Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అరకు వాలీ » వాతావరణం

అరకు వాలీ వాతావరణం

  ఉత్తమ సీజన్ అరకు వాలీ సందర్శన అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు చాలా బాగుంటుంది. ఈ సమయం లో వాతావరణం ఆహ్లాదకరం. మధ్యాహ్నాలు కూడ చల్లగా వుండి పర్యటనకు అనుకూలం. అయితే, రాత్రులందు మాత్రం పర్యాటకులు తప్పక ఉన్ని దుస్తులు, శాలువలు, దట్టమైన దుప్పట్లు వాడాలి.  

వేసవి

వేసవి వేసవి లో అరకు వాలీ ఒక మోస్తరు వేడి గా వుంటుంది. వేసవి మార్చ్ లో మొదలై మే చివరి వరకూ వుంటుంది. వేసవి లో టెంపరేచర్ 30 డిగ్రీలు మించి వుండదు. మధ్యాహ్నాలు కొద్దిపాటి వేడి అయినా సాయంకాలాలు చల్లగా, ఆహ్లాదంగా వుంటాయి.  

వర్షాకాలం

వర్షాకాలం ఈ వాలీ లో వర్షాకాలం జూన్ లో మొదలవుతుంది. వర్షాలు ఒక మోస్తరు నుండి అధికంగా కూడా వుంటాయి. సెప్టెంబర్ వరకూ కొనసాగుతాయి. అక్టోబర్, నవంబర్ ల లో కూడా కొద్దిపాటి జల్లులు పడతాయి. ఉష్ణోగ్రతలు సుమారు 25 డిగ్రీలు గా వుండి వాతావరణం ఆహ్లాదకరంగా వుంటుంది.  

చలికాలం

శీతాకాలం అరకు వాలీ లో శీతాకాలం నవంబర్ లో మొదలై ఫిబ్రవరి వరకూ వుంటుంది. వాలీ లో చల్లగా వుంటుంది. టెంపరేచర్ 20 డిగ్రీలు గా వుంది ఆహ్లాదం గా వుంటుంది. 23 డిగ్రీలకు మించదు. సాయంత్రాలు, రాత్రులు చలిగా వుంటాయి.