించిన ఆయుధాలు కూడా చూడవచ్చు.



Click it and Unblock the Notifications